వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పోలీసుల ఓవర్ యాక్షన్... తుపాకులు ఎక్కుపెట్టి మరీ తనిఖీలు... (వీడియో)

|
Google Oneindia TeluguNews

చేతులు పైకెత్తండి, కాళ్లు లేపండి, చేతులు దింపితే కాల్చేస్తాం..ఇవి పోలీసులు సాధరణంగా క్రిమినల్స్..లేదా..బందిపోటు దొంగలను మరి లేదంటే ఉగ్రవాదుల వద్ద పోలీసులు ఉపయోగించే మాటలు.. కాని యూపి పోలీసులు మాత్రం ఇందుకు విరుద్దంగా వ్యవహరించారు..సాధరణ ప్రజల చెకింగ్‌లో కూడ నలుగురు పోలీసులు, నాలుగు వైపుల తుపాకులు ఎక్కుపెట్టి చెకింగ్ చేస్తున్న వీడీయో హల్‌చల్ చేస్తుంది. దీంతో యూపి పోలీసుల వ్యవహర శైలిపై పలు విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి.

వాహాన చెకింగ్‌లో యూపి పోలీసులు ఓవర్ యాక్షన్

వాహాన చెకింగ్‌లో యూపి పోలీసులు ఓవర్ యాక్షన్

సాధరణంగా పోలీసులు పికేటింగ్ వేసినప్పుడు వారు వచ్చిపోయోవారిని చెక్ చేస్తుంటారు. ఎదైన అసాంఘీక కార్యకాలపాలు జరగుతాయనే సమాచారం మేరకు వారు పికెటింగ్ నిర్వహించి తనిఖీలు జరుపుతారు. మాములుగా అయితే వచ్చి పోయో వాహానాలను ఆపి క్షుణ్ణంగా తనిఖీ చేసి పంపిస్తారు. కాని యూపిలోని బాడువాన్ జిల్లాలోని భాగ్రేన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వజీర్ గంజ్ ఔట్ పోస్ట్ పోలీసులు మాత్రం చాల క్రూరంగా ప్రవర్తించారు. సాధరణ ప్రజలపై తుపాకులు ఎక్కుపెట్టి తనిఖీలు చేస్తూ భయబ్రాంతులకు గురిచేస్తున్నారు.

మహిళలపై కూడ తుపాకులు ఎక్కుపెట్టాల్సిందే..

మహిళలపై కూడ తుపాకులు ఎక్కుపెట్టాల్సిందే..

వజీర్‌గంజ్ పరిధిలో పికెటింగ్ నిర్వహిస్తున్న పోలీసులు వాహానదారులను అపుతారు.. వెంటనే నలుగురు పోలీసులు నాలుగు దిక్కుల గన్స్ వాహానదారుడికి తుపాకులు ఎక్కుపెడతారు. పెడతారు. వాహానదారులను చేతులు పైకి ఎత్తమని చెబుతారు. అనంతరం కాళ్లు కూడ పైకి లేపమని చెబుతారు. ఒకవేళ చేతులు క్రిందకు దించితే కాల్చివేస్తామని హెచ్చరిస్తారు. మరోవైపు హెల్మెంట్ ఉన్నా తీయాలని చెబుతారు.. అనంతరం ఒకరు వాహనదారుడి దగ్గరు వెళ్లి తనీఖీలు చేసి పంపిస్తున్నారు. ఇక డ్రైవింగ్ చేస్తున్న వారు మహిళలనై వదిలిపెట్టరని వాపోతున్నారు

 క్రిమినల్స్ ఎక్కువగా ఉండే ప్రాంతం

క్రిమినల్స్ ఎక్కువగా ఉండే ప్రాంతం

ఇలా సాధరణ ప్రజలపైకి తుపాకులు ఎక్కిపెట్టి చేయడం వల్ల స్థానిక ప్రజలు భయబ్రాంతులకు గురి అవుతున్నామని వాపోతున్నారు. అయితే పోలీసుల వర్షన్ మాత్రం మరోలా ఉంది వజీర్ గంజ్ ఎరీయాలో ఎక్కువగా క్రిమినల్స్ ఉండే ప్రాంతం కావడంతో ముందు జాగ్రత్త చర్య చేపట్టామని చెబతున్నారు. గతంలో ఇలాంటీ తనీఖీల్లో కాల్పులు జరిగిన ఘటనలు ఉన్నాయని చెప్పారు. అయితే యూపి డీజీపీ మాత్రం దీనిపై విచారణ జరుపుతామని ఎదైన తప్పిదాలు జరిగితే చర్యలు చేపడతామని తెలిపారు.

English summary
A video shot in Uttar Pradesh's Badaun district showing police personnel pointing their guns at commuters and forcing them to hold up their hands while checking their vehicles, has gone viral. The video, shot at Bagren police outpost in Wazirganj, shows the outpost-in-charge Rahul Kumar Sisodia shouting threats at commuters
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X