• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కామసూత్ర పుట్టిన భారత్‌లో పోర్న్ నిషేధమా -అది కూడా కళా రూపమే: నటి సోమి అలీ సంచలనం

|

ప్రపంచంలో మరే దేశంలోనూ లేని విధంగా ప్రాచీన భారతంలో ప్రత్యేకంగా కామశాస్త్రంపై భారీ రచనలు ఉండటం, వాత్సాయనుడు రాసిన కామసూత్రాలను శృంగారానికి, సంభోగానికి ప్రామాణిక గ్రంథాలుగా పరిగణించడం తెలిసిందే. అయితే, అలాంటి గొప్ప రచనలు పుట్టిన దేశంలో ఇవాళ నీలి చిత్రాలపై నిషేధం విధించడమేంటని వాపోతున్నారు 40 ఏళ్ల సోమి అలి..

జగన్ బెయిల్ రద్దు: సాయిరెడ్డికి దేహశుద్ధి -కొట్టింది ఎవరో తెలుసా? -ఇంకొద్ది గంటల్లోనే: ఎంపీ రఘురామ జగన్ బెయిల్ రద్దు: సాయిరెడ్డికి దేహశుద్ధి -కొట్టింది ఎవరో తెలుసా? -ఇంకొద్ది గంటల్లోనే: ఎంపీ రఘురామ

రేప్ బాధిత మహిళలకు సాయంగా..

రేప్ బాధిత మహిళలకు సాయంగా..


పాకిస్తాన్ లో పుట్టి, అమెరికాలో పెరిగి నటిగా ఎదిగిన సోమి అలీ.. 90వ దశకంలో బాలీవుడ్ లోనూ ఒక ఊపు ఊపారు. సల్మాన్, సైఫ్ అలీ, సంజయ్ దత్ తదితర పెద్ద స్టార్ల సరసన పలు సినిమాలు చేశారు. అవకాశాలు తగ్గిన తర్వాత తిరితి అమెరికా వెళ్లిపోయి, సామాజిక సేవ వైపునకు మళ్లారు సోమి అలీ. ‘నో మోర్ టియర్స్' పేరుతో స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసిన ఆమె.. అత్యాచార బాధితులకు అండగా నిలుస్తున్నారు. బాలీవుడ్ తో సంబంధాల నేపథ్యంలో ప్రస్తుతం ఇండస్ట్రీని షేక్ చేస్తోన్న ‘శిల్పా షెట్టి భర్త పోర్న్ వీడియోలు' వ్యవహారంపై సోమి అలీ సీరియస్ కామెంట్లు చేశారు..

ఆ పోలీస్ బాస్ వద్దని అసెంబ్లీ తీర్మానం -రాకేశ్ ఆస్థానా నియామకంపై ఢిల్లీ ప్రభుత్వం గరంగరం -దేశంలో తొలిసారిఆ పోలీస్ బాస్ వద్దని అసెంబ్లీ తీర్మానం -రాకేశ్ ఆస్థానా నియామకంపై ఢిల్లీ ప్రభుత్వం గరంగరం -దేశంలో తొలిసారి

పోర్న్ కూడా కళా రూపమే..

పోర్న్ కూడా కళా రూపమే..


‘‘సెక్స్ లేదా పోర్న్ గురించి మాట్లాడటాన్ని ఎంతగా నిషేధిస్తే దానిపై అంతకంత ఉత్సుకత రేకెత్తుతుంది. లైంగిక జీవులుగా మానవులకు ఇది అత్యంత సహజమైన విషయం. వ్యక్తిగతంగా నటీనటులు బాధపడటం లేదా లైంగిక అక్రమ రవాణా జరగనంత వరకు ఎవరైనా అశ్లీలతను తమ వృత్తిగా ఎంచుకుంటే దాన్ని తప్పు పట్టాల్సి అవసరం లేదు. దీని గురించి తీర్పులు చెప్పే హక్కు ఇతరకులకు లేదు. పోర్న్ చిత్రాల్లో నటించేవాళ్లను సంస్కరించాలన్న ఆలోచన కూడా నాకు లేదు. అశ్లీల చిత్రాలలో పాల్గొనేవారికి లేదా వారి వృత్తిగా మార్చేవారికి వ్యతిరేకంగా నాకు ఏమీ లేదు. నిజం చెప్పాలంటే పోర్న్ కూడా కళాత్మక పురోగతే అని నేను భావిస్తాను...

  Why Surfing P**n On Android Smartphones Is Not Safe ఫోన్‌లో పోర్న్ సైట్‌లను చూడొచ్చా..?
  కామసూత్ర పుట్టిన దేశంలో ఏంటిలా?

  కామసూత్ర పుట్టిన దేశంలో ఏంటిలా?

  ఇద్దరు వ్యక్తుల మధ్య సాన్నిహిత్యం లేకుండా ఆత్మీయ ప్రేమకు అర్థమే ఉండదు. ముద్దు పెట్టుకోవడం, దగ్గరగా ఉండటం ప్రామాణాలు. 2021లో మనం అలాంటి కళను సృష్టించగలుగుతున్నాం. మానవులు లైంగిక జీవులే అన్న సత్యం సాధారణ స్థితికి వచ్చినప్పుడు మాత్రమే వాస్తవికతను అర్థం చేసుకోగలుగుతాం. రాజ్ కుంద్రా పోర్న్ వీడియోల కేసులో నేను ఎవరినీ తప్పు పట్టడంగానీ, తీర్పులు చెప్పడంగానీ చేయబోను. చేసేవాళ్లకు హాని కలగనంత వరకు అశ్లీలత వ్యతిరేకం కాబోదు. అసలు, కామసూత్ర పుట్టిన దేశంలో పోర్న్ ను నిషేధించడమేంటి విచిత్రంగా?'' అని సోమి అలీ వ్యాఖ్యానించారు.

  English summary
  Businessman and Bollywood actor Shilpa Shetty’s husband Raj Kundra’s arrest in a porn films case has shocked celebrities across the entertainment industry. Bollywood actor-turned-social activist Somy Ali too is surprised by Kundra‘s arrest, but she wonders why a country, where Kama Sutra originated, would ban porn.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X