వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జైల్లో శశికళకు రాజభోగాలు: ఐదు గదులు, వంట మనిషితో ప్రత్యేక వసతులు

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: దివంగత జయలలిత నెచ్చెలి శశికళ జైల్లో రాజభోగాలు అనుభవిస్తున్నారట. ఆమె పరప్పన అగ్రహార జైల్లో శిక్షను అనుభవిస్తోన్న విషయం తెలిసిందే. అయితే జైల్లో ఆమె ఎలా ఉన్నారనే విషయం సమాచార హక్కు చట్టం ద్వారా వెలుగు చూసింది. ఎన్ మూర్తి అనే సామాజికవేత్త ఈ వివరాలు తెలుసుకున్నారు. జైల్లో శశికళకు ప్రత్యేక వసతులు కల్పిస్తున్నారు.

ఆయన మాట్లాడుతూ... శశికళ విషయంలో జైలు అధికారులు తప్పుడు ప్రచారం చేశారన్నారు. ఆమెకు వీఐపీ సౌకర్యాలు కల్పిస్తున్నారనే విషయం ఇప్పుడు బహిర్గతమైందన్నారు. తొలుత ఆమెకు ఒక గది మాత్రమే కేటాయించారని, ఆమె పక్కనున్న నాలుగు గదుల్లో 2017 ఫిబ్రవరి 14 వరకు మహిళా ఖైదీలు ఉన్నారన్నారు. ఆ తర్వాత వారందరినీ వేరే గదులకు తరలించి, అయిదు గదులను శశికళకే కేటాయించారన్నారు.

Politician outside, VIP in jail: Sasikala gets special treatment in prison, probe reveals

ఆమెకు వంట చేయడం కోసం ప్రత్యేకంగా ఒక ఖైదీని కేటాయించారని చెప్పారు. ఆమెను చూసేందుకు పెద్ద సంఖ్యలో విజిటర్స్‌ను అనుమతిస్తున్నారని చెప్పారు. వారంతా నేరుగా ఆమె గదికే వెళ్లి మూడు, నాలుగు గంటలు ఉంటున్నారని చెప్పారు.

శశికళకు ప్రత్యేక వసతులు కల్పిస్తున్నారంటూ జైళ్ల శాఖ డీఐజీ రూప 2017 జూలైలో ఆరోపించారు. ఈ వసతుల కోసం జైలు అధికారులకు శశికళ రూ.2 కోట్ల లంచం ఇచ్చారని ఆమె చేసిన వ్యాఖ్యలు నాడు సంచలనం రేపాయి. ఇప్పుడు సమాచార హక్కు చట్టం ద్వారా ఆ వ్యాఖ్యలు నిజమని తేలాయి.

English summary
Sasikala, the live in aide of former Tamil Nadu Chief Minister J Jayalalithaa, has been enjoying VIP facilities in jail, a query under the Right to Information Act has found. The 59 year old, who is serving a four year jail term after being convicted in disproportionate assets case, had managed to get many of the privileges she was not entitled to including five rooms, a private cook and kitchen space, and an endless stream of visitors.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X