వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
నిత్యానంద పురుషత్వ పరీక్ష రిపోర్ట్: కోర్టుకు నేడో రేపో
బెంగళూరు: రాసలీలల నిత్యానంద స్వామి పురుషత్వ పరీక్షల నివేదిక పోలీసులకు చేరినట్లుగా తెలుస్తోంది. ఈ నెల సెప్టెంబర్ 8వ తేదీన నిత్యానంద స్వామికి వైద్యులు పురుషత్వ పరీక్షలు నిర్వహించారు. ఆయన పరీక్షల నివేదిక పోలీసులకు చేరింది. పోలీసులు ఈ రోజు లేదా రేపు ఆ నివేదికను న్యాయస్థానం ముందు ఉంచే అవకాశముంది.

నిత్యానంద స్వామికి వైద్య పరీక్షలు నిర్వహించిన విక్టోరియా ఆసుపత్రి వైద్యులు సోమవారం సాయంత్రం మధ్యంతర నివేదికను సీఐడీ అధికారులకు అప్పగించారు. మరో నివేదిక వారం రోజుల్లో ఇవ్వనున్నారు.
కాగా, నిత్యానంద స్వామి పురుషత్వ పరీక్షలకు హాజరు కావాల్సిందేనని సుప్రీం కోర్టు చెప్పడంతో ఆయన 8న పరీక్షలకు హాజరయ్యారు. చాలాకాలంగా నిత్యానంద పైన లైంగిక వేధింపుల కేసులు కొనసాగుతున్న విషయం తెలిసిందే. నటి రంజితతో రాసలీలలతో నిత్యానంద పేరు బాగా తెలిసిపోయింది.