వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అయోధ్య తీర్పు: సోషల్ మీడియాలో ఫ్రీ అని పాటుపడితే నో వార్నింగ్, నో వారెంట్, డైరెక్టుగా జైలే!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/న్యూఢిల్లీ: అయోధ్యలో రామమందిరం-బాబ్రీ మసీదు వివాదంపై సుప్రీం కోర్టు క్షణాల్లో సంచలన తీర్పు ఇవ్వనుంది. అయోధ్య వివాదం సుదీర్ఠకాలంగా నలుగుతోంది. రామజన్మభూమి-బాబ్రీ మసీదు తమదంటే తమదంటూ హిందూ-ముస్లీంలు కలహించుకుంటున్నారు. దీనిపై ఎన్నెన్నో కోర్టు కేసులు, మరెన్నో వివాదాలు. ఈ కోర్టు కేసులు, వివాదాలకు క్షణాలలో తెరపడనుంది. సుప్రీం కోర్టు తీర్పు ఏదైనా సోషల్ మీడియాలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు, పోస్టులు చెయ్యడం నిషేధించారు. సోషల్ మీడియాలో ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు, పోస్టులు చేసే వారి మీద కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు, పోస్టులు చేసే వారికి నో వార్నింగ్, నో వారెంట్, నేరుగా జైలుకు పంపిస్తామని పోలీసులు హెచ్చరించారు.

రియల్ ఎస్టేట్ వ్యాపారం, అక్రమ సంబంధం, లేడీ వలలో పడి బతుకు బూడిద, భార్య!రియల్ ఎస్టేట్ వ్యాపారం, అక్రమ సంబంధం, లేడీ వలలో పడి బతుకు బూడిద, భార్య!

 నిర్ణయం ఏదైనా సయోధ్యగా ఉందాం

నిర్ణయం ఏదైనా సయోధ్యగా ఉందాం

అయోధ్య కేసులో సుప్రీం కోర్టు ఎలాంటి నిర్ణయం వెలువరించినా దానిని ఏ ఒక్క వర్గానికో గెలుపు ? ఓటమి అనే కోణం నుంచి చూడకూడదని ప్రధాని నరేంద్ర మోడీ ప్రజలకు మనవి చేశారు. సుప్రీం కోర్టు తీర్పు అనంతరం కూడా మైత్రి, సయోధ్యలను మనం చక్కగా కాపాడుకోవాలని, సుప్రీం కోర్టులో ఈ కేసు విచారణ జరిగినంత కాలం సమాజంలోని అన్ని వర్గాలు సుహృద్భావవ పరిస్థితులు కొనసాగించారని, తీర్పు తరువాత అన్ని వర్గాలు అలాగే శాంతియుతంగా ఉండాలని ప్రధాని నరేంద్ర మోడీ ప్రజలకు మనవి చేశారు.

తప్పుడు ప్రచారం చేస్తే?

తప్పుడు ప్రచారం చేస్తే?

అయోధ్య కేసులో సుప్రీం కోర్టు తీర్పు తరువాత సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తే మీ అంతు చూస్తామని పోలీసు అధికారులు హెచ్చరించారు. రామజన్మభూమి- బాబ్రీ మసీదు వివాదంపై సుప్రీం కోర్టులో తీర్పు ఏదైనా రావచ్చు. తీర్పు తరువాత వాట్సాప్, ట్వీట్టర్, ఫేస్ బుక్ తదితర సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన, రెచ్చగొట్టే వ్యాఖ్యలు పోస్టులు చెయ్యకూడదని, కామెంట్లు చెయ్యరాదని, అలా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు హెచ్చరించారు.

సోషల్ మీడియాపై డేగ కన్ను!

సోషల్ మీడియాపై డేగ కన్ను!

సోషల్ మీడియాపై పోలీసులు, సంబంధిత అధికారులు డేగ కన్ను వేశారు. అయోధ్య తీర్పు వెలువడుతున్న సమయంలో సోషల్ మీడియాపై ఆంక్షలు విధించారు. వాట్సాప్, ఫేస్ బుక్, ట్వీట్టర్ తదితర సోషల్ మీడియాల మీద పోలీసులు గట్టి నిఘా వేశారు. అయోధ్య తీర్పుపై తప్పుడు ప్రచారం చేసిన వారిని వెంటనే గుర్తించి తమకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు పోలీసులు మనవి చేస్తున్నారు.

నో వార్నింగ్, నో వారెంట్, డైరెక్టుగా జైలుకే!

నో వార్నింగ్, నో వారెంట్, డైరెక్టుగా జైలుకే!

అయోధ్య తీర్పు వెలువడిన తరువాత సోషల్ మీడియాలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన వారికి తాము వార్నింగ్ ఇవ్వమని, కనీసం అరెస్టు వారెంట్ ఇవ్వమని, నేరుగా జైలుకు పంపిస్తామని పోలీసులు హెచ్చరించారు. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు, పోస్టులు చెయ్యడం, అభ్యంతరకరమై వీడియోలు పంపించడం చెయ్యరాదని పోలీసులు అన్నారు. ఏ రాజకీయ పార్టీలకు అనుకూలంగా, ధార్మిక సంఘాలకు అనుకూలంగా వ్యాఖ్యలు చెయ్యరాదని, అలా చెయ్యడం నిషేధమని, అలా చేసిన వారికి వార్నింగ్ లు, వారెంట్ లు ఇవ్వకుండా డైరెక్టుగా జైలుకు పంపిస్తామని పోలీసులు హెచ్చరించారు.

ఫేక్ న్యూస్ లు వస్తే జాగ్రత్త!

ఫేక్ న్యూస్ లు వస్తే జాగ్రత్త!

అయోధ్య కేసు తీర్పు చాలా సున్నితమైనది. ఇలాంటి సమయంలో సోషల్ మీడియాలో జాగ్రత్తగా ఉండాలని, ఇష్టం వచ్చిన మీ అభిప్రాయాలు ఇతరుల మీద రుద్దడానికి ప్రయత్నించరాదని పోలీసులు సూచించారు. ఫ్రీగా ఫేస్ బుక్ లో, వాట్సాప్ లో, ట్వీట్టర్ లో కామెంట్ లు, పోస్టులు పెట్టే వారి మీద ప్రత్యేక సైబర్ క్రైం పోలీసులు నిఘా వేశారని, మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే మీకు అంతే మంచిదని, సృతి మించి ప్రవర్తిస్తే తగిన ఫలితం అనుభవిస్తారని పోలీసులు హెచ్చరించారు.

English summary
Karnataka state police has issued warning to public and social media users not to post objectional posts regarding religious matter as Ayodhya verdict expected to be delivered soon.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X