నీరవ్ మోడీని భారత్ కు అప్పగించాలని సంచలన తీర్పునిచ్చిన యూకే కోర్టు
భారతదేశంలో ఆర్ధిక నేరాలకు పాల్పడి లండన్ లో తలదాచుకుంటున్న నేరగాడు నీరవ్ మోడీ కేసులో భారత్ కు అప్పగించే విషయంలో కోర్టు కీలక ఆదేశాలను జారీ చేసింది . పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణం ప్రధాన నిందితుడు అయిన నీరవ్ మోడీ పై లండన్ కోర్టులో విచారణ సాగింది . మనీలాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నీరవ్ మోడీని విచారణ చేసిన కోర్టు నీరవ్ మోడీకి వ్యతిరేకంగా ప్రాథమిక ఆధారాలున్నాయని చెప్పారు.

నీరవ్ మోడీని దోషిగా తేల్చిన యూకే కోర్టు
నీరవ్ మోడీని రప్పించినట్లయితే న్యాయం జరగదని చెప్పడానికి ఆధారాలు లేవని, తనకు న్యాయం జరగదన్న నీరవ్ మోడీ వాదనను కోర్టు తోసిపుచ్చింది . దాదాపు రూ .14 వేల కోట్ల పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పిఎన్‌బి) కుంభకోణానికి సంబంధించి మోసం, మనీలాండరింగ్ కేసు ఉన్న నీరవ్ మోడీ ని ఇండియాకు అప్పగించాలని భారత్ చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తుంది . అందులో భాగంగా నీరవ్ మోడీని యూకే కోర్టులో దోషిగా తేల్చింది . అతనిపై తగిన సాక్ష్యాలు ఉన్నాయని యుకె కోర్టు తెలిపింది.

ఇండియాలో మోడీ సమాధానం చెప్పాలన్న జడ్జీ
ఈ కుంభకోణంలో నీరవ్ మోడీ, పిఎన్‌బి అధికారులతో సహా ఇతర కుట్రదారుల మధ్య సంబంధాలు ఉన్నాయని వెస్ట్‌మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్టు జడ్జి శామ్యూల్ గూజీ తెలిపారు. "నీరవ్ మోడీ చట్టబద్ధమైన వ్యాపారంలో పాల్గొన్నారని తాము అంగీకరించమని, నిజమైన లావాదేవీలు ఏవీ లేవని మరియు నిజాయితీ లేని లావాదేవీలు సాగాయని తాను నమ్ముతున్నాను" అని న్యాయమూర్తి తీర్పు ఇచ్చారు. ఇండియా నుండి పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీకి భారతదేశంలో సమాధానం చెప్పడానికి కేసు ఉందని జడ్జి పేర్కొన్నారు .

ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలులో బరాక్ 12 నీరవ్ మోడీకి సరిపోతుందన్న జడ్జీ
సాక్ష్యాలను నాశనం చేయడానికి మరియు సాక్షులను బెదిరించడానికి నీరవ్ మోడీ కుట్ర పన్నారని యుకె కోర్టు జడ్జి స్పష్టం చేశారు .
నీరవ్ మోడీ యొక్క మానసిక ఆరోగ్య సమస్యలను జడ్జి కొట్టిపారేశారు.
నీరవ్ మోడీని భారత్‌కు రప్పించినట్లయితే అతనికి న్యాయం జరగదన్న అనుమానం లేదని , ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలులో బరాక్ 12 నీరవ్ మోడీకి సరిపోతుందని యుకె కోర్టు జడ్జి తీర్పునిచ్చారు.

నీరవ్ మోడీని ఇండియాకు అప్పగించాలని కోర్టు ఆదేశం
బిలియనీర్ నీరవ్ మోడీ కేసును ప్రభావితం చేయడానికి లా అండ్ జస్టిస్ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ప్రయత్నించారని నీరవ్ మోడీ డిఫెన్స్ వాదనలను యుకె న్యాయమూర్తి తోసిపుచ్చారు
. ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలులో నీరవ్ మోడీకి తగిన వైద్య చికిత్స, మానసిక ఆరోగ్య సంరక్షణ ఇవ్వాలని యుకె న్యాయమూర్తిస్పష్టం చేశారు .
నీరవ్ మోడిని భారత్‌కు అప్పగించాలని యుకె కోర్టు ఆదేశాలు జారీ చేసింది. పీఎన్బీని రూ.13,600 కోట్ల మేర మోసగించిన కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థలు సీబీఐ, ఈడీ విచారణ జరుపుతున్నాయి. ఇండియాకి అప్పగించాలని యూకే ను కోరగా ఫైనల్ గా మోడీ అప్పగింతకు యూకే కోర్టు ఓకే చెప్పింది .