వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పీఎన్‌బీ స్కాం: నేను ఇండియాకు రాను.., సీబీఐకి మెహుల్ చోక్సీ ఘాటైన లేఖ!

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్‌బీ) కుంభకోణం ప్రధాన నిందితుల్లో ఒకరైన గీతాంజలి గ్రూప్ ప్రమోటర్ మెహుల్ చోక్సీ సీబీఐకి ఓ ఘాటైన లేఖ రాశాడు. 'నా పాస్‌పోర్ట్‌ను సస్పెండ్ చేశారు. నా పాస్‌పోర్టు రద్దుకు కారణమేంటో ముంబై రీజినల్ పాస్‌పోర్ట్ ఆఫీస్ వివరణ ఇవ్వలేదు. నాతో దేశానికి వచ్చిన ముప్పేంటో చెప్పలేదు..' అని ఆ లేఖలో పేర్కొన్నాడు.

Recommended Video

Punjab National Bank Scam : ED Raids Nirav Modi Properties

12,600 కోట్ల పీఎన్‌బీ కుంభకోణంలో వజ్రాల వ్యాపారి నీరవ్‌మోడీతోపాటు చోక్సీ కూడా నిందితుడిగా ఉన్నాడు. ఫిబ్రవరి 14న నీరవ్‌మోడీ, చోక్సీతోపాటు ఇతర కుటుంబ సభ్యులపై సీబీఐ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. ఈ స్కాం బయటపడకముందే వీరంతా దేశం వదిలి పారిపోయారు.

PNB fraud - Passport revoked, probe biased so can’t come back to India, Mehul Choksi tells CBI

తనకు వ్యతిరేకంగా మీడియా జరుపుతున్న విచారణ కారణంగానే పాస్‌పోర్ట్ రద్దు చేశారని కూడా సీబీఐకి రాసిన 7 పేజీల లేఖలో మెహుల్ చోక్సీ ఆరోపించాడు. భారత్ వస్తే తన కుటుంబ సభ్యులకు ప్రమాదం పొంచి ఉందని, విచారణ కూడా పక్షపాతంగానే జరుగుతుందని పేర్కొన్నాడు. తనకు ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నాయని, తనను అరెస్ట్ చేస్తే సరైన వసతులు కూడా ఇవ్వరన్న ఆందోళన తనకు ఉన్నట్లు పేర్కొన్నాడు.

అనారోగ్య సమస్యల కారణంగా ఇప్పుడు ప్రయాణించే పరిస్థితుల్లో కూడా తాను లేనని, తనకు గుండె సంబంధిత చికిత్స జరుగుతోందని, ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించుకునే అవకాశం కూడా ఇస్తారో లేదో తెలియదని, అందుకే తాను ఇండియాకు రాదలుచుకోలేదని మెహుల్ చోక్సీ పేర్కొన్నాడు.

English summary
In a fresh seven-page letter to the Central Bureau of Investigation (CBI), Mehul Choksi, one of the accused in the Rs 12,600 crore Punjab National Bank fraud, on Thursday said he would not return to India as his passport has been revoked, his family and he face a threat in the country, and the investigations underway are unfair. The “issue”, the diamond merchant said, has been politicised by parties “with a view of glorifying their own interests”. Nirav Modi’s maternal uncle also claimed he was not in a position to travel because of a persisting health problem. “I had a cardiac procedure in the first week of February 2018, and there is still work pending on the same. The entire procedure could not be completed on all veins due to the danger to the kidney, and therefore I am not allowed to travel for at least a period of four to six months,” Choksi said in the letter.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X