వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రంజాన్ సమయంలో సార్వత్రిక ఎన్నికలా, కానీ భయంలేదు: మమతా బెనర్జీ పార్టీ నేత

|
Google Oneindia TeluguNews

కోల్‌కతా: సార్వత్రిక ఎన్నికల నగారా మోగింది. ఏప్రిల్ 11వ తేదీ మొదలయ్యే పోలింగ్ ఏడు ఫేజుల్లో నిర్వహిస్తారు. మే 23వ తేదీన ఫలితాలు రానున్నాయి. సార్వత్రిక ఎన్నికలు ఎప్పుడూ మార్చి, ఏప్రిల్, మే నెలల్లో జరుగుతుంటాయి. అయితే, ఈసారి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఓ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ మేరకు టీఎంసీ సీనియర్ నేత, మంత్రి ఫర్హద్ ఖాన్ కొత్తగా తెరపైకి ఓ అంశాన్ని తీసుకువచ్చారు.

ఇండియా టీవీ సర్వే: మోడీదే హవా.. ఏ రాష్ట్రంలో ఎన్ని సీట్లు అంటే, తెరాసకు 14, వైసీపీకి 22, టీడీపీకి 3ఇండియా టీవీ సర్వే: మోడీదే హవా.. ఏ రాష్ట్రంలో ఎన్ని సీట్లు అంటే, తెరాసకు 14, వైసీపీకి 22, టీడీపీకి 3

ముస్లీం ఓట్లు అవసరం లేదా, అసలు రంజాన్ సమయంలో పలు కీలక రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నాయని ఆయన అంటున్నారు. ఎన్నికల సంఘాన్ని తాము ప్రశ్నించడం లేదని, ఈసీకి తాము గౌరవం ఇస్తామని, ఈసీకి తాము ఎట్టి పరిస్థితుల్లోను వ్యతిరేకం కాదని, కానీ ఏడు ఫేజ్‌లలో జరిగే ఎన్నికల్లో రంజాన్ పర్వదినం ఉండే నెల రోజులు కూడా ఉందని చెప్పారు.

Polls during Ramadan: BJP doesnt want minorities to vote, says TMC leader

ముఖ్యంగా బీహార్, ఉత్తర ప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఆ సమయానికి ఎన్నికలు ఉంటున్నాయని, రంజాన్ సమయంలో రోజా ఉండే వారికి ఆ సమయంలో ఓటు వేయడం ఇబ్బంది అవుతుందని చెప్పారు. ఈ రాష్ట్రాల్లో ముస్లీం జనాభా ఎక్కువగా ఉందని చెప్పారు. ఈసీ దీనిని దృష్టిలో పెట్టుకోవాలని చెప్పారు.

లోకసభ ఎన్నికలకు సంబంధించిన మరిన్ని వార్తలు

బీజేపీకి మైనార్టీ ఓట్లు అవసరం లేదా అని ఆయన ప్రశ్నించారు. కానీ దీనిపై తమకు ఎలాంటి ఆందోళన లేదని, ప్రజలు బీజేపీని ఓడించేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. కాగా, ఏడు ఫేజ్‌లలో ఎన్నికలను పశ్చిమ బెంగాల్‌లోని విపక్షాలు స్వాగతించాయి. బెంగాల్లో శాంతిభద్రతలు దారుణంగా ఉన్నాయని, ఇలాంటి పరిస్థితుల్లో ఎక్కువ పేజ్‌లలో ఎన్నికలు మంచిదేనని అభిప్రాయపడ్డారు. పశ్చిమ బెంగాల్లో ఏడు ఫేజ్‌లలో ఎన్నికలు జరగనున్నాయి.

English summary
Hours after the Election Commission announced the seven-phase schedule for Lok Sabha polls, political wrangling has begun and has taken a seemingly communal tone.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X