వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎల్పిన్‌స్టోన్ ఘటన: చావు బతుకుల మధ్య ఉంటే తాకరాని చోట, శవాలపై ఆభరణాల చోరీ

By Narsimha
|
Google Oneindia TeluguNews

ముంబై: మహరాష్ట్రలోని ఎల్పిన్‌స్టోన్ రైల్వే స్టేషన్‌లో తొక్కిసలాట తర్వాత చోటుచేసుకొన్న ఘటనలు మానవత్వం మంటగలుపుతున్నాయి. కొన ఊపిరితో కొట్టుమిట్లాడుతున్న వారిని కాపాడకుండా అనుచితంగా ప్రయత్నించారు. మహిళలను అసభ్యంగా తాకుతా పైశాచిక ఆనందం పొందారు. చనిపోయిన మహిళ మృతదేహలపై బంగారు ఆభరణాలను దోచుకెళ్ళారు. ఈ ఘటనలపై పోలీసులు విచారణ చేపట్టారు.

మూడు రోజుల క్రితం మహరాష్ట్ర ఎల్పిన్‌స్టోన్ రైల్వే స్టేషన్‌లో తోక్కిసలాట చోటుచేసుకొంది. సుమారు 27మందికి పైగా ఈ ఘటనలో ప్రాణాలు విడిచారు. దసరా పర్వదినానికి ముందు రోజు ఈ ఘటన చోటుచేసుకొంది. వందలాది మంది గాయపడ్డారు.

అతి ఇరుకుగా ఉన్న రైల్వే బ్రిడ్జిని వెడల్పు చేయాలని కొంతకాలంగా రైల్వే శాఖకు విన్నవిస్తున్నా అధికారులు పట్టించుకోలేదనే ఆరోపణలున్నాయి. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఈ ఘటనస్థలాన్ని కేంద్ర రైల్వేశాఖ మంత్రి పీయూష్‌గోయల్ సందర్శించారు.

కొనఊపిరితో ఉన్న మహిళపై అసభ్యంగా

కొనఊపిరితో ఉన్న మహిళపై అసభ్యంగా

ఎల్పిన్‌స్టోన్ రైల్వేస్టేషన్ బ్రిడ్జి వద్ద చోటుచేసుకొన్న తొక్కిసలాటలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పరుగులు తీశారు వందలాది మంది. అయితే తొక్కిసలాటలో కొన ఊపిరితో కొట్టుమిట్టాడే వారిని కాపాడే ప్రయత్నం చేయలేదు. పైగా ప్రాణాలు కాపాడాలని ఆర్తనాదాలు చేస్తున్నవారిపై మానవత్వం మరిచి ప్రవర్తించారు కొందరు మృగాళ్ళు. సహయం కోసం ఆర్తనాదాలు చేసిన మహిళలను అసభ్యంగా తాకారు.ప్రాణాలు కాపాడకుండా పోయారు కొందరు. ఈ ఘటన జరిగిన కొద్దిసేపటికే ఓ మహిళ చనిపోయింది.

 మృతదేహలపై బంగారం దోపిడి

మృతదేహలపై బంగారం దోపిడి

మరికొందరు దుర్మార్గులు చనిపోయిన మహిళల శరీరాలపై ఉన్న బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. ఈ దారుణ దృశ్యాలను కొందరు తమ సెల్‌ఫోన్లలో చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో పెట్టడంతో పోలీసులు విచారణ చేపట్టారు. ఇదిలా ఉండగా, రైల్వే అధికారుల నిర్లక్ష్యమే ఎల్ఫిన్‌స్టోన్‌ ఘటనకు కారణమని, వారిపై కేసు నమోదు చేయాలని కోరుతూ బాంబే హైకోర్టులో ప్రజాప్రయోజన వాజ్యం దాఖలైంది.

 శవాలపై అంకెలు, డాక్టర్‌పై శివసేన దాడి

శవాలపై అంకెలు, డాక్టర్‌పై శివసేన దాడి

ఎల్పిన్‌స్టోన్ రైల్వే బ్రిడ్జి తొక్కిసలాట సందర్భంగా మరణించినవారిని గుర్తించేందుకు అధికారులు మృతదేహలను భద్రపర్చారు. అయితే తొక్కిసలాటలో మృతి చెందిన వారిని గుర్తించేందుకు మృతదేహాల నుదుటిపై అంకెలు వేశారని కేఈఎం ఆస్పత్రికి చెందిన సీనియర్‌ డాక్టర్‌పై శివసేన కార్యకర్తలు దాడి చేశారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తొక్కిసలాటలో మృతుల సంఖ్య 27కి చేరింది.

 రైల్వేస్టేషన్లలో పాదచారుల వంతెనలు

రైల్వేస్టేషన్లలో పాదచారుల వంతెనలు

ముంబైలోని సబ్‌ అర్బన్‌ రైల్వే స్టేషన్లతోపాటు దేశవ్యాప్తంగా అన్ని రైల్వే స్టేషన్లలో పాదచారుల వంతెనలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని ఆదేశిస్తున్నట్లు రైల్వే మంత్రి పీయూష్‌ గోయల్‌ ప్రకటించారు. ఇదిలా ఉండగా, భారతీయులను చంపేందుకు ఉగ్రవాదులు అవసరం లేదని, భారతీయ రైల్వే ఒక్కటి చాలని మహారాష్ట్ర నవనిర్మాణ సేన చీఫ్‌ రాజ్‌ ఠాక్రే ఆగ్రహం వ్యక్తం చేశారు. బుల్లెట్‌ ట్రైను ప్రాజెక్టు కూడా నోట్ల రద్దు లాంటిదేనని కాంగ్రెస్‌ నేత చిదంబరం విమర్శించారు. బుల్లెట్‌ ట్రైన్లు అవసరం లేదని ప్రధాని మోదీకి ముంబైకి చెందిన 12వ తరగతి విద్యార్థిని శ్రేయా చవాన్‌ విజ్తప్తి చేసి ఆన్‌లైన్‌ ప్రచారం ప్రారంభించింది. 24 గంటల్లో 4327 మంది ఆమెకు మద్దతుగా నిలిచారు.

English summary
Visuals have emerged showing some people allegedly stealing ornaments from a victim of the stampede at a railway station here, prompting the Mumbai Police to launch a probe. The victim, Sumalata Shetty, was among the 23 people who lost their lives in the deadly crush at the Elphinstone Road station.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X