వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పీఎన్బీ స్కాం: నీరవ్ మోడీకి ఈడీ షాక్, రూ.637కోట్ల ఆస్తుల జప్తు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో 13వేల కోట్ల రూపాయల మోసానికి పాల్పడి దేశం నుంచి పారిపోయిన ప్రముఖ వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మరిన్ని చర్యలు చేపట్టింది. నీవర్, ఆయన కుటుంబసభ్యులకు చెందిన దాదాపు రూ.637కోట్ల ఆస్తులను జప్తు చేసినట్లు ఈడీ వెల్లడించింది.

భారత్ సహా ఐదు దేశాల్లో ఉన్న ఈ ఆస్తులను ఈడీ స్వాధీనం చేసుకుంది. భారత్, యూకే, అమెరికాల్లోని స్థిరాస్తులు, ఆభరణాలు, ఫ్లాట్లు, బ్యాంకు బ్యాలెన్స్‌లు, తదితర ఆస్తులను జప్తు చేసినట్లు పేర్కొంది. దర్యాప్తులో భాగంగా భారత ఏజెన్సీ విదేశాల్లోని నిందితుల ఆస్తులను జప్తు చేసిన కేసులు చాలా అరుదు.

PNB fraud: ED attaches assets worth Rs 637 crores of Nirav Modi

మనీలాండరింగ్ నిరోధక చట్టం(పీఎంఎల్ఏ) ఆధారంగా కేంద్ర దర్యాప్తు సంస్థ నుంచి వచ్చిన వివిధ ఆదేశాల మేరకు నీరవ్ మోడీ ఆస్తులను జప్తు చేసినట్లు ఈడీ తెలిపింది.

ఈ కేసులో నిందితుడిగా ఉన్న ఆదిత్య నానావటిపై ఇంటర్ పోల్ రెడ్ కర్నార్ నోటీసులు కూడా జారీ చేసినట్లు వెల్లడించింది. పీఎన్బీ స్కాంలో వజ్రాల వ్యాపారులైన నీరవ్ మోడీ, మెహుల్ ఛోక్సీలు ప్రధాన నిందితులుగా ఉన్న విషయం తెలిసిందే.

English summary
The Enforcement Directorate (ED) on Monday attached properties and bank accounts to the tune of Rs 637 crore in Nirav Modi case. The seizure includes jewellery/bank accounts/immovable properties in India as well as four foreign juridictions under section 5 of Prevention of Money Laundering Act. The is one of the rare cases where the investigation agency has seized the properties abroad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X