వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆశ్రమంలో అరాచకాలు: అమ్మాయిలతో నగ్నంగా మసాజ్‌లు, అత్యాచారాలు!

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఆధ్యాత్మిక గురువుగా చెలామణి అవుతూ ఆశ్రమం పేరుతో అసాంఘిక కార్యకలాపాలు పాల్పడుతున్నారంటూ స్థానికులు హైకోర్టును ఆశ్రయించడంతో అధికారులు రంగంలోకి దిగారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆశ్రమంపై దాడి చేసి చేశారు. అక్కడ మైనర్ అమ్మాయిలు, మహిళలు ఉన్నట్లు గుర్తించారు.

రోహిణిలోని ఆధ్యాత్మిక్ విశ్వ విద్యాలయ ఆశ్రమంలో దాడులు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. గార్డుతోపాటు ఓ మహిళను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిపారు. ఆశ్రమంలోని ఓ గది నిండా మెడిసిన్స్, సిరంజీలు ఉన్నాయని గుర్తించినట్లు చెప్పారు.

అమ్మాయిలు.. ఆరోపణలు-ఖండన

అమ్మాయిలు.. ఆరోపణలు-ఖండన

వీరేంద్ర దేవ్ దీక్షిత్ అనే 75ఏళ్ల ఆధ్యాత్మిక గురువు ఈ ఆశ్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దేశ వ్యాప్తంగా వీరి ఆశ్రమ శాఖలున్నాయని చెప్పారు. బాలికలు, అమ్మాయిలు, మహిళలు ఈ ఆశ్రమాల్లో ఉంటారని, వారిని గోపియాన్ అని పిలుస్తారని చెప్పారు. వీరంతా గులాబీ రంగు దుస్తులు ధరిస్తారని చెప్పారు. కాగా, ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మాలీవాల్‌కు ఆశ్రమానికి సంబంధించిన వ్యక్తులు ఫిర్యాదు చేశారు. ఆశ్రమంపై వచ్చిన ఆరోపణల్లో వాస్తవం లేదని, ఆశ్రమంలో అందరూ ఆనందంగా ఉన్నారని చెప్పారు.

అమ్మాయిలను ఆశ్రమంలో విడిచిపెళ్తే..

అమ్మాయిలను ఆశ్రమంలో విడిచిపెళ్తే..

దీక్షిత్ కొత్తగా వచ్చే అనుచరులకు ఏడురోజులపాటు శిక్షణ ఇస్తారని, అప్పుడు ఎవరూ కూడా ఆయనను కలవలేరని ఆశ్రమానికి చెందిన ఓ మాజీ అనుచరుడు తెలిపారు. అంతేగాక, ఈ ఆధ్యాత్మిక శిక్షణ కోసం చాలా మంది తల్లిదండ్రులు తమ కూతుళ్లను ఆశ్రమంలో విడిచి వెళ్తారని చెప్పారు. కాగా, ఇలా తమ కూతుళ్లను విడిచిపెట్టి వెళ్లిన తల్లిదండ్రులే ఈ ఆశ్రమంపై ఫిర్యాదు చేయడం గమనార్హం. తమ కూతుళ్లను వారికి తెలియకుండానే దేశంలోని ఇతర ప్రాంతాలకు ఈ ఆశ్రమం వారు తీసుకెళ్లారని చెప్పారు. తాను ఆశ్రమంలో విడిచిపెట్టిన తన 14ఏళ్ల కూతురు.. తనకు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దొరికిందని ఓ మాజీ పోలీసు అధికారి వాపోవడం గమనార్హం. తన ఆచూకీ తెలిసే సరికి ఆమె విద్యాసంత్సరం పూర్తిగా కోల్పోవాల్సి వచ్చిందని చెప్పారు.

 ఆశ్రమం నుంచి తప్పించుకోలేరు..

ఆశ్రమం నుంచి తప్పించుకోలేరు..

చిన్న గదులు, పలు గేట్లు, సీక్రెట్ చాంబర్లు, మెట్లు కూడా చిన్నదారిలోనే ఉంటాయి. అందువల్ల ఈ ఆశ్రమం నుంచి పారిపోవడానికి ఎవరికీ సాధ్యం కాదు. కాగా, ఇప్పటికే ఈ ఆశ్రమంలో నలుగురు యువతులు ఆత్మహత్య చేసుకున్నారని ఆరోపించారు.

ఆశ్రమ నిర్వాహకుడు తన అనుచరుల కూతుళ్లను తన ఆశ్రమానికి శాశ్వతంగా పంపించాలంటూ ఒత్తిడి చేస్తాడని చెప్పారు. వారి కూతుళ్లను ఆశ్రమానికి అప్పగించే సమయంలో రూ.10 స్టాంప్ పేపర్లపై తల్లిదండ్రుల నుంచి ఆశ్రమం వారు సంతకాలు కూడా సేకరిస్తారని చెప్పారు. ఈ క్రమంలో మైనర్లను దీక్షిత్ లైంగిక వేధింపులకు గురిచేస్తాడమని ఆరోపించారు. ఆ అమ్మాయిులకు 18ఏళ్లు వచ్చిన తర్వాత తన వద్దే ఉండేందుకు సమ్మతమేనంటూ వారితో పేపర్లపై సంతకాలు కూడా తీసుకుంటారని చెప్పారు.

