వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నిండు జీవితానికి రెండు చుక్కలు -కొనసాగుతోన్న పల్స్ పోలియో -5ఏళ్లలోపు పిలలకు టీకాలు

|
Google Oneindia TeluguNews

''నిండు జీవితానికి రెండు చుక్కలు'' నినాదంతో 1995లో దేశవ్యాప్తంగా మొదలైన పల్స్ పోలియో కార్యక్రమం అప్రతిహతంగా కొనసాగుతోంది. ఏటా రెండు సార్లు ఐదేళ్లలోపు వయసున్న పిల్లలకు పోలియో చుక్కలు వేస్తుండటం తెలిసిందే. 2014లోనే భారత్‌ను పోలియోరహిత దేశంగా కేంద్రం అధికారికంగా ప్రకటించినా, వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. తాజాగా..

పల్స్ పోలియో కార్యక్రమం 2021లో భాగంగా ఆదివారం(జనవరి 31) దేశ వ్యాప్తంగా పోలియో చుక్కల కార్యక్రమం ప్రారంభమైంది. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో గ్రామగ్రామాన ఏర్పాటు చేసిన శిబిరాల్లో ఇవాళ 7 గంటల నుంచే కార్యక్రమం మొదలైంది. సాయంత్రం 5 గంటల వరకు పోలియో చుక్కలు వేస్తారు. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఢిల్లీలో శనివారమే ఈ కార్యక్రమాన్ని లాంచ్ చేశారు. ఇది..

భారత్‌లో కరోనా: భారీ రికార్డు -97శాతానికి రికవరీ రేటు -కొత్తగా 13,052 కేసులు, 127 మరణాలుభారత్‌లో కరోనా: భారీ రికార్డు -97శాతానికి రికవరీ రేటు -కొత్తగా 13,052 కేసులు, 127 మరణాలు

పోలియో ఆదివారం(జనవరి 31న) ప్రారంభమైన వ్యాక్సినేషన్ ప్రక్రియ మూడు రోజులపాటు, అంటే, ఫిబ్రవరి 2 వరకు కొనసాగుతుంది. ఇవాళ శిబిరాలకు రాని పిల్లలను గుర్తించి, సోమ, మంగళవారాల్లో ఆరోగ్య కార్యకర్తలే వారి ఇళ్లకు వెళ్లి పోలీయో చుక్కలు వేస్తారు. నిజానికి జనవరి 17 నుంచి పల్స్‌ పోలియో కార్యక్రమం నిర్వహించాల్సి ఉన్నా, కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ వల్ల పల్స్ పోలియో రెండు వారాలు ఆలస్యంగా నిర్వహిస్తున్నారు.

Polio Ravivar: Pulse Polio Programme 2021 begins across India

పోలియో ఆదివారం ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్యశాఖ పలు సూచనలు చేసింది. దగ్గు, జలుబు, జ్వరం ఉంటే చిన్నారులకు పోలియో చుక్కలు వేయవద్దని సూచించింది. ఈ లక్షణాలు తగ్గిన తర్వాత చిన్నారులను సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు తీసుకెళ్లి చుక్కల మందు వేయించాలని తల్లిదండ్రులకు సూచించింది. ఇక..

షాకింగ్: కరోనా వ్యాక్సిన్ వల్లే చనిపోయింది -కాసిపేట అంగన్‌వాడీ కార్యకర్త మృతిపై బంధువులుషాకింగ్: కరోనా వ్యాక్సిన్ వల్లే చనిపోయింది -కాసిపేట అంగన్‌వాడీ కార్యకర్త మృతిపై బంధువులు

తెలుగు రాష్ట్రాల్లోనూ పల్స్‌ పోలియో కార్యక్రమాన్ని భారీ ఎత్తున చేపట్టారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆరోగ్యశాఖలు ఈ మేరకు ఏర్పాట్లు చేశాయి. నేటి నుంచి మూడు రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఏపిలో 52,72,354 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయనున్నారు. ఇక తెలంగాణలో 38,31,907 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయనున్నారు.

English summary
The National Polio immunisation programme, as part of which children in the age group of 0-5 years are administered polio drops, kick-started on sunday across the nation. The three-day Polio vaccination drive will begin on January 31 and go on till February 2.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X