వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

116 స్థానాల్లో కొనసాగుతున్న పోలింగ్

|
Google Oneindia TeluguNews

సార్వత్రిక ఎన్నికల్లో కీలకమైన మూడో విడత పోలింగ్ సజావుగా కొనసాగుతోంది. 13 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 116 నియోజకవర్గాల్లో ప్రజలు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఉదయం నుంచే భారీ సంఖ్యలో ఓటర్లు పోలింగ్ సెంటర్‌ల వద్ద క్యూ కట్టారు. 1640 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఈవీఎంలలో నిక్షిప్తం చేస్తున్నారు. మూడో దశలో 115 నియోజకవర్గాల్లో పోలింగ్ జరగాల్సి ఉండగా.. త్రిపురలోని తూర్పు లోక్‌సభ స్థానం ఎన్నిక వాయిదా పడటంతో మూడో దశలో నిర్వహిస్తున్నారు.

మూడో దశ పోలింగ్‌లో పలువురు ప్రముఖుల భవితవ్యాన్ని ఓటర్లు ఈవీఎంలలో నిక్షిప్తం చేయనున్నారు. కాంగ్రెస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, సమాజ్‌వాదీ నేత ములాయం సింగ్ యాదవ్‌తో పాటు జయప్రద, వరుణ్ గాంధీ, సుప్రియా సూలే, శశిథరూర్, మల్లిఖార్జున్ ఖర్గే తదితరులు పోటీ చేస్తున్న స్థానాలకు ఈ దశలోనే పోలింగ్ జురుగుతోంది.

అక్కడి నుంచే గౌతం గంభీర్ పోటీ...న్యూ ఢిల్లీ సీటు మీనాక్షి లేఖికి ఇచ్చిన బీజేపీఅక్కడి నుంచే గౌతం గంభీర్ పోటీ...న్యూ ఢిల్లీ సీటు మీనాక్షి లేఖికి ఇచ్చిన బీజేపీ

Polling begins for third phase of election

లోక్‌సభతో పాటు ఒడిశాలోని 42 అసెంబ్లీ సీట్లకు కూడా ఈ దశలోనే ఎన్నిక జరుగుతోంది. ఈ దఫా ఎన్నికల్లో 18.56కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వీరి కోసం ఎన్నికల సంఘం 2.10లక్షల పోలింగ్ స్టేషన్లు ఏర్పాటుచేసింది. సాయంత్రం ఆరింటి వరకు పోలింగ్ కొనసాగనుంది.

English summary
Nearly 18.5 crore voters in 13 states and Union Territories Dadra and Nagar Haveli and Daman and Diu will decide who will represent them in the parliament for the next five years. The voting time for Phase 3 elections is from 7 am to 6 pm.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X