వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మల మూత్రాలను ఫ్రిజ్‌లో దాచారు, ఎందుకంటే?

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: గురుగ్రామ్‌కు చెందిన రైతు రజ్బీర్ యాదవ్ పోలంలో ఆకాశం నుండి ఓ పెద్ద బండరాయి లాంటి ఘన పదార్ధం పడింది, ఆ సమయంలో భారీ శబ్దం కూడ వచ్చింది. అయితే గోధుమ రంగులో ఉండడమే కాకుండా ముక్కలు ముక్కలుగా విడిపోయింది. దీంతో ఆదేమిటో తెలుసుకొనేందుకు చాలా మంది ఆసక్తిని చూపారు. చాలా విలువైన పదార్ధంగా భావించి కొందరు ఈ ముక్కలను ప్రిజ్‌లో దాచుకొన్నారు. అయితే తాము దాచుకొన్న వస్తువుల గురించి తెలుసుకొన్న స్థానికులు అనవసరంగా వాటిని ఫ్రిజ్‌లో పెట్టామని తీవ్రంగా కలత చెందారు.

గురుగ్రామ్‌కు చెందిన రైతు రజ్బీర్ యాదవ్ శనివారం ఉదయం తాను పొలంలో పనిచేస్తున్న సమయంలోనే ఆకాశం నుండి గోధుమ వర్ణంలో ఉన్న ఓ ఘన పదార్ధం ఆకాశం నుండి కింద పడింది. ఆ సమయంలో పెద్ద శబ్దం కూడ వచ్చింది. దీంతో స్థానికులు దాన్ని చూసేందుకు వచ్చారు. కొందరు ఆ ఘన పదార్ధాన్ని తమ ఇళ్ళలోని ఫ్రిజ్‌ల్లో కూడ దాచుకొన్నారు.

తొలుత దీన్ని ఉల్క శకలంగా అనుమానించారు. దీంతో వాతావరణ శాఖాధికారులకు సమాచారమిచ్చారు. దీంతో వాతావరణశాఖాధికారులు డిజాస్టర్ మేనేజ్ మెంట్ అధికారులు ఈ పదార్ధాన్ని పరీక్షించారు.విమానాల్లోని మలమూత్ర వ్యర్థాలకు ఇది ఘన రూపంగా తేల్చి చెప్పారు. దీన్ని బ్లూ ఐస్ అంటారని శాస్త్రవేత్తలు నిర్ధారించారు.

అప్పుడప్పుడు విమానాల్లో నుంచి ఇవి లీకై పడుతుంటాయని అధికారులు తేల్చి చెప్పారు. ఈ విషయం విన్న అక్కడి వారంతా కూడా దాదాపు వాంతులు చేసుకున్నంత పనిచేశారు. అత్యుత్సాహంతో కొందరు ఫ్రిజ్‌ల్లో పెట్టుకొని తప్పు చేశామని భావించారు.వెంటనే ఫ్రిజ్‌ల్లో నుండి దాన్ని తీసిపారేశారు.

English summary
A group of villagers in Gurgaon received a crash course on 'celestial gifts' on Saturday. The biggest lesson don't put them in the fridge. And if their experience were to be ever made into a movie, some of those who witnessed the daylong drama might even suggest the title, 'Poop-li Live'.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X