చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

డ్రమ్ములో డ్రగ్స్... రూ.230 కోట్ల విలువ.... సముద్రం ఒడ్డున గుర్తించిన పోలీసులు..

|
Google Oneindia TeluguNews

తమిళనాడులోని చెంగల్పట్టు జిల్లాకు చెందిన మామల్లాపురం పోలీసులు శనివారం రూ .230 కోట్ల పైచిలుకు విలువ చేసే 78 కిలోల మెథాంఫేటమిన్ డ్రగ్‌ను స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం సాయంత్రం మామల్లాపురంలోని కోకిలమెదుకుప్పం బీచ్ ప్రాంతానికి చెందిన మత్స్యకారులు సముద్రం ఒడ్డుకు కొట్టుకు వచ్చిన ఓ డ్రమ్ములో దీన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.

డ్రమ్ములో ప్యాక్ చేసిన డ్రగ్స్...

డ్రమ్ములో ప్యాక్ చేసిన డ్రగ్స్...

డ్రమ్ములో ఉన్న మెథాంఫెటమిన్ డ్రగ్ స్పటిక రూపంలో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఓ చైనీస్ టీ బ్రాండ్ లేబుల్‌తో ఉన్న కవర్స్‌లో డ్రగ్‌ను ప్యాక్ చేసినట్టు గుర్తించారు. మామల్లాపురం పోలీస్ స్టేషన్‌కు చెందిన ఓ పోలీస్ అధికారి మాట్లాడుతూ.. దీనిపై కేసు నమోదు చేసి నార్కోటిక్స్ ఇంటలిజెన్స్ బ్యూరోకి బదిలీ చేశామన్నారు. ఇది అత్యంత ఖరీదైన డ్రగ్ అని.. కిలో ధర రూ.3కోట్లు వరకు ఉంటుందని చెప్పారు.

స్మగ్లింగ్ కోసమే...

స్మగ్లింగ్ కోసమే...

స్మగ్లింగ్ కోసమే డ్రమ్ములో ఈ డ్రగ్‌ను ప్యాక్ చేసినట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. శ్రీలంక మీదుగా మలేషియాకు తరలించేందుకు ప్రయత్నించవచ్చునని చెప్పారు. మెటాంఫెటమిన్ డ్రగ్‌ను మెట్,బ్లూ,ఐస్,క్రిస్టల్ పేర్లతోనూ పిలుస్తారని చెప్పారు. పార్టీల్లో మత్తు కోసం దీన్ని ఎక్కువగా వాడుతారని చెప్పారు. దీన్ని కొద్ది మోతాదులో తీసుకున్నా... మెదడుపై ప్రభావం చూపించి ఉత్తేజపరుస్తుందన్నారు. భారత్‌లో దీని విక్రయాలపై నిషేధం ఉందని చెప్పారు.

ఆ రెండు ప్రాంతాల నుంచే...

ఆ రెండు ప్రాంతాల నుంచే...


ఇండియన్ నార్కోటిక్ డ్రగ్స్&సైకోట్రోఫిక్ సబ్‌స్టాన్సెస్ యాక్ట్ ప్రకారం మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు 20 ఏళ్ల జైలు శిక్ష,రూ.2లక్షలు జరిమానా పడుతుంది. ఈ ఏడాది ప్రారంభంలో 'మాదకద్రవ్యాల అక్రమ రవాణా'పై భారత్‌లో రెండు రోజుల పాటు సదస్సు కూడా జరిగింది. ఈ సదస్సులో గోల్డెన్ క్రెసెంట్ మరియు గోల్డెన్ ట్రయాంగిల్ నుంచి మాదక ద్రవ్యాల అక్రమ రవాణా ఎక్కువగా ఉన్నట్టు హైలైట్ చేశారు.
భౌగోళికంగా గోల్డెన్ క్రెసెంట్ అంటే ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్,పాకిస్తాన్‌ భూభాగాలను పరిగణిస్తారు. అలాగే గోల్డెన్ ట్రయాంగిల్ అంటే.. థాయిలాండ్, లావోస్ మరియు మయన్మార్ భూభాగాలను పరిగణిస్తారు. ఈ రెండు ప్రాంతాలు ప్రపంచంలో మాదక ద్రవ్యాల విక్రయం భారీ ఎత్తున జరుగుతోంది.

English summary
Mamallapuram police from Tamil Nadu’s Chengalpattu district on Saturday seized 78-kilos of methamphetamine drug, valued over Rs 230 crore, drifting ashore in a drum. The mysterious consignment was spotted by fishermen from Kokilamedukuppam beach area in Mamallapuram on Friday evening and the police were immediately alerted.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X