• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

Poonam Pandey: సెక్సీ వీడియోలు తీశారు, పూనమ్ దెబ్బతో పోలీసులకు పూతరేకులు, ఉద్యోగాలు గోవింద !

|

గోవా/ ముంబాయి/ న్యూఢిల్లీ: బాలీవుడ్ నటి, హాట్ మోడల్ పూనమ్ పాండే చేసిన వెదవ పనికి ఓ పోలీసు అధికారితో పాటు పోలీసులపై వేటు పడింది. నిషేధిత ప్రాంతంలోని బీచ్ లో బహిరంగంగా అసభ్య వీడియోలు షూట్ చేసి వాటిని తీసుకెళ్లి సోషల్ మీడియాలో పోస్టు చేసిన పూనమ్ పాండే ఫ్రీ పబ్లిసిటీ సంపాధించుకుంది. దెబ్బకు దెయ్యం దిగింది అనే సామెతలాగా పూనమ్ పాండే వయ్యారాలు చూసి సోల్లు కార్చుకుని నిషేధిత ప్రాంతంలో అశ్లీల వీడియోలు తియ్యడానికి అనుమతి ఇవ్వడమే కాకుండా ఆమె అందాలు చూసి మురిసిపోయిన పోలీసు అధికారులకు ఇప్పుడు పూతరేకులు చేతిలో పెట్టి ఇంటికి పంపించేయడంతో వాళ్లు తలలు పట్టుకుని లబోదిబో అంటున్నారు.

Home Stay: మైసూరు ఆంటీలు, మండ్య బజ్జీలు, రేట్లు డేట్లు ఫిక్స్, లాక్ డౌన్ నష్టాలు, హైటెక్ స్కెచ్ !Home Stay: మైసూరు ఆంటీలు, మండ్య బజ్జీలు, రేట్లు డేట్లు ఫిక్స్, లాక్ డౌన్ నష్టాలు, హైటెక్ స్కెచ్ !

 పూనమ్ పాండే రచ్చరచ్చ

పూనమ్ పాండే రచ్చరచ్చ

బాలీవుడ్ నటి, హాట్ మోడల్ పూనమ్ పాండే ఏం చేసినా హాట్ టాపిక్ అవుతోంది. తన అందచందాలతో ఎప్పుడు పడితే అప్పుడు అశ్లీలంగా ఫోటోలు, వీడియోలు తీసి వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్న పూనమ్ పాండే నా అందచందాలు చూసి ఎంజాయ్ చెయ్యండి అంటూ కుర్రకారును రెచ్చగొడుతోంది.

 గోవా చావోలి డ్యామ్

గోవా చావోలి డ్యామ్

గోవాలోని బీచ్ ల్లో ఎంజాయ్ చెయ్యాలని కొన్ని కోట్ల మంది ఆశపడుతుంటారు. పర్యాటకులు, విహారయాత్రకు వచ్చే వాళ్లు గోవా బీచ్ లో సరదాగా గడపడానికి గోవా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇదే సమయంలో గోవాలో కొన్ని నిషేధిత ప్రాంతాలు ఉన్నాయి. గోవాలోని నిషేధిత ప్రాంతాల్లో కోనకూనాలోని చావోలి డ్యామ్ ప్రాంతం కూడా ఉంది.

 పూనమ్ ను చూసి సోల్లు కార్చుకున్న పోలీసులు

పూనమ్ ను చూసి సోల్లు కార్చుకున్న పోలీసులు

ఇటీవల గోవాకు వెళ్లిన పూనమ్ పాండే నిషేధిత ప్రాంతం అయిన చావోలి డ్యామ్ పరిసర ప్రాంతాల్లో వీడియో షూట్ చెయ్యడానికి ప్రయత్నించింది. ఆ సందర్బంలో స్థానిక కోనకూనా పోలీసు అధికారులకు సమాచారం ఉన్నా పూనమ్ పాండే విషయంలో చూసిచూడనట్లు వ్యవహరించారని తెలిసింది. పూనమ్ పాండే అందచందాలు చూసి సోల్లు కార్చుకున్న స్థానిక పోలీసు అధికారులు చావోలి డ్యామ్ పరిసర ప్రాంతాల్లో వీడియో షూట్ చెయ్యడానికి హాట్ బ్యూటీ పూనమ్ పాండేకి అనుమతి ఇచ్చేశారు.

