Pollachi: కాలేజ్ అమ్మాయిలు, ఆంటీల గ్యాంగ్ రేప్ లో ట్విస్ట్, అధికార పార్టీ స్టూడెంట్ లీడర్స్ అరెస్టు !
చెన్నై/ పొల్లాచ్చి/ కోయంబత్తూరు: కాలేజ్ అమ్మాయిలు, యువతులు, ప్రేమికులను బెదిరించి ప్రియురాలిపై, వివాహిత మహిళలపై అత్యాచారం చేస్తున్న సెక్స్ రాకెట్ ముఠా దారుణాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. తాజాగా తనపై అత్యాచారం జరిగిందని ఓ యువతి కోర్టులో రహస్యంగా మహిళా న్యాయమూర్తి ముందు స్టేట్ మెంట్ ఇచ్చింది. అధికార పార్టీ అండతో ఆ పార్టీ స్టూడెంట్ లీడర్స్, ఆ పార్టీ యువజన విభాగం నాయకులు కర్మకాండ తవ్వేకొద్ది బయటకు రావడంతో ప్రజలు, పోలీసులు, బాధితుల కుటుంబ సభ్యులు హడలిపోతున్నారు. ప్రముఖ పర్యాటక కేంద్రంగా ఈ గ్యాంగ్ రేప్ ముఠా ఇంతకాలం రెచ్చిపోవడం కలకలం రేపింది.

పరిచయం అవసరం లేని పొల్లాచ్చి
తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లాలోని పొల్లాచ్చి పేరు పర్యాటకులకు పెద్దగా పరిచయం చెయ్యనవసరం లేదు. తమిళ, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ సినిమా షూటింగ్ లతో పొల్లాచ్చి ఎప్పుడు కళకలలాడుతుంటుంది. సినిమా షూటింగులతో పాటు పొల్లాచ్చిలోని సుందరమైన ప్రాంతాలు చూడటానికి ప్రతినిత్యం వేలాది మంది పర్యాటకులు ఆ ప్రాంతాలకు వెలుతుంటారు.

కాలేజ్ అమ్మాయిలు, యువతులపై గ్యాంగ్ రేప్ లు
పొల్లాచ్చిలో ఇటీవల కాలేజ్ లో చదువుకుంటూ ఏకాంతంగా గడపడానికి వెళ్లిన ప్రేమికులను బెదిరించి అమ్మాయిలు (ప్రియురాలు)పై అత్యాచారాలు జరిగాయి. కాలేజ్ అమ్మాయిలతో పాటు అమ్మాయిలు, వివాహిత మహిళల మీద పొల్లాచ్చిలో అనేక అత్యాచారాలు జరిగాయని వెలుగు చూడటంతో స్థానికులు, ప్రేమికులు హడలిపోయారు.

సోషల్ మీడియాలో రేప్ వీడియోల కలకలం
కాలేజ్ అమ్మాయిలు, యువతులు, వివాహిత మహిళలపై సామూహిక అత్యాచారం చేసే సమయంలో కొందరు వాటిని వీడియోలు తీసి సోషల్ మీడియాలో విడుదల చేశారు. అన్నా మమ్మల్ని వదిలేయండి, ఇక ముందు ఇటువైపు కన్నెత్తికూడా చూడము అంటూ యువతులు వేడుకుంటున్న ఆడియో టేపులు, వీడియోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడం కలకలం రేపింది.

సీబీఐ ఎంట్రీ
ప్రముఖ పర్యాటక కేంద్రం పొల్లాచ్చిలో పదేపదే గ్యాంగ్ రేపులు జరగడంతో స్థానిక పోలీసులు అలర్ట్ అయ్యారు. అయితే అధికార పార్టీ నాయకుల ఒత్తిడితో పోలీసులు తూతూ మంత్రంగా రేప్ కేసులు విచారణ చేస్తున్నారని ఆరోపణలు రావడం రాజకీయంగా ప్రకంపనలు రేపింది. తమిళనాడులో అధికారంలో ఉన్న అన్నాడీఎంకే నాయకులకు రేప్ కేసులతో సంబంధం ఉందని ఆరోపణలు వచ్చాయి. పొల్లాచ్చి రేప్ కేసుల విచారణ సీబీఐ చేతికి వెళ్లి పోయింది.

అధికార పార్టీ స్టూడెంట్ లీడర్స్ అరెస్టు
పొల్లాచ్చి రేప్ కేసుల్లో అన్నాడీఎంకే పార్టీ విద్యార్థి విభాగం కార్యదర్శి అరులాతలం, షేక్ బాబు, హెరాన్ పాల్ తో పాటు మరో ముగ్గురిని సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. నలుగురు రేప్ కేసు బాధితులు ధైర్యంగా ముందుకు వచ్చి సీబీఐ అధికారుల ముందు సాక్షం చెప్పడంతో శబరిరాజ్, సతీష్, వసంతకుమార్, తిరునావక్కరసు, మణివన్నన్ తో సహ మొత్తం 8 మందిని సీబీఐ అధికారులు అరెస్టు చేశారు.

కాలేజ్ అమ్మయిలతో ఇంత దారుణమా
కాలేజ్ అమ్మాయిలు, ప్రేమికులను బెదిరించి ప్రియురాళ్లను, వివాహిత మహిళలపై గ్యాంగ్ రేప్ లు చేశారని వెలుగు చూడటం కలకలం రేపింది. తమకు జరిగిన అన్యాయం గురించి నలుగురు బాధితులు సీబీఐ అధికారుల ముందు స్టేట్ మెంట్ ఇచ్చారు. ఇప్పుడు కోయంబత్తూరు మహిళా కోర్టు న్యాయమూర్తి తిలకవతి ముందు హాజరైన మరో యువతి రహ్యసంగా తన మీద రేప్ చేసిన వారి అనావళ్లతో పాటు కొందరి పేర్లు చెప్పి స్టేట్ మెంట్ ఇవ్వడం కలకలం రేపింది.

నమ్మకం లేదనే సీబీఐ ఎంట్రీ
స్థానిక పోలీసులు, రేప్ కేసు నిందితులు కుమ్మక్కు అయ్యారని ఆరోపణలు రావడంతో సీబీఐ ఎంట్రీ ఇచ్చింది. ఇప్పటికే కోర్టులో రహస్యంగా సాక్షం చెప్పిన యువతి చెప్పిన ఆధారంగా ముగ్గురిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. రేప్ లో అరెస్టు అయిన విద్యార్థి విభాగం నాయకులు, యువజన విభాగం నాయకులను అన్నాడీఎంకే పార్టీ నుంచి బహిష్కరించారు. ఈ సెక్స్ రాకెట్ ముఠాలో ఇంకా కొందరు ప్రముఖులు చిక్కుకునే అవకాశం ఉందని వెలుగు చూడటంతో స్థానిక రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది.