వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సర్టికల్ స్ట్రైక్ -2పై సర్వత్రా హర్షం .. ఇప్పటికైనా పాక్ కు కనువిప్పు కలుగాలన్న నేతలు

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ : సర్జికల్ స్ట్రైక్ -2పై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఉగ్ర మూకలకు శిక్షణ ఇస్తోన్న జైషే మహ్మద్ శిబిరంపై మెరుపుదాడిని యావత్ భారత జాతి గర్విస్తోంది. ప్రాంతాలు, పార్టీలకతీతంగా నేతలంతా ఒక్కతాటిపై భారత వాయుసేన చేసిన గగనతల దాడిని గుర్తుచేసుకొని మురిసిపోతోంది.

ఇకనైనా కనువిప్పు కలుగాలి

పాకిస్థాన్ ఇకనైనా బుద్ధి తెచ్చుకోవాలన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్. భారత సైన్యం దాడిపై హర్షం వ్యక్తం చేశారు. శిబిరాల్లో దాక్కొన్న ఉగ్ర మూకలను మట్టుబెట్టిన సైన్యం ధైర్య సాహసాలను కొనియాడారు. ఇదీ ముమ్మాటికి పుల్వామా దాడికి ప్రతీకార దాడేనని స్పష్టంచేశారు. ఇకనైనా పాకిస్థాన్ కు కనువిప్పు కలుగాలని .. లేదంటే భవిష్యత్ లో ఇలాంటి ఘటనలు రిపీట్ అవుతాయని చెప్పారు.

300 ఉగ్రమూకల హతం

భారత సైనికులు చేసిన దాడితో 300 మంది ఉగ్ర మూకలు హతమయ్యారని బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ అన్నారు. పుల్వామా దాడికి ప్రతీగా భారత్ స్పందించదని చెప్పారు. వెయ్యి కిలోల బాంబు వేసి .. జైషే మహ్మద్ శిబిరాన్ని ధ్వంసం చేశామని చెప్పారు. ఈ క్రెడిట్ మన సైనికులు, ప్రధాని మోదీకి దక్కుతుందన్నారు.

సెల్యూట్ .. ఐఏఎఫ్

జైషే మహ్మద్ శిబిరంపై దాడిచేసిన వాయుసేనకు పీసీసీ చీఫ్ ఉత్తమ్ సెల్యూట్ చేశారు. ఉగ్ర వాద కార్యకలాపాలు చేపడుతున్ జైషే మహ్మద్ సంస్థపై చర్యలు తీసుకోవాల్సింది పోయి .. పాకిస్థాన్ మద్దతు తెలిపి, వెనకెసుకొచ్చిందని మండిపడ్డారు.

సైన్యం వెన్నంటే భారత్

సైన్యం వెన్నంటే భారత్

దయాది పాకిస్థాన్ పై దాడి చేసిన సైన్యం వెంట యావత్ భారతదేశం ఉందన్నారు కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్. ఈ దాడితో భారత్ అంటే ఏంటో పాక్ కు మరోసారి తెలిసొచ్చిందన్నారు.

English summary
Surgical Strike-2 The whole Indian nation is proud of Jaise Mohammad camp, which trains the youth. overwhelmed by the air attack on Indian Air Force all political leaders .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X