హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Encounter: మహిళలకు భద్రత ముసుగులో కాల్చి చంపుతారా?: ఎన్ కౌంటర్ చేసిన పోలీసులపై ఎఫ్ఐఆర్ కు డిమాండ్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణలో చోటు చేసుకున్న వెటర్నరీ డాక్టర్ దిశ హత్యోదంతంలో నిందితులను బహిరంగంగా ఉరి తీయాలంటూ నిన్నటిదాకా దేశవ్యాప్తంగా చెలరేగిన నిరసనల మధ్య.. వారిని ఎన్ కౌంటర్ చేశారు పోలీసులు. ఈ ఎన్ కౌంటర్ చోటు చేసుకున్న అయిదారు గంటల్లోనే పూర్తి భిన్నమైన వాతావరణం, సరికొత్త డిమాండ్లు వినిపిస్తున్నాయి. వెటర్నరి డాక్టర్ దిశపై అత్యాచారం, హత్యకు పాల్పడిన నలుగురు నిందితులను ఎన్ కౌంటర్ చేసిన పోలీసులపై కేసు నమోదు చేయాలనేది ఆ డిమాండ్ల సారాంశం.

Recommended Video

Disha Issue : From President To Politicians And Sports Personalities & Celebrities | Oneindia Telugu

Disha Murder case: దిశ నిందితులకు బహిరంగ ఉరి తీయాలని, కాల్చి చంపాలని కోరలేను.. కానీ: కేటీఆర్Disha Murder case: దిశ నిందితులకు బహిరంగ ఉరి తీయాలని, కాల్చి చంపాలని కోరలేను.. కానీ: కేటీఆర్

ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటూ..

వెటర్నరి డాక్టర్ దిశ కేసులో మహమ్మద్ పాషా, జొల్లు నవీన్, జొల్లు శివ, చెన్నకేశవులును ఎన్ కౌంటర్ చేసిన పోలీసులపై తక్షణమే ఎఫ్ఐఆర్ ను నమోదు చేయాలంటూ పలువురు న్యాయవాదులు, పౌర హక్కుల సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు. నిందితులను శిక్షించడానికి చట్టాలు ఉన్నాయని, న్యాయ వ్యవస్థ అందుబాటులో ఉందనే విషయాన్ని తాము తెలంగాణ ప్రభుత్వానికి, పోలీసులకు గుర్తు చేస్తున్నామని చెప్పారు.

మహిళలకు భద్రత పేరుతో ఎన్ కౌంటర్ విధానానికి

మహిళలకు భద్రత పేరుతో ఎన్ కౌంటర్ విధానానికి


మహిళలకు భద్రత కల్పిస్తున్నామని, అత్యాచారాలకు పాల్పడే వారికి భయం కలిగించేలా వ్యవహరిస్తున్నామనే ముసుగులో పోలీసులు ఎన్ కౌంటర్లకు దిగడం అమానవీయమని సుప్రీంకోర్టు న్యాయవాది వృందా గ్రోవర్ అన్నారు. దేశంలోన్ని అన్ని రాష్ట్రాలు కూడా ఇలాంటి ఎన్ కౌంటర్లకు దిగితే.. పరిస్థితి ఏమౌతుందని ఆమె ప్రశ్నించారు. దీనిపై వృందా గ్రోవర్.. ఫేస్ బుక్ అకౌంట్ లో తన అభిప్రాయాలను పొందుపరిచారు.

ఎన్ కౌంటర్ ఘటనల్లో పోలీసులపై కేసు పెట్టాలంటోన్న సుప్రీంకోర్టు..

దేశంలో ఎక్కడ ఎన్ కౌంటర్ ఘటన చోటు చేసుకున్నప్పటికీ.. దానితో సంబంధం ఉన్న పోలీసులు, దర్యాప్తు అధికారులపై ఎఫ్ఐఆర్ ను నమోదు చేయాలని సుప్రీంకోర్టు చెబుతోందని, దీన్ని అనుసరించి- నలుగురు నిందితులను ఎన్ కౌంటర్ చేసిన తెలంగాణ పోలీసులపై వెంటనే కేసు నమోదు చేయాలని వృందా గ్రోవర్ డిమాండ్ చేశారు. ఈ ఎన్ కౌంటర్ ఘటన వెనుక గల కారణాలను అన్వేసించడానికి ఓ స్వతంత్ర జ్యుడీషియరీ విచారణకు ఆదేశించాలని అన్నారు. మహిళలకు భద్రత కల్పిస్తున్నామనే పేరుతో నిందితులను ఎన్ కౌంటర్ చేయడం అప్రజాస్వామ్య విధానమని, న్యాయ వ్యవస్థకు విరుద్ధమని చెప్పారు.

English summary
In a strong reaction, senior lawyer Vrinda Grover said "this is unacceptable". "SAY NO TO TRIGGER TRACK INJUSTICE! This is absolutely unacceptable. So all that the state will do in the name of ensuring that women live as equal and free citizens is to add to its arsenal of unlimited arbitrary violence!." she wrote in a Facebook post.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X