 పూనమ్ దెబ్బతో పూతరేకులు

పూనమ్ దెబ్బతో పూతరేకులు

చావోలి డ్యామ్ పరిసర ప్రాంతాల్లో పూనమ్ పాండే అశ్లీలంగా వీడియో షూట్ చేసింది. పూనమ్ పాండే ఆమెకు ఎలాకావాలంటే అలా ఎడిటింగ్ చేసుకుని ఆ వీడియోలు తీసుకెళ్లి సోషల్ మీడియాలో పోస్టు చెయ్యడంతో అవి విపరీతంగా వైరల్ అయ్యాయి. కుర్రకారుకు కిక్కు ఎక్కిపోవడంతో పూనమ్ పాండే అశ్లీల వీడియోలు, ఫోటోలు షేర్ చెయ్యడంతో గోవాలో కలకలం రేపింది. నిషేధిత ప్రాంతంలో పూనమ్ పాండే అశ్లీల వీడియోలు, ఫోటోలు తీసుకోవడానికి మీరు ఎలా అనుమతి ఇస్తారు ? అంటూ గోవా ప్రభుత్వం మీద అక్కడి ప్రతిపక్ష పార్టీల నాయకులు తీవ్రస్థాయిలో విరుచుకుపడటంతో గొడవ పెద్దదైయ్యింది.

 చేసిన పాపం ఊరికేపోలేదు

చేసిన పాపం ఊరికేపోలేదు

పూనమ్ పాండే చిత్రీకరించిన అశ్లీల వీడియోల కారణంగా మహిళలపై లైంగిక దౌర్జన్యాలు ఎక్కువ అయ్యే అవకాశం ఉందని, ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ప్రాంతంలో షూటింగ్ లు చెయ్యడానికి ఎలా అనుమతి ఇస్తారని గోవా ఫార్వోడ్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున్న ఆందోళనలు, ధర్నాలు చెయ్యడంతో పరిస్థితి చెయ్యిదాటిపోయింది. పూనమ్ పాండే వివాదం ముదిరి పెద్దది కావడంతో గోవా ప్రభుత్వం ఉలిక్కిపడింది.

 మా ఉసురు పోసుకుంటావా ?

మా ఉసురు పోసుకుంటావా ?

పూనమ్ పాండే అశ్లీల వీడియోలు చిత్రీకరించడానికి అనుమతి ఇచ్చారని ఆరోపిస్తూ కోనకూనా పోలీస్ స్టేషన్ ఇన్స్ పెక్టర్ తుకారాం చహ్వాన్ తోపాటు కొందరు పోలీసులను సస్పెండ్ చేస్తూ సీనియర్ పోలీసు అధికారి నెల్సన్ అల్బుకర్క్ ఆదేశాలు జారీ చేశారు. మొత్తం మీద హాట్ బ్యూటీ పూనమ్ పాండే దెబ్బతో పోలీసు అధికారుల ఉద్యోగాలు ఊడిపోయాయి. మహాతల్లి నీ పుణ్యమా అంటూ మా ఉసురు పోసుకున్నావా అంటూ పోలీసు అధికారులు, వారి కుటుంబ సభ్యులు పూనమ్ పాండేకి శాపనార్తాలు పెడుతున్నారు.

English summary
Poonam Pandey Controversy: Police inspector Suspended Who Permitted Shoot to Poonam Pandey Obscene Video Goa.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X