వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అయ్యో పాపం క్యాప్టెన్ విజయ్ కాంత్, ఎంత కష్టం వచ్చింది, ఒక్కరూ రాలేదు ఎందుకు?

|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడు రాజకీయాలు ఎప్పుడు ఎలా ఉంటాయో ఎవ్వరికీ అర్థం కావడం లేదు. నిన్నమొన్నటి వరకు కలిసితిరిగిన నేతలు ఇప్పుడు ఎవరికి ఎవరో అంటూ ముఖం చాటేస్తున్నారు. ఈ విషయంలో క్యాప్టెన్ విజయ్ కాంత్ విషయంలో అక్షరాల నిజం అయ్యింది.

ప్రముఖ నటుడు, డీఎండీకే పార్టీ వ్యవస్థాపకుడు క్యాప్టెన్ విజయ్ కాంత్ కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. విజయ్ కాంత్ విదేశాల్లో చికిత్స చేయించుకుని చెన్నై వచ్చారు. అనంతరం మెరీనా బీచ్ లో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎం. కరుణానిధి సమాధి దగ్గరకు చేరుకుని నివాళులు అర్పించారు.

Political leaders did not meet Vijayakanth after he back from hospital

ఇటీవల చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో విజయ్ కాంత్ చికిత్స చేయించుకున్నారు. ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్న క్యాప్టెన్ విజయ్ కాంత్ ను ఆయన సన్నిహితులు, డీఎండీకే పార్టీ నేతలు, కార్యకర్తలు పరామర్శించారు.

ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్న విజయ్ కాంత్ ఇంటికి చేరుకున్నారు. అయితే తమిళనాడుకు చెందిన వివిధ పార్టీల నాయకులు ఒక్కరూ విజయ్ కాంత్ ఇంటికి చేరుకుని ఆయన్ను పరామర్శించలేదు. డీఎంకే పార్టీ చీఫ్ ఎంకే. స్టాలిన్ తో పాటు వీసీకే, సీపీఐ, సీపీఎం తదితర పార్టీల నాయకులు విజయ్ కాంత్ ఇంటి వైపు కన్నెత్తికూడా చాడలేదు.

గతంలో విజయ్ కాంత్ వివధ పార్టీలతో పొత్తుపెట్టుకుని శాసన సభ ఎన్నికల్లో పోటీ చేశారు. ఆ సందర్బంలో పొత్తు పెట్టుకున్న రాజకీయ పార్టీలు సైతం నేడు ఆయన్ను పరామర్శించడానికి రాకపోవడంతో తమిళనాడు రాజకీయాలు రసవత్తరంగా మారిపోయాయి.

English summary
Political leaders did not meet Vijayakanth after he back from hospital. Vijayakanth annouced no alliance with any party in Parliment election.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X