వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పోలీసులు నన్ను లాఠీలతో కొట్టారు..ఈడ్చి రోడ్డున పడేశారు: మోడీ ఒక్కడే నడవాలా: రాహుల్

|
Google Oneindia TeluguNews

లక్నో: ఊహించినట్టే.. హత్రాస్ గ్యాంగ్ రేప్ ఉదంతం ఉత్తర ప్రదేశ్‌లో అగ్గి రాజేసింది. అట్టుడికిస్తోంది. ఉత్తర ప్రదేశ్‌లో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీని ఇరుకున పెట్టడానికి ప్రతిపక్ష పార్టీల నేతలు ఈ ఘటనను తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నాయి. హత్రాస్‌లో నలుగురు కామాంధుల చేతిలో సామూహిక అత్యాచారానికి గురై.. రెండు వారాల పాటు మృత్యువుతో పోరాడుతూ కన్నుమూసిన బాధితురాలికి న్యాయం చేయాలంటూ యోగి ఆదిత్యనాథ్ సర్కార్‌పై దండెత్తుతున్నాయి.

Recommended Video

Hathras : హత్రాస్‌ వైపు Rahul Gandhi తీవ్ర ఉద్రిక్తత, పోలీసులు లాఠీ ఛార్జీ ! #Watch || Oneindia

మృతురాలి కుటుంబాన్ని పరామర్శించడానికి..

అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి, ఉత్తర ప్రదేశ్ పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జీ ప్రియాంకా గాంధీ వాద్రా, సీనియర్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ.. మృతురాలి కుటుంబాన్ని పరామర్శించడానికి హత్రాస్‌కు బయలుదేరి వెళ్లడం.. తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తల మధ్య తోపులాట చోటు చేసుకుంది. పోలీసులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పరస్పరం తోసుకున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలను అదుపు చేయడానికి పోలీసులు లాఠీ ఛార్జీ చేశారు.

యమునా ఎక్స్‌ప్రెస్‌పై..


హత్రాస్‌‌కు బయలుదేరిన ఆ ఇద్దరు నేతల వాహనాలను పోలీసులు యమునా ఎక్స్‌ప్రెస్‌పై అడ్డుకున్నారు. వాహనాలు ముందుకు వెళ్లకుండా అడ్డు పడ్డారు. హత్రాస్‌కు వెళ్లే మార్గాలన్నింటినీ మూసివేశామని, వెనక్కి తిరిగి వెళ్లిపోవాలంటూ సూచించారు. దీనికి ప్రియాంకా గాంధీ, రాహుల్ గాంధీ అంగీకరించలేదు. దీనితో పోలీసులు బలవంతంగా వారిని కారు నుంచి కిందికి దింపడానికి ప్రయత్నించగా.. కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేశారు. పోలీసుల చర్యలను అడ్డుకున్నారు. దీనితో వారి మధ్య తోపులాట చోటు చేసుకుంది.

రోడ్డు మీద నడుచుకుంటూ..

వాహనాలు హత్రాస్ వైపు వెళ్లడానికి పోలీసులు ఏ మాత్రం అంగీకరించకపోవడంతో ఆగ్రహావేశాలను వ్యక్తం చేసిన ప్రియాంకా గాంధీ, రాహుల్ గాంధీ.. రోడ్డు మీద నడచుకుంటూ హత్రాస్‌ వైపు సాగారు. పోలీసులు మళ్లీ వారికి అడ్డుకున్నారు. రాహుల్, ప్రియాంకలతో వారు వాగ్వివాదానికి దిగారు. ఒకవైపు పోలీసు బలగాలు, మరోవైపు కాంగ్రెస్ పార్టీ నేతలతో యమునా ఎక్స్‌ప్రెస్ మీద ఏం జరుగుతోందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. రాహుల్, ప్రియాంకా గాంధీలకు పార్టీ కార్యకర్తలు వలయంగా నిల్చున్నా పోలీసులు పట్టించుకోలేదు. హత్రాస్ వైపు వెళ్లడానికి అడ్డుకుంటూ వచ్చారు. పోలీసులను తప్పించుకుని రాహుల్, ప్రియాంకా గాంధీ హత్రాస్ వైపు నడవడం కనిపించింది.

లాఠీలతో కొట్టారు.. రోడ్డున పడేశారు..


హత్రాస్ వైపు వెళ్లడాన్ని అడ్డుకునే క్రమంలో పోలీసులు తనను లాఠీలతో కొట్టారని, చొక్కా పట్టుకుని ఈడ్చి రోడ్డున పడేశారని రాహుల్ గాంధీ ఆరోపించారు. ఈ రోడ్లపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒక్కరే నడవాలా? ఆయనకు మాత్రమే నడవడానికి హక్కు ఉందా? ఇంకెరికీ లేదా? అని నిలదీశారు. సామాన్యలు, ప్రతిపక్ష నేతలను రోడ్లపై నడనివ్వరా అని ప్రశ్నించారు. హత్రాస్ గ్యాంగ్‌రేప్ మృతురాలి కుటుంబాన్ని పరామర్శించడానికి శాంతియుతంగా వెళ్తోన్న తమను అడ్డుకుని ఏం సాధిస్తారని, ప్రజలకు ఎలాంటి సంకేతాలను పంపిస్తారని రాహుల్ మండిపడ్డారు.

English summary
Just now police pushed me, lathicharged me and threw me to the ground. I want to ask, can only Modi Ji walk in this country? Can't a normal person walk? Our vehicle was stopped, so we started walking: Congress leader Rahul Gandhi at Yamuna Expressway, on his way to Hathras,
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X