వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సాహస బాలికకు సలాం అంటున్న పోలీసులు ..సాహస పురస్కారాలకు పేరు సిఫార్సు

|
Google Oneindia TeluguNews

రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుంటే దొంగలు మన వద్ద ఉన్న వస్తువులను లాక్కోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు, సహజంగా భయభ్రాంతులకు గురై తప్పించుకునే ప్రయత్నం చేస్తాం. ఊహించని పరిణామంతో భయంలో ఉన్నప్పుడు దొంగలు వాళ్ళు అనుకున్న పని ఎంచక్కా చేసుకొని పోతారు.కానీ ఒక పదిహేను సంవత్సరాల బాలిక అత్యంత ధైర్యసాహసాలను ప్రదర్శించి, తనపై దాడి చేసి, తన వద్ద ఉన్న మొబైల్ ఫోన్ లాక్కోవడానికి ప్రయత్నించిన దొంగలతో పోరాడింది. బాలిక దొంగల చేసిన పోరాటం చూసినవారంతా ఆశ్చర్యానికి గురి కాగా, పోలీసులు ఆ బాలిక పేరు ను ఏకంగా సాహస పురస్కారాలకు సిఫార్సు చేస్తున్నట్టు చెప్పారు.

సీతక్క సాహసం .. గోదావరి ముంపు ఏజెన్సీ గ్రామాల్లో.. రాత్రనక, పగలనక ... వర్షంలో తడుస్తూ జనం కోసంసీతక్క సాహసం .. గోదావరి ముంపు ఏజెన్సీ గ్రామాల్లో.. రాత్రనక, పగలనక ... వర్షంలో తడుస్తూ జనం కోసం

సాహసంలో మగవాళ్ళకు మగువలు ఏ మాత్రం తీసిపోరు

సాహసంలో మగవాళ్ళకు మగువలు ఏ మాత్రం తీసిపోరు

ఆడపిల్ల అబల కాదు సబల అని నిరూపించింది ఒక బాలిక . సాహసంలో ఆమెకు ఆమెనే సాటి అని రుజువు చేసింది. సాధారణంగా అమ్మాయిలు , అబ్బాయిల కంటే బలహీనురు అన్న భావన ఉంటుంది. కానీ అమ్మాయిలు ఆత్మ విశ్వాసంలో , తెగువలో అబ్బాయిల కంటే చాలా సమర్ధులు అని నిరూపించింది ఓ బాలిక . పంజాబ్ రాష్ట్రంలోని జలంధర్లో రోడ్డుమీద నడుచుకుంటూ వెళుతున్న క్రమంలో బైక్ పై వెళ్తున్న ఇద్దరు దుండగులు బాలిక వద్ద నుండి మొబైల్ ఫోన్ లాక్కునే ప్రయత్నం చేశారు. తన మొబైల్ ఫోన్ లాక్కోవడానికి రాడ్ తో దాడి చేస్తున్నప్పటికీ ఇద్దరు దుండగులను బాలికల సాహసోపేతంగా ఎదుర్కొంది. వారితో పోరాడింది. మొబైల్ ఫోన్ ఇవ్వకుండా వారిని పట్టుకునే ప్రయత్నం చేసింది. వీరోచితంగా పోరాడిన ఆమెను ఇప్పుడు అందరూ ప్రశంసిస్తున్నారు.

బాలిక సాహసాన్ని పొగిడిన కేంద్ర మంత్రి హర్ష వర్ధన్

బాలిక సాహసాన్ని పొగిడిన కేంద్ర మంత్రి హర్ష వర్ధన్

ఫతేపూర్ మొహల్లా నివాసి అయిన కుసుమ కుమారి ఇంటికి తిరిగి వెళ్తున్న సమయంలో జరిగిన ఈ ఘటనలో బాలిక దొంగలతో ఫైట్ చేయడం చూసిన స్థానికులు వారిని పట్టుకునే ప్రయత్నం చేశారు. బైక్ మీద వెళుతూ తన తన పై దాడి చేసిన అతని షర్టు పట్టుకుని బాలిక కిందికి లాగింది. దీంతో బండిపై నుండి దిగిన అతను, ఆమెపై దాడి చేసి తిరిగి బైక్ మీద వెళ్లడానికి ప్రయత్నం చేయగా, ఆమె అతన్ని బైక్ ఎక్కకుండా నిలువరించిన ఉదంతం తెలిసిందే.ఇక బాలిక సాహసానికి కేంద్ర ఆరోగ్య శాఖామంత్రి హర్ష వర్ధన్ ప్రశంసల వర్షం కురిపించారు . బాలిక శక్తివంతమైన పోరాటం మరియు ధైర్యానికి వందనం అంటూ ఆయన సోషల్ మీడియా వేదికగా స్పందించారు. బాలిక బలమైన సంకల్పం ముందు దొంగలు ఓడిపోయారని ఆయన పేర్కొన్నారు . జలంధర్ కుమార్తె కుసుమ్ కుమారి, ధైర్యం వల్లే మొబైల్ స్నాచర్ వదులుకోవలసి వచ్చింది అని ఆయన అన్నారు.

 సీసీ టీవీ ఫుటేజ్ చూసి బాలికకు సెల్యూట్ చేసిన పోలీసులు

సీసీ టీవీ ఫుటేజ్ చూసి బాలికకు సెల్యూట్ చేసిన పోలీసులు

పదిహేనేళ్ల బాలిక చూపించిన సాహసానికి ఆశ్చర్యానికి గురైన స్థానికులు వెంటనే ఆమెకు మద్దతుగా వెళ్లి ఆ దొంగను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. మరొక దొంగ బైక్ పై పరారయ్యాడు.
దుండగుల దాడిలో గాయపడిన కుసుమ కుమారి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె మణికట్టుపై పదునైన ఆయుధంతో దాడి చేయడంతో గాయాలపాలైన కుసుమ కుమారికి ప్రస్తుతం వైద్యం అందిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం గాలిస్తున్నారు . సిసి టివి ఫుటేజ్ ని చూసి, అందులో పదిహేనేళ్ల బాలిక ప్రదర్శించిన ధైర్యసాహసాలకు చూసిన పోలీసులు ఆమెను అభినందించారు .

Recommended Video

MS Dhoni’s Six Cancelled A Pak Cricketer’s 'Date' With An Indian Girl || Oneindia Telugu
నగదు పురస్కారంతో పాటు, సాహస పురస్కారాలకు ఆమె పేరు సిఫార్సు

నగదు పురస్కారంతో పాటు, సాహస పురస్కారాలకు ఆమె పేరు సిఫార్సు

రాష్ట్ర , జాతీయ స్థాయి సాహస పురస్కారానికి ఆమె పేరును సిఫార్సు చేస్తున్నట్టు ప్రకటించారు . బాలిక ధైర్యసాహసాలను మెచ్చుకుంటూ పోలీస్ కమిషనర్ సైతం స్పందించారు. అంతేకాదు ఆమెకు 51 వేల రూపాయల నగదు పురస్కారాన్ని సైతం అందించారు. చాలా మంది రాజకీయ నాయకులు బాలిక ధైర్య, సాహసాలను కొనియాడారు. ఎవరైనా ఇటువంటి ఊహించని పరిణామాలు జరిగినప్పుడు, కుసుమకుమారి తరహాలో ఆ ఇబ్బందిని ధైర్యంగా ఎదుర్కోవాలని పోలీసులు చెప్తున్నారు.

English summary
15-year-old girl kusum kumari who fought with thiefs praised by police in Jalandhar, Punjab.It has been announced that she will be nominated for a National Level Adventure Award. police commissioner praised the girl’s bravery
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X