వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పోలీసు గస్తీ బృందంపై ఉగ్రదాడి.. కానిస్టేబుల్ వీరమరణం

ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో ఒక బస్టాండ్ వద్ద పోలీసు గస్తీ బృందంపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఒక పోలీసు మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

శ్రీనగర్: ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో ఒక బస్టాండ్ వద్ద పోలీసు గస్తీ బృందంపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇంతియాజ్ అహ్మద్ అనే పోలీసు కానిస్టేబుల్ మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు.

గస్తీ బాధ్యతలు నిర్వహిస్తున్న పోలీసు వాహనంపై ఉగ్రవాదులు 20 నుంచి 25 రౌండ్లు కాల్పులు జరిపినట్టు తెలుస్తోంది. వెంటనే తేరుకున్న పోలీసు బృందం కూడా ఎదురు కాల్పులకు దిగింది. సమాచారం అందిన వెంటనే సీఆర్‌పీఎఫ్ బలగాలు ఆ ప్రదేశానికి చేరుకున్నాయి.

anantnag-terror-attack

ప్రస్తుతం ఆ ప్రాంతంలో సీఆర్‌పీఎఫ్ బలగాలు ఉగ్రవాదుల కోసం జల్లెడ పడుతున్నాయి. కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ శనివారం కశ్మీర్‌లో పర్యటిస్తుండటం, ఆదివారం రాజ్‌నాథ్ పాల్గొనబోయే సమావేశ మందిరానికి సరిగ్గా 500 గజాల దూరంలోనే ఈ ఘటన చోటుచేసుకోవడం సంచలనం సృష్టించింది.

English summary
Terrorist today attacked a police party in south Kashmir's Anantnag district leaving a constable dead, striking barely a kilometre from the venue of Union Home Minister Rajnath Singh's scheduled meeting with security personnel tomorrow, a police official said. Terrorist fired indiscriminately on the police personnel near the general bus stand Anantnag, the official said. He said constable Imtiyaz Ahmad was killed while constable Shabir Ahmad was injured in the firing. The attack took place a kilometre away from the proposed venue of the meeting of the Home Minister with CRPF personnel tomorrow, the official said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X