• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

Political leader: 50 రోజుల క్రితం పెళ్లి, లీడర్ భార్య దారుణ హత్య, మేనేజర్, ఏం జరిగిందంటే ?

|

చెన్నై/ శివకాశి: ప్రముఖ రాజకీయ పార్టీలోని ఓ నాయకుడి వివాహం 50 రోజుల క్రితం జరిగింది. భర్త ఒక కంపెనీ మేనేజర్ కూడా. వివాహం జరిగిన తరువాత భార్యతో కలిసి ఆయన హ్యాపీగా ఉన్నాడు. నవదంపతులు అన్యోన్యంగా ఉన్నారని వారిని చూసిన వారి కుటుంబ సభ్యులు చాల సంతోషంగా ఉన్నారు. అయితే ఇంతలో దారుణం జరిగిపోయింది. ఇంట్లో ఒంటరిగా ఉంటున్న నవవదువును అతికిరాతంగా హత్య చేశారు. ఇల్లు మొత్తం చెల్లాచెదురు చేసిన గుర్తు తెలియని వ్యక్తులు ఆమెను చంపేసి చాకచక్యంగా తప్పించుకున్నారు. వివాహం జరిగి రెండు నెలల కూడా పూర్తి కాకముందే నవ వదువును హత్య చేసింది ఎవరు ? రాజకీయ కక్షల కారణంగా హత్య జరిగిందా ? ఏమైనా అక్రమ సంబంధ కారణాలు ఉన్నాయా ? పొలిటికల్ లీడర్ భార్య ఎందుకు హత్యకు గురైయ్యింది ? అంటూ పోలీసులు ఆరా తీస్తున్నారు.

Horror murder: బెడ్ రూమ్ లో సెక్స్ పాఠాలు చెప్పాలని భర్త టార్చర్, మర్మాంగం కొరికేసిన భార్య!Horror murder: బెడ్ రూమ్ లో సెక్స్ పాఠాలు చెప్పాలని భర్త టార్చర్, మర్మాంగం కొరికేసిన భార్య!

 వీసీకే పార్టీ లీడర్

వీసీకే పార్టీ లీడర్

తమిళనాడులోని శివకాశి సమీపంలోని తిరుతంగల్ అలమరతుపట్టి ప్రాంతంలో నివాసం ఉంటున్న శెల్వ మణికంఠన్ అనే యువకుడు వీసీకే పార్టీ లీడర్. వీసీకే పార్టీ తిరుతంగల్ సిటీ కో ఆర్డినేటర్ గా పని చేస్తున్న సెల్వ మణికంఠన్ ఆ పార్టీ కార్యకలాపాల్లో చరుకుగా పాల్గొంటున్నాడు. సెల్వ మణికంఠన్ కు వీసీకే పార్టీలో మంచి గుర్తింపు ఉంది.

 జూన్ 24వ తేదీ పెళ్లి

జూన్ 24వ తేదీ పెళ్లి

తిరుతంగల్ లోని ఫైర్ క్రాకర్ కంపెనీలో మేనేజర్ గా ఉద్యగం చేస్తున్న సెల్వ మణికంఠన్ తో ప్రగతి మోనికాల వివాహం జూన్ 24వ తేదీన లాక్ డౌన్ సమయంలోనే జరిగింది. లాక్ డౌన్ సమయంలో జరిగిన సెల్వ మణికంఠన్, అలమరతుపట్టి ప్రాంతానికి చెందిన ప్రగతి మోనికాల వివాహానికి వారి కుటుంబ సభ్యులతో పాటు వీసీకే పార్టీ ప్రముఖులు హాజరై నవ దంపతులను అశీర్వదించారు.

 హ్యాపీ జీవితం

హ్యాపీ జీవితం

పెళ్లి జరిగిన రోజు నుంచి సెల్వ మణికంఠన్, ప్రగతి మోనిక దంపతులు చాలా సంతోషంగా ఉన్నారు. నవదంపతులు చాలా అన్యోన్యంగా ఉన్నారని వారిని చూసిన కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు చాలా హ్యాపీ అయ్యారు. ఎప్పటిలాగే మద్యాహ్నం 1. 30 గంటల సమయంలో ఇంట్లో భోజనం చేసిన సెల్వ మణికంఠన్ కంపెనీ దగ్గరక వెళ్లి వస్తానని భార్య ప్రగతి మోనికాకు చెప్పి వెళ్లాడు.

 ఎన్నిసార్లు ఫోన్ చేసినా ?

ఎన్నిసార్లు ఫోన్ చేసినా ?

రాత్రి ఇంటికి రావడం కొంచెం ఆలస్యం అవుతుందోని, నువ్వు భోజనం చేసి నిద్రపోవాలని చెప్పడానికి సెల్వ మణికంఠన్ భార్యకు ఫోన్ చేసి చెప్పడానికి ప్రయత్నించాడు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా ప్రగతి మోనికా ఫోన్ లిఫ్ట్ చెయ్యలేదు. విసిగిపోయిన సెల్వ మణికంఠన్ ఇంటి పక్కన ఉన్న మరో ఇంటి యజమానికి ఫోన్ చేశాడు. తన భార్య ఎంతసేటికి ఫోన్ రిసీవ్ చెయ్యడం లేదని, దయచేసి వెళ్లి చూడాలని చెప్పాడు. ఇంటి యజామని వెళ్లి చూసి షాక్ కు గురై వెంటనే సెల్వ మణికంఠన్ కు ఫోన్ చేసి ఘోరం జరిగిపోయింది, నువ్వు వెంటనే రావాలని చెప్పాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

 పొలికల్ లీడర్ భార్య ప్రగతి దారుణ హత్య

పొలికల్ లీడర్ భార్య ప్రగతి దారుణ హత్య

ఇంట్లో ఒంటరిగా ఉన్న ప్రగతి మోనికాను గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో నరికి అతి కిరాతకంగా హత్య చేశారు. ఇల్లు మొత్తం రక్తపు మరకలు అయ్యాయి. ఇల్లు చెల్లాచెదురు చేసిన వ్యక్తులు ప్రగతి మోనికాను ఇష్టం వచ్చినట్లు నరికి హత్య చేసి వెళ్లిపోయారని పోలీసులు గుర్తించారు. అయితే హంతకుల ఆచూకి ఏమాత్రం చిక్కలేదని పోలీసులు అంటున్నారు.

  Political Absurdity : Pak మరో దుస్సాహాసం.. భారత భూభాగాలను కలుపుకుని కొత్త మ్యాప్ విడుదల! || Oneindia
   శుత్రువుల పనేనా ? అక్రమ సంబంధమా

  శుత్రువుల పనేనా ? అక్రమ సంబంధమా

  సెల్వ మణికంఠన్ కు ఎవరైనా రాజకీయంగా శత్రువులు ఉన్నారా ? రాజకీయ కక్షల కారణంగా హత్య జరిగిందా ? దంపతుల్లో ఎవరికైనా అక్రమ సంబంధాలు ఉన్నాయా ?, నగలు, నగదు కోసం దుండగులు హత్య చేశారా ? సెల్వ మణికంఠన్ మేనేజర్ గా ఉద్యోగం చేస్తున్న కంపెనీలో ఎవరైనా శుత్రువులు ఉన్నారా ? అనే అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. అయితే ప్రగతి మోనికాను హత్య చేసింది ఎవరైనా సరే వారిని వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని వీసీకే పార్టీ డిమాండ్ చేస్తోంది.

  English summary
  Political leaders wife murder: VCK party leaders 24 year old wife killed near Sivakasi in Tamil Nadu.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X