వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సారాయి: తండ్రి చిక్కలేదని నాలుగేళ్ల కొడుకు అరెస్టు

|
Google Oneindia TeluguNews

చెన్నై: సారాయి వ్యాపారి తప్పించుకుని తిరుగడంతో అతన్నిఅరెస్టు చేయ్యడం వీలుకావడం లేదని అతని నాలుగేళ్ల కుమారుడిని పోలీసులు అరెస్టు చేసిన విచిత్ర ఘటన తమిళనాడులో జరిగింది. తమిళనాడులోని వేలూరు జిల్లా అరక్కోణం ప్రాంతంలో దొంగ సారాయి విక్రయాలను అడ్డుకునేందుకు పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేశారు.

అందులో భాగంగా అరక్కోణం సమీపంలోని మేల్ ఆవత్తం గ్రామానికి వెళ్లారు. ఆ గ్రామంలో వేదగిరి (35) అనే వ్యక్తి సారాయి వ్యాపారం చేస్తున్నాడని గుర్తించారు. వేదగిరి మీద గతంలో సారాయి విక్రయిస్తున్నాడని కేసులు నమోదు అయ్యాయి. అయితే వేదగిరి తప్పించుకుని తిరుగుతూ పోలీసులకు చుక్కలు చూపించాడు.

Police pick up 4-year-old boy in Tamil Nadu to force his father to surrender before them

పోలీసులు మళ్లీ వేదగిరి ఇంటికి వెళ్లారు. ఇంట్లో ఎవ్వరూ లేకపోవడంతో అక్కడే మకాం వేశారు. ఆ సమయంలో వేదగిరి భార్య సంగీత ఇంటి దగ్గరకు వెళ్లారు. తన భర్త ఇంట్లోలేడని, ఇప్పుడే నాకుమారుడిని పాఠశాల వ్యాన్ లో ఎక్కించి వస్తున్నానని పోలీసులకు చెప్పారు.

పోలీసులు పాఠశాల వ్యాన్ ను వెంబడించి అందులో ఉన్న వేదగిరి నాలుగేళ్ల (ఎల్ కేజీ) కుమారుడిని పట్టుకుని అరక్కోణం తాలుకా పోలీస్ స్టేషన్ కు తీసుకు వెళ్లారు. పోలీసుల మీద అనుమానం రావడంతో సంగీత పాఠశాల దగ్గరకు వెళ్లింది. అక్కడ తన కుమారుడు లేడని తెలుసుకుని పాఠశాల యాజమాన్యం మీద మండిపడింది.

మీ వ్యాన్ లో ఉన్న నాకుమారుడిని పోలీసులు తీసుకు వెళ్లారని, అందుకు మీరే బాధ్యత వహించాలని సంగీత చెప్పింది. బిత్తరపోయిన స్కూల్ యాజమాన్యం నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి బాలుడిని రక్షించి సంగీతకు అప్పగించారు. తన భర్త చిక్కకపోవడంతో పట్టుకోవడం చేతకాని పోలీసులపై సంగీత మండిపడింది.

నాలుగేళ్ల నాకుమారుడిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ లో పెట్టారని సంగీత తమిళనాడు డీఐజీ తమిళరసన్, పోలీస్ సూపరింటెండెంట్ పలవగన్ లకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేసి నివేదిక సమర్పించాలని డీఐజీ తమిళరసన్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

English summary
Sources in the police department said sub-inspector of police Kanchana and four policemen went in search of Vadagiri, a bootlegger and a resident of Mel Avatham near Arakkonam town,
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X