 అమ్మాయిల తల్లిదండ్రులకు అనుమతి లేదు

అమ్మాయిల తల్లిదండ్రులకు అనుమతి లేదు

అంతేగాక, అమ్మాయిలు సంతకం చేసిన పేపర్లను వారి తల్లిదండ్రులకు, స్థానిక పోలీస్ స్టేషన్‌కు ఆశ్రమం వారు పంపిస్తారు. ఒక్కసారి తమ కూతుళ్లను ఆశ్రమంలో అప్పగించినట్లయితే.. వారిని చూసేందుకు కూడా తల్లిదండ్రులకు అనుమతి ఉండదని చెప్పారు. దీంతో తమ కూతుళ్లను బాగా చూసుకునేందుకు ఆ తల్లిదండ్రులు భారీగా విరాళాలు ఇచ్చేవారని, ఇందుకు ఆశ్రమ ఒత్తిళ్లే కారణమని తెలిపారు. అంతేగాక, అమ్మాయిల తల్లిదండ్రులు ఆస్తులను కూడా ఆశ్రమానికి ఇవ్వాలని ఒత్తిడి చేస్తారని తెలిపారు.

 అత్యాచారాలు.. కండోమ్‌ల వాడకం

అత్యాచారాలు.. కండోమ్‌ల వాడకం

ఆశ్రమంలోని ఓ వ్యక్తి తనపై పలుమార్లు అత్యాచారానికి ఒడిగట్టాడని ఆశ్రమ బాధితురాలు ఒకరు చెప్పారు. ఆశ్రమంలోని గర్భ్ మహల్ అనే గదిలోకి ఇతరులకు ప్రవేశం లేదని చెప్పింది. అమ్మాయిలు ఆ మహల్ దాటి రాకూడదని తెలిపింది.

దేశవ్యాప్తంగా దీక్షిత్‌కు ఆశ్రమాలున్నాయని, అమ్మాయిలను ఒక ఆశ్రమం నుంచి మరో ఆశ్రమానికి తరలిస్తుంటారని చెప్పింది. కాగా, దీక్షిత్ ఓ డ్రగ్ బానిస అని, మహిళలను వేధింపులకు గురిచేస్తున్నాడని మరో మాజీ అనుచరుడు. ఒకసారి రైళ్లో ప్రయాణిస్తున్న సమయంలో తనకు కండోమ్ కావాలని నిందితుడు అడిగాడని తెలిపాడు. తాను ఎందుకని ప్రశ్నించగా.. కొందరు అమ్మాయిలు అనారోగ్యంగా ఉన్నారని, తాను దేవుడిని కాబట్టి స్వచ్ఛంగా ఉండాలని దీక్షిత్ చెప్పారని తెలిపాడు.

అమ్మాయిలతో నగ్నంగా మసాజ్.. అరాచకాలు

అమ్మాయిలతో నగ్నంగా మసాజ్.. అరాచకాలు

నగ్నంగా ఉన్న అమ్మాయిలతో దీక్షిత్.. మసాజ్ చేయించుకునేవాడని వెల్లడించాడు. దీక్షిత్.. ఓపీయం తీసుకుంటాడని, ఇప్పటి వరకు 10మంది అమ్మాయిలపై అత్యాచారానికి పాల్పడ్డాడని మాజీ అనుచరుడు వెల్లడించాడు. అమ్మాయిలకు తొలిసారి పీరియడ్స్ కాగానే.. వారితో దీక్షిత్ సెక్స్ చేసేవాడని తెలిపాడు. అమ్మాయిలైన అనుచరులు దీక్షిత్ మత్తులో పడిపోయారని, తమ కుటుంబాలను కూడా కలిసేందుకు ఇష్టపడటం లేదని చెప్పాడు.

 1970నుంచి కొనసాగుతున్న ఆశ్రమం.. వేగంగా స్పందించిన హైకోర్టు

1970నుంచి కొనసాగుతున్న ఆశ్రమం.. వేగంగా స్పందించిన హైకోర్టు

కాగా, 1970 నుంచి దీక్షిత ఈ ఆశ్రమాలను నడుపుతున్నాడు. ఈ నేపథ్యంలో తాజా సీమా శర్మ నేతృత్వంలో నడుస్తున్న ఎన్జీఓ సంస్థ ద్వారా బాధితులైన అమ్మాయిల తల్లిదండ్రులు హైకోర్టును ఆశ్రయించారు. తమ కూతుళ్లను కలుసుకునేందుకు కూడా ఆశ్రమం యాజమాన్యం ఒప్పుకోవడం లేదని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ నేపథ్యంలో ఓ కమిటీని వేసిన హైకోర్టు.. ఆశ్రమంపై దాడులు నిర్వహించాలని ఆదేశించింది. ఈ కేసు విషయంలో వేగంగా స్పందించాల్సిన అవసరం ఉందని, ఆశ్రమంలోని చాలా మంది అమ్మాయిల జీవితాలు ప్రమాద స్థితిలో ఉన్నాయని హైకోర్టు అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో అధికారులు సదరు ఆశ్రమంపై దాడులు నిర్వహించారు. పలువురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

English summary
Authorities on Tuesday swooped down on an ashram in the city after a group of parents approached the Delhi High Court alleging that a self-styled godman was holding a number of minor girls and women there who were being sexually exploited.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X