వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పీఎన్బీ స్కాం: 9ఖరీదైన మోడీ కార్లు సీజ్, వాటిలో రోల్స్ రాయిస్, బెంజ్..!

|
Google Oneindia TeluguNews

Recommended Video

PNB Fraud: ED Seized Nirav Modi's Luxury Cars

ముంబై: పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ)లో 11వేల కోట్ల కుంభకోణానికి పాల్పడిన నగల వ్యాపారవేత్త నీరవ్ మోడీ కేసులో సీబీఐ, ఈడీ దూకుడు చూపుతున్నాయి. ఇప్పటికే దేశ వ్యాప్తంగా నీరవ్ మోడీ ఆస్తులను సీజ్ చేస్తున్న ఈడీ.. తాజాగా మరిన్ని ఆస్తులను సీజ్ చేసింది.

పీఎన్బీ స్కాంలో ప్రధాన నిందితులైన నీరవ్ మోడీ, మెహుల్ చోక్సీ గ్రూప్స్‌కు సంబంధించిన రూ.94కోట్ల విలువైన షేర్లు, మ్యూచువల్ ఫండ్స్‌ను గురువారం ఎన్‌ఫోర్స్ డైరెక్టరేట్(ఈడీ) సీజ్ చేసింది.

9విలాసవంతమైన కార్లు సీజ్

9విలాసవంతమైన కార్లు సీజ్

వీటితోపాటు నీరవ్ మోడీకి చెందిన 9 విలాసవంతమైన కార్లను కూడా స్వాధీనం చేసుకుంది. వీటిలో ఒక రోల్స్ రాయిస్ ఘోస్ట్, రెండు మెర్సిడెస్ బెంజ్ మోడీల్స్ జీఎల్ 350సీడీఐ, పోర్చె పనమెర, మూడు హోండా కార్లు, ఒక టాయోటా ఫార్చూనర్, టాయోటా ఇన్నోవాలు ఉన్నాయి.

పీఎన్బీ స్కాంపై చర్యలు తీసుకోండి: సుప్రీంకోర్టు, ‘పీఎన్బీ మాట మార్చింది' పీఎన్బీ స్కాంపై చర్యలు తీసుకోండి: సుప్రీంకోర్టు, ‘పీఎన్బీ మాట మార్చింది'

షేర్లు, మ్యూచువల్ ఫండ్లు కూడా

షేర్లు, మ్యూచువల్ ఫండ్లు కూడా

నీరవ్ మోడీకి చెందిన రూ. 7.80కోట్ల విలువైన మ్యూచువల్ ఫండ్స్, షేర్లు, మెహుల్ చోక్సీ గ్రూప్‌కి సంబంధించిన రూ.86.67కోట్ల మ్యూచువల్ ఫండ్స్, షేర్లు ఈడీ స్వాధీనం చేసుకుంది.

ముమ్మర దాడులు

ముమ్మర దాడులు

కాగా, బుధవారం ముంబైలోని నాలుగు షెల్ కంపెనీలతోపాటు దేశంలోని 17 ప్రాంతాల్లో ఈడీ ముమ్మర దాడులు నిర్వహించింది. బుధవారం రూ.10కోట్ల వరకు ఈడీ స్వాధీనం చేసుకుంది. ఇక పన్నుల శాఖ కూడా నీరవ్ మోడీకి చెందిన 141 బ్యాంకు ఖాతాల్లోని రూ.145.74కోట్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లను అటాచ్ చేసింది.

దేశానికి రప్పించే యత్నం

దేశానికి రప్పించే యత్నం

పంజాబ్ నేషనల్ బ్యాంకులో రూ. 11, 380కోట్ల కుంభకోణానికి పాల్పడిన నీరవ్ మోడీ, తన కుటుంబసభ్యులతో కలిసి దేశం విడిచి పారిపోయిన విషయం తెలిసిందే. నీరవ్ మోడీతోపాటు మరో నిందితుడు చోక్సీ పాస్ పోర్టులను ఈడీ సూచన మేరకు విదేశాంగా శాఖ నాలుగు వారాలపాటు రద్దు చేసింది. తిరిగి భారత్‌కు రప్పించేందుకు దర్యాప్తు సంస్థలు ముమ్మర యత్నాలు చేస్తున్నాయి.

English summary
Enforcement Directorate on Thursday seized shares and mutual funds worth Rs 94 crore of Nirav Modi and Mehul Choksi groups in connection with the alleged Rs 11,380-crore scam involving Punjab National Bank.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X