వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సర్వే దెబ్బ: కర్ణాటక ప్రభుత్వం పనితీరుపై 35 శాతం, నరేంద్ర మోడీ మళ్లీ ప్రధాని!

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కర్ణాటకలోని కాంగ్రెస్-జేడీఎస్ పార్టీల సంకీర్ణ ప్రభుత్వం పనితీరుపై కన్నడిగులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి ప్రభుత్వ పనితీరుపై 35 శాతం మంది తప్పుపడుతున్నారు. ప్రభుత్వం పనితీరు సవ్యంగా లేదని 35 శాతం మంది ప్రజలు ఆరోపిస్తున్నారని తాజా సర్వేలో వెలుగు చూసింది. ప్రధాన మంత్రిగా మళ్లీ నరేంద్ర మోడీ వస్తారని అధిక శాతం అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఆపరేషన్ కమల: కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు రూ. కోట్లు ఆఫర్, ఐటీ, ఏసీబీకి ఫిర్యాదు, బీజేపీ!ఆపరేషన్ కమల: కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు రూ. కోట్లు ఆఫర్, ఐటీ, ఏసీబీకి ఫిర్యాదు, బీజేపీ!

లోక్ సభ ఎన్నికలు కొన్ని నెలల్లో జరగనున్న నేపధ్యంలో ఇండియా టుడే- యాక్సిస్ మై ఇండియా కర్ణాటకలో సర్వే చేపట్టింది. కర్ణాటకతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఇండియా టుడే-యాక్సిస్ మై ఇండి సర్వే చేపట్టి ఫలితాలు విడుదల చేసింది.

పని చెయ్యని ప్రభుత్వం

పని చెయ్యని ప్రభుత్వం

కర్ణాటకలోని కాంగ్రెస్-జేడీఎస్ పార్టీల సంకీర్ణ ప్రభుత్వం పనితీరు బాగాలేదని 35 శాతం అభిప్రాయం వ్యక్తం చేశారని సర్వే తెలిపింది. 23 శాతం మంది కుమారస్వామి ప్రభుత్వం పనితీరు బాగుందని కితాబు ఇచ్చారు. 28 శాతం మంది కర్ణాటకలోని సంకీర్ణ ప్రభుత్వం పనితీరు పర్వాలేదని అభిప్రాయం వ్యక్తం చేశారని సర్వే తెలిపింది.

 ప్రజల అభిప్రాయం

ప్రజల అభిప్రాయం

కర్ణాటకలో మొత్తం 11,480 మంది నుంచి అభిప్రాయాలు సేకరించి అధ్యయనం చేసి సర్వే విడుదల చేశారు. కర్ణాటక ప్రభుత్వ తీరుపై అత్యధిక శాతం మంది అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇదే సందర్బంలో కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ పనితీరు పై కన్నడిగులు వారి అభిప్రాయాలు వ్యక్తం చేశారు.

ప్రధాని మోడీVS రాహుల్ గాంధీ !

ప్రధాని మోడీVS రాహుల్ గాంధీ !

కర్ణాటకలో కేంద్ర ప్రభుత్వం తీరుపై కన్నడిగులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి అత్యధిక సీట్లు వస్తాయని అంటున్నారు. ప్రధాని మంత్రిగా మళ్లీ నరేంద్ర మోడీ వస్తారని 55 శాతం మంది, రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి కావాలని 42 శాతం మంది కన్నడిగులు అభిప్రాయం వ్యక్తం చేశారని సర్వే వివరించింది.

తాగు నీరు సమస్య

తాగు నీరు సమస్య


కర్ణాటకలో జరిగిన సర్వేలో ఆ రాష్ట్రంలో ఉన్న సమస్యలపైన ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేశారు. మొదట తాగునీటి సమస్య ఎక్కువగా ఉందని, దానిని పరిష్కరించాలని ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేశారు. రెండో సమస్య మరుగుదోడ్లు, మూడు సమస్య వ్యవసాయం అని ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేశారు. రూపాయి విలువ పడిపోవడం, పెట్రోల్, డీజల్ ధరలు పెరిగిపోవడంతో నిత్యవసర వస్తువుల ధరలు అధికం అయ్యాయని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారని సర్వే తెలిపింది.

 బీజేపీకి చాన్స్

బీజేపీకి చాన్స్


2018లో కర్ణాటకలో జరిగిన శాసన సభ ఎన్నికల్లో ప్రజలు 104 స్థానాల్లో బీజేపీని గెలిపించి అగ్రస్థానంలో పెట్టారు. అయితే బీఎస్. యడ్యూరప్ప దూకుడు తనంతో మూడురోజుల్లో బీజేపీ ప్రభుత్వం కుప్పకూలిపోయింది. దీనిని అవకాశంగా తీసుకున్న కాంగ్రెస్ (80), జేడీఎస్ (37) పార్టీలు కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేశాయి. అయితే కర్ణాటకలో ప్రజలు ఇప్పటికీ బీజేపీ వైపు మొగ్గుచూపిస్తున్నారని తాజా సర్వేలో వెలుగు చూసింది.

English summary
Political Stock Exchange: In a survey conducted by India Today- Axis My India, performance by HD Kumaraswamy lead coalition govt in Karnataka is not good and people are not satisfied. Karnataka people also say Narendra Modi should become PM again.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X