• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

2036కి 152 కోట్లకు భారత జనాభా... ఎన్నో మార్పులు... ఏ రాష్ట్రంలో ఎంత పెరుగుతుందో తెలుసా...

|

రాబోయే 16 ఏళ్లలో భారత్ జనాభా మరో 10శాతం పెరగనుందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటైన ఓ టెక్నికల్ గ్రూప్ అంచనా వేసింది. అంటే, ప్రస్తుతం ఉన్న 138 కోట్ల నుంచి 152.2కోట్లకు చేరుతుందని పేర్కొంది. '2011-2036 కాలంలో భారత్ జనాభా 121.1 కోట్లు నుంచి 152.2కోట్లకు పెరగవచ్చు. అంటే ఏడాదికి 1.0శాతం చొప్పున 25 ఏళ్లలో 25.7శాతం మేర పెరుగుదల నమోదవవచ్చు. దీంతో దేశంలో ఒక చదరపు కి.మీ జనసాంద్రత 368 నుంచి 463 వరకు పెరిగే అవకాశం ఉంది.' అని తాజా రిపోర్టులో ఆ టెక్నికల్ గ్రూప్ వెల్లడించింది.

ఏ ప్రాతిపదికన ఈ లెక్క...

ఏ ప్రాతిపదికన ఈ లెక్క...

కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జనాభా అంచనాల కోసం ఏర్పాటైన ఈ టెక్నికల్ గ్రూప్‌లో ఆరోగ్య మంత్రిత్వ శాఖకు చెందిన సీనియర్ అధికారులు,నీతి ఆయోగ్ అధికారులు,స్వంతంత్ర అకడమిక్స్ ఉన్నారు. 'కోహర్ట్ కాంపోనెంట్ మెథడ్' విధానంలో జనాభా అంచనాలను లెక్కకట్టారు. ఇందుకోసం సంతానోత్పత్తి,మరణాలు,వలసలను ప్రాతిపదికగా తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్, అసోం, బీహార్, గుజరాత్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, తెలంగాణ, ఉత్తర ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్,ఉత్తరాఖండ్,జమ్మూకశ్మీర్,ఢిల్లీల్లో ఇదే విధానం ద్వారా జనాభా లెక్కలను అంచనా వేశారు.

దేనికి ఉపయోగం....

దేనికి ఉపయోగం....

'దేశంలో జనాభా పరంగా సంభవిస్తున్న మార్పులకు సంబంధించి మేము సేకరించిన డేటా,సమాచారం కేంద్ర మంత్రిత్వ శాఖలకు,విధాన నిర్ణేతలకు,రీసెర్చ్ ఇనిస్టిట్యూట్స్‌కు,భవిష్యత్ ప్రణాళికలు రూపొందించేవారికి ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాం. ముఖ్యంగా ఆరోగ్యం,పోషణ,జనాభాకు సంబంధించి స్పష్టమైన అవగాహనకు ఈ డేటా ఉపయోగపడనుంది.' అని తాజా రిపోర్టులో రిజిస్ట్రార్ జనరల్,సెన్సస్ కమిషనర్ వివేక్ జోషి తెలిపారు.

పెరిగే ఏజ్ గ్రూప్స్ ఏంటి...తగ్గేవి ఏంటి...

పెరిగే ఏజ్ గ్రూప్స్ ఏంటి...తగ్గేవి ఏంటి...

రాబోయే 16 ఏళ్లలో భారత్‌లో పనిచేసే వయసున్న యువతీ,యువకుల సంఖ్య పెరుగుతుందని... అదే సమయంలో వృద్దుల సంఖ్య కూడా పెరిగి మరణాల్లో పెరుగుదల నమోదవుతుందని రిపోర్టులో పేర్కొన్నారు. '2011-2036 వరకూ సంతానోత్పత్తిలో తగ్గుదల కారణంగా 15 ఏళ్ల కంటే తక్కువ వయసున్నవారి నిష్పత్తి 30.9 శాతం నుంచి 20శాతం వరకు తగ్గనుంది. అదే సమయంలో 15-59 వయసు గ్రూపుతో పాటు 60 ఏళ్లు పైబడ్డ వృద్దుల నిష్పత్తి కూడా పెరగనుంది. సంతానోత్పత్తిలో తగ్గుదల,ఆయుర్దాయం పెరుగుదల కారణంగా 2011లో దేశంలో 10 కోట్లుగా ఉన్న వృద్దుల జనాభా 2036 నాటికి 23 కోట్లకు చేరింది. మొత్తం జనాభాలో వారి వాటా 8.4శాతం నుంచి 14.9శాతానికి పెరగనుంది.' అని రిపోర్టులో వెల్లడించారు.

