వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పిఎన్‌బి స్కామ్: విదేశాలకు చెక్కేసిన నీరవ్ మోడీ

By Pratap
|
Google Oneindia TeluguNews

Recommended Video

PNB Fraud : Nirav Modi Flees India, Who Is He ?

ముంబై: పంజాబ్ నేషనల్ బ్యాంక్ భారీ కుంభకోణం ప్రధాన సూత్రధారి, ప్రముఖ వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ దేసం విడిచి పారిపోయారు. పిఎన్‌బి ఎఫ్ఐఆర్ నమోదు చేయక ముందే ఆయన భారత్ విడిచి పారిపోయినట్లు తెలుస్తోంది.

ఆయన స్విట్జర్లాండ్‌కు పారిపోయినట్లు చెబుతున్నారు. నీరవ్ మోడీపై పంజాబ్ నేషనల్ బ్యాంక్ సిబిఐ వద్ద రెండు ఫర్యాదు దాఖలు చేసింది. ఆయనపై సిపిఐతో పాటు ఈడి మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది.

తాను సిద్ధంగా ఉన్నానని

తాను సిద్ధంగా ఉన్నానని

తాను రూ.5000 కోట్లు తిరిగి బ్యాంకుకు చెల్లించేందకు సిద్ధంగా ఉన్నట్లు నీరవ్ మోడీ చెబుతున్నారు. తాను ఆరు నెలల లోపల ఆ మొత్తాన్ని చెల్లిస్తానని ఆయన బ్యాంకుకు లేఖ రాసినట్ల తెలుస్తోంది. ఈ కుంభకోణం ప్రభావం 30 బ్యాంకులపై పడింది.

మోడీకి ప్రియాంక చోప్రా నోటీసులు

మోడీకి ప్రియాంక చోప్రా నోటీసులు

నీరవ్ మోడీ వజ్రాల వ్యాపారానికి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా నోటీసులు ఇచ్చింది. వజ్రాల వాణిజ్య ప్రకటనలకు తనకు రెమ్యునరేషన్ చెల్లించకపోవడంపై ఆమె ఈ నోటీసులు ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.

ఈ బ్యాంకులు కూడా రుణాలు

ఈ బ్యాంకులు కూడా రుణాలు

పంజాబ్ నేషనల్ బ్యాంక్ మాత్రమే కాకుండా యూనియన్ బ్యాంక్, ఎస్‌బిఐ ఓవర్సీస్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, అలహాబాద్ బ్యాంకు కూడా నీరవ్ మోడీకి రుణాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బడా ఆభరణాల సంస్థలపై దర్యాప్తు సంస్థలు విచారణ చేపపడుతున్నాయి. కుంభకోణం నేపథ్యంలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ షేర్ విలువ రెండు రోజుల్లోదాదాపు 17 శాతం పతనమైది. ప్రముఖ జ్యువెల్లరీ కంపెనీల షేర్లు కూడా పడిపోతున్నాయి.

ఇది కొత్త మోడీస్కామ్

ఇది కొత్త మోడీస్కామ్

నీరవ్ మోడీ విదేశాలు పారిపోయిన నేపథ్యంలో ప్రతిపక్షాలు మోడీ ప్రభుత్వంపై తీవ్రంగా ధ్వజమెత్తుతున్నాయి. ఇది కొత్త మోడీ స్కామ్ అని కాంగ్రెసు నేత రణదీప్ సుర్జేవాల ట్విట్టర్‌లో వ్యాఖ్యానించారు. నీరవ్ మోడీ ఎవరు, న్యూ మోడీస్కామ్, ప్రభుత్వంలోని ఎవరో ఒకరి సాయంతో లలిత్ మోడీ, విజయ్ మాల్యా మాదిరిగా పారిపోయాడా అని ఆయన అన్నారు. ప్రభుత్వం సొమ్ముతో వ్యక్తులు పారిపోనిస్తున్నారా, దీనికి బాధ్యులెవరు అని ఆయన అన్నారు.

కేజ్రీవాల్ వ్యాఖ్య ఇలా...

కేజ్రీవాల్ వ్యాఖ్య ఇలా...

అతను లేదా విజయ్ మాల్యా దేశం విడిచి పారిపోవడం బిజెపి ప్రభుత్వంలోనివారి ప్రమేయం లేకుండా సాధ్యమా అని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రశ్నించారు. సీతారాం ఏచూరి కూడా ఆ సంఘటనపై స్పందించారు. నీరవ్ మోడీ పరారీపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.

English summary
The key person in Punjab National bank (PNB) scam fled from India to Switzerland before FIR was filed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X