వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

‘పీఎన్బీ స్కాం’! మీకు తెలీకుండా జరిగిందా?: ఆర్బీఐని నిలదీసిన కేంద్రం

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దేశంలో సంచలనం సృష్టించిన పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌లో జరిగిన 11వేల కోట్ల భారీ కుంభకోణం ఎందుకు బయటపడలేదని కేంద్రం రిజర్వ్‌ బ్యాంక్‌(ఆర్బీఐ)ను ప్రశ్నించింది. ప్రభుత్వ బ్యాంకుల్లో ఏం జరిగినా ఆర్‌బీఐకి తెలీకుండా ఉండదని అలాంటిది ఇంత పెద్ద మోసం జరుగుతుంటే ఆర్‌బీఐ ఏం చేస్తోందని ప్రశ్నించింది.

 PNB scam: How did this go undetected, Govt asks RBI

ఈ మేరకు కేంద్రం ఆర్‌బీఐకి రాసిన లేఖలో నిలదీసింది. పీఎన్‌బీకి చెందిన ముంబై శాఖలో రూ.11 వేల కోట్లకు పైగా అక్రమాలు చోటుచేసుకున్నాయి. ఈ కుంభకోణం నేపథ్యంలో పీఎన్‌బీని మోసగించి రూ.11,400 కోట్లు అప్పుగా తీసుకున్న వజ్రాల వ్యాపారవేత్త నీరవ్‌ మోడీపై కేసు నమోదైన విషయం తెలిసిందే.

కాగా, ఈ కుంభకోణం కేసు విషయంలో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) విచారణలో వేగం పెంచింది. ఈ కుంభకోణం నేపథ్యంలో ఆదివారం ఈడీ దేశవ్యాప్తంగా 45 ప్రాంతాల్లో ఉన్న జువెలరీ దుకాణాల్లో సోదాలు నిర్వహించింది. కాగా, ఈడీ సూచన మేరకు నీరవ్ మోడీ, చోక్సీల పాస్‌పోర్ట్‌లను నాలుగు వారాలపాటు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సస్పెండ్ చేసింది.

English summary
The Central Government has sought to know how did the PNB fraud go unnoticed. While flagging doubts over the supervisory lapses in the scam, the Centre asked the RBI how did the fraud go un-detected.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X