వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జయలలిత సమాధి వద్ద పోలీస్ కానిస్టేబుల్ ఆత్మహత్య

By Narsimha
|
Google Oneindia TeluguNews

చెన్నై: దివంగత తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత సమాధి వద్ద పోలీస్ కానిస్టేబుల్ ఆదివారం నాడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది.

తమిళనాడు రాష్ట్రంలోని మధురైకు చెందిన ఎమ్‌ అరుణరాజ్‌ అనే కానిస్టేబుల్‌ మెరీనా బీచ్‌లోని జయలలిత మెమోరియల్‌ వద్ద తన సర్వీస్‌ రైఫిల్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

Police constable posted at late Tamil Nadu CM Jayalalithaa's memorial shoots self dead

ఘటనా స్థలంలోనే అతను మరణించాడు. . మృత దేహాన్ని దగ్గర్లోని రాజీవ్‌ గాంధీ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అతని ఆత‍్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందని ఉన్నతాధికారులు తెలిపారు. వ్యక్తిగత కారణాలే అయి ఉండొచ్చన్న అనుమానిస్తున్నారు.

అయితే అరుణ్ ఏ కారణం చేత ఆత్మహత్య చేసుకొన్నాడనే విషయమై పోలీసులు విచారణ చేస్తున్నారు. జయలలిత సమాధి వద్దకు వచ్చి అరుణ్ రాజ్ ఎందకు ఆత్మహత్యకు పాల్పడ్డాడనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు.

English summary
A 23-year-old police constable posted at late chief minister J Jayalalithaa's memorial shot himself dead early Sunday morning.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X