వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఒక్కరు ఒకే స్థానం నుండి, రెండు స్థానాల నుండి పోటీ చేస్తే ,ఖర్చును భరించాలి

ఒకే అభ్యర్థి రెండు స్థానాల నుండి పోటీ చేయకుండా చట్టాన్ని సవరించాలని, లేదా ఉప ఎన్నికలకు కారణమైన అభ్యర్థుల నుండి ఉప ఎన్నికల ఖర్చును వసూలు చేయాలనిఈసీ కేంద్రాన్ని కోరింది.

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ :ఎన్నికల్లో ఓకే అభ్యర్థి వేర్వేరు స్థానాల నుండి పోటీ చేయడంపై ఎన్నికల సంఘం కేంద్రానికి కీలకమైన సిఫారసు చేసింది. ఒకే అభ్యర్థి రెండు చోట్ల నుండి పోటీ చేయడాన్ని నివారించేలా చట్ట సవరణ చేయాలని ఈసీ కేంద్రాన్ని కోరింది. ఒకవేళ ఈ అవకాశం కల్పించినా, ఉఫ ఎన్నికలకు కారణమైన అభ్యర్థి నుండి ఎన్నికల ఖర్చును వసూలు చేయాలని ప్రతిపాదించింది.

ఎన్నికల చట్టసవరణ కోసం ఎన్నికల కమీషన్ కీలకమైన సవరణనను ప్రతిపాదించింది. అయితే ఈ ప్రతిపాదనపై కేంద్రం ఏ రకంగా నిర్ణయం తీసుకొంటుందో చూడాలి. ఎన్నికల సంస్కరణలు తేవాలని కొన్ని రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే తాజాగా ఎన్నికల కమీషన్ ప్రతిపాదించిన సిఫారసు పై రాజకీయ పార్టీలు ఏ రకంగా స్పందిస్తాయో చూడాలి

ఒకే అభ్యర్థి రెండు వేర్వేరు అసెంబ్లీ స్థానాల్లో లేదా, ఒక అసెంబ్లీ లేదా పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేసే అవకాశం ఉంది. ఎంఏల్ఏ తో పాటు శాసనమండలి స్థానానికి కూడ పోటీ చేసేంుదకు వెసులుబాటు ఉంది.

చట్టం లో ఉన్న వెసులుబాటును ఆసరాగా చేసుకొని కొందరు ప్రముఖులు ఎన్నికల సమయాల్లో రెండు స్థానాల నుండి పోటీ చేస్తుంటారు. ఎన్నికల అయ్యాక ఒక స్థానానికి రాజీనామా చేస్తారు. ఈ స్థానంలో అనివార్యంగా ఉప ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్థితులు ఉంటాయి.

ఈసీ కీలక సిఫారసు

ఈసీ కీలక సిఫారసు

ఒకే అభ్యర్థి రెండు స్థానాల నుండి పోటీ చేసినప్పుడు ఒక్క స్థానం నుండి ఖచ్చితంగా ప్రాతినిథ్యం వహిస్తాడు. మరో స్థానానికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. అయితే రాజీనామా చేయడంతో జరిగే ఉప ఎన్నికల ఖర్చును ఉప ఎన్నికకు కారణమైన అభ్యర్థి నుండి వసూలు చేయాలని ఈసీ కేంద్రానికి సిఫారసు చేసింది. లేదా ఒకే అభ్యర్థి రెండు స్థానాల నుండి పోటీ చేసే వెసులుబాటును కూడ ఎత్తివేయాలని ఎన్నికల కమీషన్ కేంద్రానికి సిఫారసు చేసింది. ఈ మేరకు చట్టాన్ని సవరించాలని కోరింది.

పార్టీలు అంగీకరిస్తాయా

పార్టీలు అంగీకరిస్తాయా

ఎన్నికల కమీషన్ ఇచ్చిన సిఫారసులను రాజకీయపార్టీలు అంగీకరిస్తాయా అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఒకే అభ్యర్థి రెండు చోట్ల పోటీ చేసే వెసులుబాటు ప్రముఖులను కాపాడాయి. ఎన్ టి ఆర్ గతంలో కల్వకుర్తి, హిందూపురం అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసిన సమయంలో కల్వకుర్తిలో ఆయన ఓటమిపాలయ్యారు. హిందూపురం లోవిజయం సాధించారు. చిరంజీవి తిరుపతిలో గెలిచినా, తన స్వంత నియోజకవర్గం పాలకొల్లులో ఓటమిపాలయ్యారు. కెసిఆర్ గజ్వేల్ నుండి అసెంబ్లీకి, మెదక్ పార్లమెంట్ స్థానం నుండి పోటీచేశారు. ఈ రెండు స్థానాల్లో ఆయన విజయం సాధించారు. రాజకీయ పార్టీలను నడిపే నాయకులు, ప్రముఖులు, సిఎం స్థాయి అభ్యర్థులకు ఈ వెసులుబాటు కలిసివస్తోంది.అయితే ఎన్నికల కమీషన్ ఇచ్చిన సిఫారసు ను అన్ని రాజకీయపార్టీలు సమర్థించే పరిస్థితి ఉంటుందా అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.అయితే మోడీ కూడ రెండు పార్లమెంట్ స్థానాల నుండి గత ఎన్నికల్లో పోటీ చేశాడు వారణాసి స్థానాన్ని ఉంచుకొని మరో స్థానానికి ఆయన రాజీనామా చేశారు.

