వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కొత్తగా పెళ్లైంది, ఆగలేకపోతున్నా.. పది రోజులు సెలవు కావాలి, సార్: కానిస్టేబుల్ లీవ్ లెటర్ వైరల్

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కొత్తగా పెళ్లైన ఓ కానిస్టేబుల్ సెలవు కోసం ఉన్నతాధికారులకు లేఖ రాశారు. అయితే ఇది నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దానికి కారణం ఉంది. కొత్తగా పెళ్లి కావడంతో మూడ్‌లో ఉన్నానని, తనకు పది రోజుల సెలవు కావాలని అతను కోరడం గమనార్హం. దీంతో కానిస్టేబుల్ రాసిన లేఖ వైరల్‌గా మారింది.

సూటిగా చెప్పాడు

సూటిగా చెప్పాడు

సాధారణంగా ఎవరికైనా చెప్పలేని పరిస్థితుల్లో సెలవు కావాలన్నా అబద్దాన్ని చెప్పి అడుగుతారు. కానీ కర్ణాటకలోని బేగూరు పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పని చేస్తున్న మారుతి మాత్రం జంకు గొంకు లేకుండా, తనకు ఎందుకు సెలవు కావాలనే విషయాన్ని సూటిగా చెప్పాడు. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.

భార్యతో సన్నిహితంగా ఉండేందుకు సమయం లేకుండా పోయింది

భార్యతో సన్నిహితంగా ఉండేందుకు సమయం లేకుండా పోయింది

అతనికి ఇటీవలే పెళ్లయింది. పెళ్లికి సెలవులు ఇచ్చినప్పటికీ ఆ తర్వాత భార్యతో సన్నిహితంగా ఉండేందుకు సమయం లేకుండా పోయింది. దీంతో ఆ తర్వాత మరో పది రోజులు సెలవు కోరుతూ ఆయన ఉన్నతాధికారికి లేఖ రాశాడు.

 ఆగలేకపుతున్నా, మూడ్‌లో ఉన్నా

ఆగలేకపుతున్నా, మూడ్‌లో ఉన్నా

తనకు ఇటీవలే పెళ్లయిందని, కొన్ని ప్రత్యేక పూజలు చేయించాలని, ఊళ్లో కొన్ని పనులు ఉన్నాయని, అలాగే కొత్తగా పెళ్లి కావడంతో ఆగలేకపోతున్నానని, మూడ్‌లో ఉన్నానని, తన పరిస్థితిని అర్థం చేసుకొని పది రోజులు సెలవులు ఇవ్వాలని ఆ లేఖలో కోరారు. అతను రాసిన లేఖ చదివి అందరికీ ఆశ్చర్యం, నవ్వు తెప్పిస్తున్నాయి.

English summary
Newly married Police constable wrote a letter to inspector asking a leave its viral in social media.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X