వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేంద్రమంత్రి కుటుంభమని వదిలేశారు... తన ఉద్యోగానికే ఎసరు తెచ్చుకున్నారు...!

|
Google Oneindia TeluguNews

నూతన ట్రాఫిక్ నిబంధనలు ప్రతి ఒక్కరు పాటించేలా పలు ప్రభుత్వాలు చర్యలు చేపడుతున్నాయి. సోషల్ మీడీయా ప్రభావంతో ప్రభుత్వ పెద్దలు మరియు ఉన్నతాధికారులు ఏమాత్రం నిబంధనలను అతిక్రమించినా పౌరులు వెంటనే సోషల్ మీడీయాలో పోస్ట్ చేసి సంబంధిత అధికారులను ప్రశ్నిస్తున్నారు. దీంతో పోలీసులు, అధికారులు అప్రమత్తంగా ఉంటున్నారు. ట్రాఫిక్ నిబంధనలు ఉపక్రమించిన ఎంతటి వారైనా..వదిలిపెట్టకుండా జరిమాన విధిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నూతన వాహాన చట్టం నిబంధనలను ఓ కేంద్రమంత్రి కుటుంభం ఉల్లంఘించినా.. పట్టించుకోని కానిస్టేబుల్స్‌తో పాటు ఎస్సైని అధికారులు సస్పెండ్ చేశారు.

కేంద్ర వైద్యఆరోగ్య శాఖ సహాయ మంత్రి అశ్విన్ చౌబే కుమారుడైన అర్జిజ్ జౌబేతో పాటు కుటుంభ సభ్యుల వాహనం అటుగా వచ్చింది. ఆ వాహనానికి బ్లాక్ కొటేడ్ గ్లాస్ ఉంది. ఈ నేపథ్యంలోనే ఆ వావానాన్ని తనిఖీ చేసేందుకు అక్కడే ఉన్న ముగ్గురు కానిస్టేబుల్స్ వెళ్లారు. వెహికిల్‌కు నల్ల అద్దాలు ఉన్నా వాటిని పట్టించుకోకుండా వదిలిపెట్టారు. దీంతోపాటు కనీసం పేపర్లను కూడ తనిఖీ చేయలేదు. దీంతో అక్కడే జిల్లా ఎస్పి అమర్‌కేశ్ దాన్ని గమనించారు. దీంతో సదరు కానిస్టేబుల్స్‌తో పాటు, ఎస్సైని సస్పెండ్ చేశారు.

policemen were suspended for allowing Union minister vehicle go without verification

కేంద్ర ప్రభుత్వం ట్రాఫిక్ రూల్స్‌పై ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనకు గురవుతున్న విషయం తెలిసిందే.. ట్రాఫిక్ నిబంధనలను నిక్కచ్చిగా పాటించేందుకు కేంద్రం మాత్రం వెనకడుగు వేయడం లేదు. ఆ మాత్రం నిబంధనలు లేకపోతే ప్రజలు ఎవరు భయపడరంటూ కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్వయంగా చెప్పారు. దీంతో పాటు ట్రాఫిక్ నిబంధనలు కేవలం సామాన్యులకే కాదు. అధికారులకు, రాజకీయా నాయకులకు కూడ వర్తిస్తాయయని చెప్పారు. ఇలాంటీ నేపనథ్యంలోనే కొత్త చట్టంపై ప్రజలకు నమ్మకం కల్పించేందుకు, ప్రతి రాష్ట్రంలో ఉన్నత అధికారులో పాటు, రాజకీయ నాయకుల వాహానాలకు సైతం జరిమానాలు విధిస్తున్నారు.

English summary
Three policemen, including a sub-inspector, were suspended for allowing Union minister Ashwini Kumar Choubey's vehicle go without verification of papers during a drive to ensure implementation of the amended motor vehicles act in Patna on Sunday, an official statement said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X