వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సూపర్ స్టార్ రజనీ తన రాజకీయ ప్రత్యర్థి: బాంబు పేల్చిన హీరో కమల్ హాసన్, సినిమాలు !

|
Google Oneindia TeluguNews

Recommended Video

మా దారులు ఎప్పటికి వేరే....కుండబద్దలు కొట్టిన కమల్

చెన్నై: సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాలు ఎలా ఉంటాయో తనకు మాత్రం ఇప్పటి వరకూ అర్థం కావడంలేదని, అయితే తన రాజకీయాల మీద పూర్తి స్పష్టత ఉందని బహుబాష నటుడు, దర్శక నిర్మాత, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ అన్నారు. ఇద్దరి రాజకీయాలు వేర్వేరుగా ఉంటాయని, సిద్దాంతాలు మాత్రం ఒక్కటిగా ఉండవని, ఆయన తన రాజకీయ ప్రత్యర్థి అయ్యే అవకాశం ఉందని కమల్ హాసన్ బాంబు పేల్చారు.

ప్రజలు క్షమించరు

ప్రజలు క్షమించరు

రాజకీయాల్లో ఒక వర్గం మాత్రమే తనకు కావాలని అననుకోవడం లేదని, అన్ని వర్గాల వారిని కలుపుకుని తాను ముందుకు వెలుతానని హీరో కమల్ హాసన్ చెప్పారు. ఓ వర్గం వారితో రాజకీయాలు చేయాలనుకుంటే ప్రజలు తనను క్షమించరని హీరో కమల్ హాసన్ స్పష్టం చేశారు.

మత రాజకీయాలు !

మత రాజకీయాలు !

తన రాజకీయాలు ఎలా ఉంటాయో ఇప్పటికే ప్రజలకు వివరించానని కమల్ హాసన్ అన్నారు. మత రాజకీయాలు మాత్రం తాను చెయ్యనని కమల్ హాసన్ చెప్పారు. మత రాజకీయాలు చెయ్యడానికి ఇప్పటికే చాల మంది తయారైనారని కమల్ హాసన్ పరోక్షంగా బీజేపీని విమర్శించారు.

రజనీకాంత్ పార్టీ

రజనీకాంత్ పార్టీ

సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాలు ఎలా ఉంటాయో ఇప్పటికీ ఎవ్వరికీ అర్థం కావడంలేదని, ఆయన కూడా ఇంత వరకూ సిద్దాంతాలు ప్రకటించలేదని కమల్ హాసన్ చెప్పారు. అయితే రజనీకాంత్ రాజకీయాలు ఆధ్యాత్మికంగా ఉంటాయని అంచానా వేస్తున్నానని కమల్ హాసన్ అభిప్రాయం వ్యక్తం చేశారు.

రజనీకి దూరం !

రజనీకి దూరం !

తన సిద్దాంతాలు, రజనీకాంత్ సిద్దాంతాలు వేరుగా ఉంటే మా ఇద్దరి రాజకీయ పార్టీలు కలిసే ప్రసక్తేలేదని కమల్ హాసన్ కుండలు బద్దలుకొట్టి చెప్పారు. అయితే రజనీకాంత్ సిద్దాంతాలు తన సిద్దాంతాలకు అనుగుణంగా ఉంటే ఇద్దరూ కలిసే విషయంలో అప్పుడు ఆలోచిస్తామని కమల్ హాసన్ అన్నారు.

సినిమా, రాజకీయల్లో పోటి !

సినిమా, రాజకీయల్లో పోటి !

దశాభ్దాలుగా సినిమా రంగంలో మా ఇద్దరి మధ్య పోటీ ఉందని, అయితే రజనీకాంత్ తీసిన లాంటి సినిమాలు తాను తియ్యలేదని, తాను తీసినలాంటి సినిమాలు రజనీకాంత్ చెయ్యలేదని, రాజకీయాల్లో కూడా అలాగే ఉండే పరిస్థితి ఏమైనా వస్తుందేమో వేచిచూడాలని, రజనీకాంత్ తన రాజకీయ ప్రత్యర్థి అయ్యే అవకాశం ఉంటుందని కమల్ హాసన్ వివరించారు.

English summary
As observers keenly watch the yet-to-unfold politics of actors Rajinikanth and Kamal Haasan, the latter on Friday admitted there was bound to be a “divide” between him and his film industry “competitor”-turned political opponent.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X