వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఓటెత్తిన ప్రముఖులు..సజావుగా సాగుతున్న ఆరో దశ పోలింగ్..

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ : ఏడు రాష్ట్రాల్లోని 59 నియోజకవర్గాల్లో ఆరో విడత పోలింగ్ సజావుగా సాగుతోంది. ఓటుహక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు ఉత్సాహం చూపుతున్నారు. ఎండ పెరిగేలోపు ఓటు వేసేందుకు జనం ఉదయం నుంచే పోలింగ్ బూత్‌ల వద్ద బారులు తీరారు. పలువురు రాజకీయ నాయకులతో పాటు సెలబ్రిటీలు క్యూలైన్లో నిలబడి ఓటు హక్కు వినియోగించుకున్నారు.

టీడీపీని పక్కనబెట్టి వైసీపీ, టీఆర్ఎస్‌తో కాంగ్రెస్ మంతనాలు జరపుతోందన్న వార్తలపై మీ కామెంట్ ఏంటి? టీడీపీని పక్కనబెట్టి వైసీపీ, టీఆర్ఎస్‌తో కాంగ్రెస్ మంతనాలు జరపుతోందన్న వార్తలపై మీ కామెంట్ ఏంటి?

ఓటేసిన ప్రెసిడెంట్

ఆరో దశ ఎన్నికల్లో దేశ ప్రథమ పౌరుడు రామ్‌నాథ్ కోవింద్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. రాష్ట్రపతి భవన్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌లో ఆయన ఓటు వేశారు. కాంగ్రెస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ ఔరంగజేబ్ లైన్‌లోని ఎన్పీ సీనియర్ సెకండరీ స్కూల్‌లో ఓటు వేశారు. ఢిల్లీ మాజీ సీఎం, ఈశాన్య ఢిల్లీ కాంగ్రెస్ అభ్యర్థి షీలా దీక్షిత్ ఈస్ట్ నిజాముద్దీన్ పోలింగ్ బూత్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు.

క్యూకట్టిన బీజేపీ ప్రముఖులు

ఢిల్లీ బీజేపీ చీఫ్, ఈశాన్య ఢిల్లీ అభ్యర్థి మనోజ్ తివార్ యమునా విహార్ పోలింగ్ బూత్‌లో ఓటు వేశారు. భోపాల్ బీజేపీ అభ్యర్థి సాధ్వీ ప్రగ్యాసింగ్ ఠాకూర్ ఉదయమే ఓటు హక్కు వినియోగించుకున్నారు. మాజీ క్రికెటర్, తూర్పు ఢిల్లీ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి గౌతం గంభీర్ ఆయన సతీమణితో కలిసి రాజీందర్‌నగర్‌లోని పోలింగ్ బూత్‌లో ఓటు వేశారు. హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ కర్నల్‌లో ఏర్పాటుచేసిన పోలింగ్‌ బూత్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు.

గురుగ్రామ్‌లో ఓటేసిన కోహ్లీ

ఆమ్‌ ఆద్మీ పార్టీ నేత, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా సతీమణి సీమతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. పాండవ్ నగర్‌లోని పోలింగ్ బూత్‌లో ఆయన ఓటు వేశారు. ఈస్ట్ ఢిల్లీ ఆప్ అభ్యర్థి ఆతిషి జంగ్‌పురాలోని కమలా నెహ్రూ గవర్నమెంట్ సర్వోదయ విద్యాలయ పోలింగ్ బూత్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ హర్యానా గురుగ్రామ్‌లోని పైన్‌క్రెస్ట్ స్కూల్‌లో ఓటు వేశారు. ఆరో దశ ఎన్నికల్లో తొలుత ఓటేసిన వారిలో ఒకరిగా నిలిచారు.

English summary
President Ram Nath Kovind, cricketer Virat Kohli, Gautam Gambhir, who is making his electoral debut from East Delhi, were among the early voters as polling began in 59 seats spread across six states and union territory in the sixth phase of the Lok Sabha elections. BJP candidate from Bhopal, Pragya Thakur, was one of the first candidates to cast vote today. Congress President Rahul Gandhi walked down from his residence to his polling booth.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X