వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇక ‘సెయింట్‌’ మదర్‌ థెరిసా: పోప్ ఫ్రాన్సిస్ ప్రకటన

|
Google Oneindia TeluguNews

వాటికన్‌ సిటీ: మదర్ థెరిస్సా.. అంటే పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు. కాగా, మానవతా మూర్తి మదర్‌ థెరిసాకు ఆదివారం 'సెయింట్‌' హోదా ప్రకటించారు రోమన్ క్యాథలిక్ చర్చ్ పోప్ ఫ్రాన్సిస్. ప్రపంచం నలుమూలల నుంచి వాటికన్ సిటీకి చేరుకున్న లక్షలాది మంది థెరిస్సా అభిమానుల సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది.

ఆదివారం వాటికన్‌ నగరంలో మతగురువుల జాబితాలో చేర్చే ఉత్సవంలో పోప్‌ ఫ్రాన్సిస్‌ థెరిసాకు సెయింట్‌(పవిత్ర) హోదా ప్రకటించారు. భారత్‌ నుంచి విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌ నేతృత్వంలోని 12 మంది సభ్యుల బృందం ఈ కార్యక్రమానికి హాజరైంది.

మదర్‌ థెరిసా స్థాపించిన 'మిషనరీస్‌ ఆఫ్‌ ఛారిటీ' సుపీరియల్‌ జనరల్‌ సిస్టర్‌ మేరీ ప్రేమ ఆధ్వర్యంలో దేశంలోని విభిన్న ప్రాంతాలకు చెందిన 40 మందికి పైగా నన్స్‌ కూడా పాల్గొన్నారు.

Pope Francis declares Mother Teresa as Saint Teresa of Calcutta

కోల్‌కతా వీధుల్లో 45 సంవత్సరాల పాటు పేదలు, రోగుల సేవలో నిమగ్నమైన మదర్‌ థెరిసాకు సెయింట్‌ హోదా ఇవ్వనున్నట్లు మార్చి నెలలో పోప్‌ ఫ్రాన్సిస్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ప్రక్రియ కోసం కనీసం రెండు మహిమలు చోటుచేసుకోవాల్సి ఉండగా.. ఆ రెండు ఘటనల్నీ గుర్తించారు.

2002లో వాటికన్‌ అధికారికంగా తొలి మహిమను గుర్తించింది. కడుపులో కణతిలో బాధపడిన మోనికా బెర్సా అనే బెంగాలీ గిరిజన మహిళకు 1998లో నయమైన ఘటనను గుర్తించింది. రెండో మహిమ బ్రెజిల్‌లో చోటుచేసుకుంది. థెరిసా ప్రార్థనల ఫలితంగా ఓ వ్యక్తి అద్భుతరీతిలో కోలుకున్నట్లు గుర్తించారు.

సెయింట్ కావాలంటే ఏ వైద్యులూ నయం చేయని వ్యాధిని ప్రార్థనల ద్వారా నయం చేసి ఉండాలి. థెరిస్సా ఇలా అద్భుతంగా నయం చేసిన రెండు కేసులను ఆమె మరణానంతరం వాటికన్ సిటీ గుర్తించడంతో ఆమెను సెయింట్‌గా ప్రకటించే వీలు కలిగింది.

1910, ఆగస్టు 26, మాసిడోనియా స్కోప్జేలో జన్మించిన మదర్ థెరిసా పేరు ఆగ్నెస్‌ గోన్‌క్సా బోజాక్సియు. ఆమె భారతదేశానికి వచ్చి ఇక్కడే ప్రజలకు చేసుకుంటూ భారతీయురాలిగానే 1997, సెప్టెంబరు 5న కోల్‌కతాలో తుదిశ్వాస విడిచారు.

English summary
Pope Francis today declared revered nun Mother Teresa a saint in a canonisation mass at St Peter's square.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X