వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఖచ్చితంగా పీఓకేను స్వాధీనం చేసుకుంటాం : విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్

|
Google Oneindia TeluguNews

పాక్ ఆక్రమిత కశ్మీర్ ఏదో ఒకరోజు భారత దేశ వశమవుతుందని భారత విదేశాంగ మంత్రి జయశంకర్ ఆశాభావం వ్యక్తం చేశారు. భౌతికంగా పీఓకేను స్వాధీనం చేసుకునే రోజు దగ్గర్లోనే ఉందని ఆయన చెప్పారు. పీఓకే ప్రాంతం భారత భూబాగంలోని అంతర్భాగం అని పేర్కోన్నా ఆయన దాని గురించి భాదపడాల్సిన అవసరం లేదని,పీఓకేను స్వాదీనం చేసుకునేందుకు అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు.

ఆర్టికల్ 370 రద్దు తర్వాత పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌ను పోందడమే లక్ష్యంగా భారత దేశ నాయకులు,భద్రతా దళాలు సైతం పావులు కదుపుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే పలువురు నాయకులు ప్రకటనలు చేశారు. తాజాగా విదేశీ వ్యవహారాల మంత్రి జయశంకర్ మరోసారి ఈ అంశాన్ని లేవనెత్తారు. ముఖ్యంగా కొద్ది రోజుల్లో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో సమావేశం జరగనున్న నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఓ వైపు పీఓకే కాపాడుకునేందుకు పాకిస్తాన్ ప్రయత్నలు చేస్తున్న సంధర్భంలో భారత దేశం పీఓకే ను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

PoK is part of India and we expect one day that we will have the jurisdiction:Mr Jaishankar

ముఖ్యంగా పీఓకేలో ఎన్నికలు నిర్వహించాలని భారత్ భావిస్తోంది. ఇందుకు సంబంధించి కేంద్రమంత్రి అమిత్ షా సైతం ప్రకటన చేశారు. మరోవైపు ప్రభుత్వం ఆదేశిస్తే పీఓకే స్వాధీనం చేసుకునేందుకు సిద్దంగా ఉన్నమని భద్రతా దళాల చీఫ్ రావత్ కొద్ది రోజుల క్రితమే ప్రకటించారు. దీంతో పాకిస్తాన్ సైతం అప్రమత్తమైంది. ఏదీ ఏమైన పీఓకేను భౌతికంగా స్వాదీనం చేసుకుని భారత దేశం యొక్క బలాన్ని చాటేందుకు భారత దళాలు సిద్దమవుతున్నాయి. ఈనేపథ్యంలోనే జమ్ము కశ్మీర్ ప్రాంతం గురించి ఎలాంటీ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని అన్నారు. దాని గురించి భారత్ దేశం చాల స్పష్టంగా ఉందని తెలిపారు. ఇందుకోసం అనేక ప్రయత్నాలు జరిగాయని అన్నారు. యూఎన్ఓలో కూడ కశ్మీర్‌ అంశంపై ఎలాంటీ ఆందోళన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు.

English summary
PoK is part of India and we expect one day that we will have the jurisdiction, physical jurisdiction over it," Mr Jaishankar said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X