1951 చట్టం ఏం చెబుతోంది

1951 చట్టం ఏం చెబుతోంది


1951 ప్రజా ప్రాతినిథ్య చట్టం పకారం ఒక వ్యక్తి సాధారణ ఎన్నికలు, లేదా ఉప ఎన్నికలు లేదా మండలి ఎన్నికల్లో గరిష్టంగా రెండు స్థానాల్లో మాత్రమే పోటీచేసేందుకు అనుమతి ఇచ్చింది.రెండు స్థానాల్లో గెలిచినా ఒకే స్థానం నుండి ప్రాతినిథ్యం వహించాలని ఈ చట్టం సూచించింది. 1996 లో ఈ చట్టానికి సవరణ చేశారు. ఈ సవరణ చేయకముందు అయితే ఒక అభ్యర్థి ఎన్ని స్థానాల నుండైనా పోటీచేసే అవకాశం ఉండేది. అయితే 1996 లో అప్పటి ప్రభుత్వం ఈ చట్టాన్ని సవరించింది. ఒక అభ్యర్థి రెండు స్థానాల నుండి పోటీచేసేలా అవకాశం కల్పించింది.

అసెంబ్లీకి ఐదు లక్షలు, పార్లమెంట్ కు 10 లక్షలు వసూలు చేయాలి

అసెంబ్లీకి ఐదు లక్షలు, పార్లమెంట్ కు 10 లక్షలు వసూలు చేయాలి

ఒకే అభ్యర్థి రెండు స్థానాల నుండి విజయం సాధిస్తే ఒక్క స్థానానికి ఖచ్చితంగా రాజీనామా చేయాల్సిందే. అయితే ఆయన వల్ల జరిగే ఉప ఎన్నికలకు ఖర్చును కూడ ఈసీ ప్రతిపాదించింది. అసెంబ్లీ ఎన్నికలకు ఐదు లక్షలకు, పార్లమెంట్ స్థానానికి 10 లక్షలను ఖర్చుగా ఈసీ ప్రతిపాదించింది.చాలా కాలం నుండి ఈసీ ఈ తరహ ప్రతిపాదనలను ప్రభుత్వాల ముందుకు తెస్తోంది. అయితే పాలకులు మాత్రం ఈ తరహా సంస్కరణలకు మాత్రం సానుకూలంగా ఉండడం లేదు. తాము ప్రతిపాదించిన ఎన్నికల సంస్కరణల్లోని సెక్షన్ 33(7)ను మార్చాలని ఈసీ కోరుతోంది. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖకు ఈసీ లేఖ రాసింది.

ఉప ఎన్నికలతో ప్రజలపై అదనపు భారం

ఉప ఎన్నికలతో ప్రజలపై అదనపు భారం

ఒకే అభ్యర్థఇ రెండు స్థానాల్లో పోటీచేయడం వల్ల ఉపఎన్నికలు అనివార్యంగా నిర్వహించాల్సిన పరిస్థితి ఉంటుంది. అయితే ఎన్నికల నిర్వహాణతో ప్రజలపై అదనంగా భారం పడే అవకాశం ఉంది. ఈ ఉప ఎన్నికల కారణంగా పెద్దగా ప్రయోజనం ఉండకపోయినా ఈ ఖర్చును ప్రభుత్వాలు ప్రజలపైనే పడుతోంది.ఎన్నికల సంస్కరణలపై రిటైర్డ్ జడ్జి ఎపి షా నేతృత్వంలో గతంలో ఏర్పాటు చేసిన కమీషన్ కూడ ఒకే అభ్యర్థి రెండు స్థానాల నుండి పోటీ చేయకుండా చట్టసవరణ చేయాలని ప్రతిపాదించింది. అయితే ఈ సిఫారసులను మాత్రం అమలుకునోచుకోలేదు.

English summary
the election commission has asked the central governament to amend laws to bar people from contesting two seats.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X