పెరిగే ఏజ్ గ్రూప్స్ ఏంటి...తగ్గేవి ఏంటి...

పెరిగే ఏజ్ గ్రూప్స్ ఏంటి...తగ్గేవి ఏంటి...

పనిచేసే వయసున్నవారి జనాభా(15-59) 2011లో ఉండగా 2036లో 20.9కోట్లకు పెరగనుందని రిపోర్టులో పేర్కొన్నారు. అలాగే 5-14 ఏళ్ల వయసున్న వారి జనాభా 2011లో 25.4శాతం ఉండగా 2036 నాటికి 20.9శాతానికి పడిపోనుంది. 15-24 ఏళ్ల వయసున్నవారి జనాభా 2011లో 23.3శాతం ఉండగా 2021 నాటికి 25.1శాతం పెరిగి,2036లో 22.9శాతానికి చేరింది. 2011లో దేశంలో 24 ఏళ్లు,అంతకంటే తక్కువ వయసు ఉన్నవారు 50.2శాతం ఉండగా... 2036లో ఆ జనాభా 35.3శాతానికి చేరనుంది. ఇందులో 0-14 ఏళ్ల వయసున్నవారు 20.2 శాతం కాగా 15-24 ఏళ్ల వయసున్నవారు 15.1శాతం ఉంది ఉండనున్నారు.

రాష్ట్రాలవారీగా...

రాష్ట్రాలవారీగా...

2011-2036 కాలంలో దేశంలో అత్యధికంగా ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో 98శాతం మేర జనాభా పెరగనుంది. ఇక ఈ 25 ఏళ్లలో అత్యంత తక్కువగా హిమాచల్ ప్రదేశ్‌లో కేవలం 6శాతం మేర మాత్రమే జనాభా పెరగనుంది.ఆంధ్రప్రదేశ్, పంజాబ్, జమ్మూకశ్మీర్, మణిపూర్, కర్ణాటక,ఒడిశా,మహారాష్ట్ర,తెలంగాణ,పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో 10-20శాతం మేర జనాభా పెరగనుంది. గుజరాత్,రాజస్తాన్,మధ్యప్రదేశ్,నాగాలాండ్,ఉత్తరప్రదేశ్,మిజోరాం,పుదుచ్చేరి,మేఘాలయ,బిహార్,అరణాచల్ ప్రదేశ్,దాద్రా నగర్ హవేలీ,డామన్ డయ్యూల్లో 30శాతం జనాభా పెరగనుంది.

ఆ ఐదు రాష్ట్రాల్లోనే 50శాతం...

ఆ ఐదు రాష్ట్రాల్లోనే 50శాతం...

2011-2036 వరకు 25 ఏళ్ల కాలంలో పెరగనున్న 31.1కోట్ల జనాభాలో 17 కోట్ల జనాభా బిహార్‌,ఉత్తరప్రదేశ్,మహారాష్ట్ర,పశ్చిమ బెంగాల్,మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోనే పెరగనున్నట్లు రిపోర్టు వెల్లడించింది. అంటే మొత్తం జనాభా పెరుగుదలో 50శాతం ఈ ఐదు రాష్ట్రాల్లోనే జరిగింది. ఈ ఐదు రాష్ట్రాల్లో 25ఏళ్ల పాటు ఏడాదికి 1శాతం చొప్పున జనాభా పెరగనుంది. ఇక ఇందులో కేవలం ఒక్క ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనే 19శాతం జనాభా పెరగనుంది.

English summary
India’s population could increase by 10 per cent in the next 16 years from the current mark of about 138 crore, a technical group on population projections constituted by the Ministry of Health in 2014 has predicted.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X