వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దారుణం: రైడ్ పేరుతో లైంగికదాడి.. పోలీసుల హెల్ప్, మనీ తీసుకొని, కంప్లైంట్ తీసుకోకపోగా..

|
Google Oneindia TeluguNews

యూపీలో మరో దారుణం వెలుగుచూసింది. మీరట్‌ జిల్లా నాచండి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో అతిథిగృహానికి శనివారం ఓ అమ్మాయి వచ్చింది. తెలిసిన వ్యక్తితో యువతి రాగా.. అతిథిగృహం యజమాని కుమారుడు చూశాడు. ఇంకేముంది అతనికి అమ్మాయిపై కన్ను పడింది. తనకు తెలిసిన పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీస్‌ రైడ్‌ అని చెప్పి ఆ అమ్మాయిని బెదిరింపులకు పాల్పడ్డాలని.. అనంతరం దీన్ని తప్పించేందుకు మీరు సహకరిస్తే ఆ అమ్మాయిపై అత్యాచారం చేయాలని ప్లాన్‌ వేశాడు.

అతడికి తెలిసిన పోలీసులు అతిథిగృహానికి చేరుకుని ఆ యువతీ యువకులను చూసి ప్రశ్నించారు. దీంతో ఆ యువతి బెదిరిపోయింది. మీ తల్లిదండ్రులకు సమాచారం చెప్తామని బెదిరించడంతో ఆ యువతి కంగారుపడింది. దీన్ని అవకాశంగా తీసుకున్న అతిథిగృహం భవన యజమాని కుమారుడు దీని నుంచి తప్పిస్తా.. నువ్వు నాకు సహకరించాలి అని మెలిక పెట్టాడు. ఆమె అంగీకరించకపోయినా బలవంతంగా అత్యాచారం చేశాడు. వచ్చిన పోలీసులు ఆ అమ్మాయి నుంచి డబ్బులు కూడా తీసుకున్నారు.

police help guest house owner son molesting girl in meerut

యువతి స్థానికంగా ఉన్న నాచండి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లగా ఫిర్యాదు ఎవరూ స్వీకరించలేదు. ఎందుకంటే గెస్ట్‌హౌస్‌కు వచ్చిన పోలీసులు ఈ స్టేషన్‌కు సంబంధించిన వారే కావడం విశేషం. తమకు ఎలాంటి ఫిర్యాదు రాలేదని సీఐ ప్రేమ్‌చంద్‌ శర్మ తెలిపారు. పోలీసులపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ఫైరయ్యారు. ఎవరూ ఫిర్యాదు చేయడానికి రాలేదని... ఎవరన్నా వస్తే తప్పకుండా ఫిర్యాదు స్వీకరించి.. విచారణ చేపడతామని సీఐ ప్రేమ్‌చంద్‌ శర్మ తెలిపారు. రక్షించాల్సిన పోలీసులే భక్షకులుగా మారారని సోషల్‌ మీడియాలో కామెంట్స్‌ చేస్తున్నారు. తెలిసిన వారితో కుమ్మక్కై అమ్మాయిపై అఘాయిత్యం జరగగా.. బాధిత యువతి నుంచి పోలీసులు డబ్బులు వసూల్‌ చేయడం ఆగ్రహం తెప్పిస్తోంది.

English summary
police help guest house owner son molesting girl in uttar pradesh meerut
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X