వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పోలీస్ స్టేషనే పెళ్లి వేదికగా ఒక్కటైన జంట.. ఎక్కడో తెలుసా !!

|
Google Oneindia TeluguNews

లాక్ డౌన్ కారణంగా ఎక్కడి పెళ్ళిళ్ళు అక్కడే ఆగిపోయాయి. కరోనా వ్యాప్తిని అరికట్టటానికి ప్రభుత్వాలు విధించిన లాక్ డౌన్ ఒక్కటి కావాల్సిన జంటలను వేరు చేశాయి. ఇక ఎంతకాలం ఈ బాధ పడాలి అని భావించిన ఒక యువకుడు ఏకంగా పోలీసులనే ఒప్పించి పోలీస్ స్టేషన్ సాక్షిగా , అదే వేదికగా కళ్యాణం చేసుకున్నాడు .

వికలాంగ బిచ్చగత్తె ఔదార్యం..కరోనా సమయంలో లాక్ డౌన్ సిబ్బందికి అరటిపండ్లు , మజ్జిగ పంపిణీ వికలాంగ బిచ్చగత్తె ఔదార్యం..కరోనా సమయంలో లాక్ డౌన్ సిబ్బందికి అరటిపండ్లు , మజ్జిగ పంపిణీ

లాక్ డౌన్ ముగిసేవరకు ఆగాల్సిన ఓ పెళ్లి, పెళ్లి కొడుకు రిక్వెస్ట్ తో పోలీసుల సహకారంతో పోలీస్ స్టేషన్ లోనే జరిగింది. ఉత్తరప్రదేశ్ లోని చందౌలీ జిల్లా మహుజీ గ్రామానికి చెందిన అనిల్, ఘాజీపూర్ జిల్లాకు చెందిన జ్యోతి పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ముహూర్తం కూడా పెట్టుకున్నారు. కరోనా వైరస్ మన దేశంలోకి రావటం , ఆ తర్వాత విధించిన లాక్ డౌన్ తో వారి పెళ్లి ఆగి పోయింది . ఇక ఎక్కువ రోజులు వెయిట్ చెయ్యలేను అని భావించిన యువకుడు దీనా పోలీస్ స్టేషన్ లో పోలీసుల సాక్షిగా పెళ్లి చేసుకున్నాడు. ఈనెల 20న వీరి పెళ్లి చేయాలని పెద్దలు ముందే నిర్ణయించగా లాక్ డౌన్ కారణంగా పెళ్లి జరగదని భావించిన అనిల్ పోలీసులను సంప్రదించాడు.

Police Station is a Wedding Venue for a Couple

గతంలో ఫిబ్రవరిలో జరిగిన ఓ బోటు ప్రమాద ఘటన టైమ్ లో అనిల్ పోలీసులకు సాయం చేశాడు. బోటులో ప్రయాణిస్తున్న చాలా మంది ప్రాణాలను కాపాడటంతో పోలీసు అధికారులు అనిల్ ను మెచ్చుకున్నారు. పెళ్లి గురించి అనిల్ అడగ్గానే పోలీసులు సాయం చేయడానికి ఒప్పుకున్నారు. అయితే పెళ్లికి వధువు, వరుడు తరఫున పది కంటే ఎక్కువ మంది హాజరుకావొద్దని చెప్పారు. ఇక పోలీస్ స్టేషన్ కాంపౌండ్ లోపల ఉన్న శివాలయంలో అనిల్ పెళ్లి చేసుకున్నాడు. సోషల్ డిస్టెన్స్ ను స్ట్రిక్ట్ గా పాటిస్తూ.. లిమిటెడ్ పర్సన్స్ మధ్య ఈ వివాహం జరిగింది అని ఒక పోలీసు అధికారి చెప్పారు. మొత్తానికి కరోనా టైంలో పెళ్లి చేసుకున్న ఈ జంట పోలీస్ స్టేషన్ నే కళ్యాణ వేదికగా చేసుకోవటం చర్చనీయాంశం అవుతుంది.

English summary
Anil from Mahuji village in Chandauli district of Uttar Pradesh and Jyoti from Ghazipur district wanted to get married. The corona lockdown effect their marriage stopped. Feeling that he could not wait any longer, the young man got married at the police station in Deena.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X