వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

క్రికెట్ కంటే ఢిల్లీ కాలుష్యం ముఖ్యం : మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్

|
Google Oneindia TeluguNews

ఢిల్లీలో కాలుష్యానికి రాజకీయా కోణం అంటుకుంటుంది. దేశరాజధాని అయిన ఢిల్లీలో కాలుష్యం విపరీతంగా పెరగడం సర్వసాధరణంగా మారుతున్న తరుణంలో బీజేపీ ఎంపీ ,మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ పెరుగుతున్న కాలుష్యంపై ఆందోళన వ్యక్తం చేశారు. క్రికెట్ కంటే కాలుష్య సమస్య ప్రధానమని ఆయన ఈ సంధర్భంగా అన్నారు. ఈ సంధర్భంగా ఢిల్లీ కాలుష్యంతో ముఖ్యమంత్రి కేజ్రీవాల్ పై పరోక్షంగా విమర్శలు చేశారు. కాలుష్యంపై ప్రజలు అలోచించాలని ఆయన కోరారు.

క్రికెట్ కంటే కాలుష్యం ముఖ్యం

క్రికెట్ కంటే కాలుష్యం ముఖ్యం

నవంబర్ మూడున ఢిల్లీలోని ఫిరోజ్‌ షా కోట్ల మైదానంలో ఇండియా- బంగ్లాదేశ్‌ల మధ్య క్రికెట్ మ్యాచ్ జరగనున్న విషయం తెలిసిందే.. అయితే ప్రస్తుతం నెలకోన్న కాలుష్యం నేపథ్యంలో మ్యాచ్‌ను రద్దు చేయాలనే వాదనలు వినిపిస్తున్నాయి. మ్యాచ్ రద్దుపై క్రికెటర్ గౌతమ్ గంబీర్ సైతం స్పందించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. దీంతో నగరంలో జరగనున్న క్రికెట్ కంటే పెరుగుతున్న కాలుష్యమే ముఖ్యమని బీజేపీ ఎంపీ, మాజీ క్రికెటర్ అయిన గౌతమ్ గంభీర్ వ్యాఖ్యానించారు.

మ్యాచ్‌ను మార్చాలి

మ్యాచ్‌ను మార్చాలి

ఈ సంధర్భంగా క్రికెట్ కంటే ఢిల్లీలో పెరుగుతున్న కాలుష్యం పై అలోచించడం చాల ముఖ్యమని ఆయన అభిప్రాయపడ్డారు. మ్యాచ్ జరుగుతుందా లేదా అనే ప్రశ్న కంటే అక్కడ ఏ స్థాయిలో కాలుష్య కోరలు విషం గక్కుతున్నాయో తెలుసుకోవడం ముఖ్యమని అన్నారు. ఢిల్లీలో క్రిడాకారులతో పాటు సామాన్య ప్రజలు కూడ ఉంటారని, ప్రజలతో పోల్చితే మ్యాచ్ అనేది చాలా చిన్న విషయమని ఆయన పేర్కోన్నారు. ఇప్పటికే కాలుష్య కోరల్లో ఢిల్లీ ఉన్న నేపథ్యంలో క్రికెట్ మ్యాచ్‌ను ఇతర స్టేడియంకు మార్చాలని కోరాలని ఆయన చెప్పారు.

 యాథావిధిగా క్రికెట్ మ్యాచ్

యాథావిధిగా క్రికెట్ మ్యాచ్

ముఖ్యంగా చలికాలంలో పోగమంచుతో పాటు ఇతర వాహానాల వెదజల్లే కారకాలతో ఢిల్లీ ప్రజలు ఊపిరి పీల్చుకోవడం చాల కష్టంగా మారుతోంది. దీనికి తోడు ఇటివల జరిగిన దీపావళీ పండగ సంధర్భంగా నగరం మరింత కాలుష్యానికి గురైంది. నగరమంతా పొగమంచుతో నిండిపోయింది. అయితే నవంబర్ మూడున బంగ్లాదేశ్ మరియు భారత్‌ల మధ్య కొనసాగనున్న మ్యాచ్‌కు ఇది అడ్డంకిగా మారుతుందని అంతా భావిస్తున్నారు. దీంతో మ్యాచ్ రద్దు అవుతుందా అనే కోణంలో క్రికెట్ అభిమానుల ఆలోచనలు కొనసాగాయి.. అయితే మ్యాచ్ జరిగి తీరుతుందని బీసీసీఐ ప్రకటించింది. ఇంకా మ్యాచ్ జరిగేందుకు మరిన్ని రోజులు ఉన్న నేపథ్యంలో కాలుష్యం తగ్గుతుందని బీసీసీఐ వర్గాలు భావిస్తున్నాయి.

English summary
Delhi should be concerned about pollution levels rather than hosting a cricket match, BJP leader Gautam Gambir said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X