వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరుణపై కేసు, పడిపోయిన జయ కొడుకు, ఒకరి సూసైడ్

By Srinivas
|
Google Oneindia TeluguNews

చెన్నై/బెంగళూరు: అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత జైలుకు వెళ్లిన మరుసటి రోజే డీఎంకే అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి పైున పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కరుణతో పాటు ఆయన తనయుడు స్టాలిన్ పైన, మరో ఐదువందల మంది డీఎంకే కార్యకర్తల పైన ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

అన్నాడీఎంకె కార్యకర్తల పైన దాడికి యత్నించారంటూ వారి పైన ఎఫ్ఐఆర్ నమోదయింది. అన్నాడీఎంకే కార్యకర్తలు వారి పైన పోలీసులకు ఫిర్యాదు చేశారు. జయలలితను అరెస్టు చేసి, జైలుకు పంపిన నేపథ్యంలో తమిళనాడులో ఉద్రిక్త పరిస్థితి నెలకొన్న విషయం తెలిసిందే.

కాగా, జయలలిత తనయుడు సుధాకరన్ పరప్పన అగ్రహార జైలులో సొమ్మసిల్లిపడిపోయాడు. అతనికి గ్లూకోజ్‌లు అందిస్తున్నారు. ఇదిలా ఉండగా జయలలిత అభిమాని ఒకరు చెన్నైలో ఆత్మహత్య చేసుకున్నాడు. అతనిని 58 ఏళ్ల వెంకటేష్‌గా గుర్తించినట్లు తెలుస్తోంది.

రేపు హైకోర్టుకు అన్నాడీఎంకే

అన్నాడీఎంకే జయలలితకు బెయిల్ కోరుతూ రేపు (సోమవారం) హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసేందుకు సిద్ధమైంది. ఈ విషయాన్ని అన్నాడీఎంకే కర్నాటక కార్యదర్శి వీ పుగలేంది తెలిపారు. మరోవైపు, చెన్నైలోని అన్నాడీఎంకే కార్యకర్తలు పెద్ద ఎత్తున ప్రధాన కార్యాలయానికి చేరుకొని ఆందోళన చేస్తున్నారు.

తమిళనాడు

తమిళనాడు

అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత జైలుకు వెళ్లిన మరుసటి రోజే డీఎంకే అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి పైున పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

తమిళనాడు

తమిళనాడు

తమిళనాడు రాజధాని చెన్నైలో గల అన్నాడీఎంకే కార్యాలయం వద్దకు పెద్ద ఎత్తున ఆ పార్టీ కార్యకర్తలు చేరుకొని ఆందోళన చేస్తున్న దృశ్యం.

తమిళనాడు

తమిళనాడు

తమ పార్టీ అధినేత్రి జయలలిత పైన డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి తప్పుడు కేసును, రాజకీయ కుట్రతోని కేసును వేశారని కర్నాటక అన్నాడీఎంకే కార్యదర్శి పుగలేంది అన్నారు.

తమిళనాడు

తమిళనాడు

కర్నాటక రాజధాని బెంగళూరులో అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత ఉన్న జైలు వద్ద ఆందోళన చేస్తున్న ఆ పార్టీ కార్యకర్తలు. సర్ది చెబుతున్న పోలీసులు.

English summary
Just after a day of Jayalalithaa's conviction in DA case, fresh FIRs have been filed against DMK leader M Karunanidhi and his son MK Stalin. Two FIRs have been filed by AIADMK supporters in connection with a clash in Tamil Nadu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X