వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జడ్జీ తోటలో హంగామా: మేక అరెస్ట్, బెయిల్‌పై విడుదల

|
Google Oneindia TeluguNews

రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని కొరియా జిల్లాలో అరుదైన ఘటన చోటు చేసుకుంది. ఓ జడ్జీ ఇంట్లోని తోటలోకి ఓ మేక తరచూ వస్తూ ఇబ్బందులకు గురిచేయడంతో కొరియా జిల్లాకు చెందిన అబ్దుల్‌ హాసన్‌, అతని మేకను పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.

వివరాల్లోకి వెళితే.. జిల్లా న్యాయమూర్తి హేమంత్‌ రాత్రేకి చెందిన తోట గేటు దూకి లోనికి వెళ్తున్న ఈ మేక.. తరచూ అక్కడి పూలు, పండ్ల మొక్కలను నాశనం చేసేది. దీంతో తోట మాలి పలుమార్లు అబ్దుల్‌ హాసన్‌ను హెచ్చరించాడు.

Police arrest goat in Chhattisgarh – know why

ఎన్నిసార్లు చెప్పినా.. అతను మేకను అదుపు చేయకపోవడంతో విసిగి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు అబ్దుల్‌ హాసన్‌ను, మేకను కూడా అరెస్టు చేసి కటకటాల వెనక్కి నెట్టారు.

కాగా, ఈ కేసులో వారిని దోషులుగా న్యాయస్థానం నిర్ధారిస్తే రెండు నుంచి ఏడేళ్ల వరకు శిక్ష, జరిమానా పడే అవకాశం ఉంది. అయితే, మంగళవారం అబ్దుల్ హసన్, అతని మేక బెయిల్‌పై విడుదలయ్యారు.

English summary
An unusual incident has come to the fore from Chhattisgarh's Korea district. A goat and its owner Abdul Hassan, have been arrested after, it was caught grazing in a Judge's garden in Korea district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X