వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రిసార్ట్ వద్ద ఉద్రిక్తత: కిడ్నాప్ చేశారా.. ఎమ్మెల్యేల్ని ప్రశ్నిస్తున్న పోలీసులు

అన్నాడీఎంకే అధినేత్రి శశికళ వర్గం ఎమ్మెల్యేలను ఉన్న గోల్డెన్ బే రిసార్టు వద్ద బుధవారం నాడు మరోసారి ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రజాప్రతినిధులను, ఇతర నేతలను రిసార్టు ఖాళీ చేయాలని పోలీసులు ఆదేశించారు.

|
Google Oneindia TeluguNews

చెన్నై: అన్నాడీఎంకే అధినేత్రి శశికళ వర్గం ఎమ్మెల్యేలను ఉన్న గోల్డెన్ బే రిసార్టు వద్ద బుధవారం నాడు మరోసారి ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రజాప్రతినిధులను, ఇతర నేతలను రిసార్టు ఖాళీ చేయాలని పోలీసులు ఆదేశించారు.

శశికళ లొంగిపోయేందుకు బయలుదేరారు. ఈ నేపథ్యంలో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా దాదాపు వంద మంది పోలీసులను రిసార్టు వద్ద ముందస్తుగా ఉంచారు.

<strong>వింతగా శశికళ, చీలిక దిశగా పార్టీ: జయ సమాధి వద్ద 3సార్లు అందుకే కొట్టారు..</strong>వింతగా శశికళ, చీలిక దిశగా పార్టీ: జయ సమాధి వద్ద 3సార్లు అందుకే కొట్టారు..

తమను రిసార్టులో బలవంతంగా బంధించారని ఎమ్మెల్యే శరవణన్ ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలోను పోలీసులు రిసార్టుకు వెళ్లారు.

Police enter resort in TN where Sasikala's MLAs are lodged

రిసార్టులో ఉన్న ఎమ్మెల్యేల నుంచి పోలీసులు వాంగ్మూలం తీసుకుంటున్నారు. బలవంతంగా కిడ్నాప్ చేశారా, లేక స్వచ్చంధంగా వచ్చారా అని పోలీసులు ప్రజాప్రతినిధులను ఒక్కొక్కరిని ప్రశ్నిస్తున్నారు.

ఇదిలా ఉండగా, అన్నాడీఎంకే పార్టీలో సంక్షోభం మరింత ముదిరే సూచనలు కనిపిస్తున్నాయి. పన్నీర్‌ సెల్వం తిరుగుబాటుతో ఇప్పటికే పార్టీ రెండు వర్గాలుగా విడిపోయింది. తాజాగా పార్టీ ఉప ప్రధాన కార్యదర్శిగా దినకరన్‌ను నియమించడంతో విభేదాలు మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

<strong>చిన్నమ్మకు మరో షాక్: శశికళపై కిడ్నాప్ కేసు, ఎమ్మెల్యే ఫిర్యాదు</strong>చిన్నమ్మకు మరో షాక్: శశికళపై కిడ్నాప్ కేసు, ఎమ్మెల్యే ఫిర్యాదు

అక్రమాస్తుల కేసులో శశికళ జైలుకు వెళ్తున్న నేపథ్యంలో తనకు నమ్మకంగా ఉండే దగ్గరి బంధువైన దినకరన్‌ను పార్టీ ఉప ప్రధాన కార్యదర్శిగా నియమించారు. అయితే 2011లో అమ్మ పార్టీ నుంచి బహిష్కరించిన వ్యక్తికి పార్టీ ఉన్నత పదవి ఎలా కట్టబెడతారని పలువురు ప్రశ్నిస్తున్నారు.

దినకరన్‌ నియామకాన్ని పలువురు నేతలు వ్యతిరేకిస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి బలం చేకూరుస్తూ అన్నాడీఎంకే కార్యనిర్వాహక కార్యదర్శిగా ఉన్న పాండ్యన్‌ బుధవారం రాజీనామా చేశారు.

English summary
There is huge police presence outside the Golden Bay resort where several MLAs of the AIADMK are lodged. There around 100 riot police is outside the resort as they anticipate trouble. The police are said to have told the MLAs to vacate the resort by 3pm.
Read in English: Police enter resort in TN
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X