• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

porn videos case: నగ్నంగా ఆడిషన్ -శిల్పా షెట్టి భర్తపై సాగరిక బాంబు -23దాకా రిమాండ్ -షెర్లిన్ పూనమ్ కూడా

|

బాలీవుడ్ లో వెబ్ సిరీస్ ముసుగులో నిలి చిత్రాల ఉదంతానికి సంబంధించి గంటకో సంచలనం వెలుగులోకి వస్తున్నది. పాపులర్ నటి శిల్పా షెట్టి భర్త, ఐపీఎల్ రాజస్థాన్ రాయల్స్ జట్టు సహ యజమాని, నిర్మాత రాజ్ కుంద్రా అరెస్టు తర్వాత బాధితుల తాలూకు వాగ్మూలం కీలకంగా మారింది. ఔత్సాహిక నటి, మోడల్ సాగరిక సోన సుమన్ చెప్పిన విషయాలు దుమారం రేపుతున్నాయి. పోర్న్ వీడియోల కేసులో కుంద్రా పాత్రను నిర్ధారించుకున్న తర్వాతే అరెస్టు చేశామన్న పోలీసులు... శిల్పా షెట్టి ఫ్యామిలీ కంపెనీకి చెందిన కీలక వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు. షెర్లిన్ చోప్రా, పూనమ్ పాడేల మాటలుగానూ కొన్ని వార్తలు షికారు చేస్తున్నాయి. వివరాలివి..

అవును, చంద్రబాబుకు whatsapp చేశా, తప్పేంటి? -సీఎం జగన్ pegasus వాడట్లేదా? :ఎంపీ రఘురామ మరో బాంబుఅవును, చంద్రబాబుకు whatsapp చేశా, తప్పేంటి? -సీఎం జగన్ pegasus వాడట్లేదా? :ఎంపీ రఘురామ మరో బాంబు

జులై 23 వరకు రిమాండ్..

జులై 23 వరకు రిమాండ్..

నిషేధిత పోర్న్ వీడియోల కేసులో వ్యాపారవేత్త రాజ్ కుంద్రాకు ముంబై కోర్టు ఈనెల 23 వరకు రిమాండ్ విధించింది. సినిమాలు, వెబ్‌ సిరీస్‌లో అవకాశాల పేరిట యువతులను ట్రాప్‌లోకి దించి వారితో బలవంతంగా పోర్న్‌ సినిమాలు తీయించాడనడానికి పక్కా ఆధారాలు లభించడంతో ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అతణ్ని సోమవారం రాత్రి అరెస్టు చేయడం తెలిసిందే. కుంద్రాతోపాటు ఆయన కుటుంబ వ్యాపార సంస్థల్లో టెక్నికల్ వ్యవహారాలను పర్యవేక్షించే ర్యాన్ జాన్ థార్పేను కూడా అదుపులోకి తీసుకున్న పోలీసులు.. కుంద్రాతోపాటే అతణ్ని కోర్టులో హాజరుపర్చారు. మూడు రోజుల రిమాండ్ కు అనుమతి లభించడంతో రాజ్ కుంద్రా, ర్యాన్ జాన్ నుంచి మరింత సమాచారాన్ని రాబట్టేందుకు పోలీసులు విచారణ చేయనున్నారు. కాగా,

తాలిబన్ల చేతిలో భారతీయ జర్నలిస్ట్ దానిష్ సిద్ధికి హతం-రాయిటర్స్ చీఫ్ ఫొటోగ్రాఫర్-అఫ్గాన్ అశాంతికి పాక్ ఆజ్యంతాలిబన్ల చేతిలో భారతీయ జర్నలిస్ట్ దానిష్ సిద్ధికి హతం-రాయిటర్స్ చీఫ్ ఫొటోగ్రాఫర్-అఫ్గాన్ అశాంతికి పాక్ ఆజ్యం

షెర్లిన్ చోప్రా, పూనమ్ పాండేలనూ..

షెర్లిన్ చోప్రా, పూనమ్ పాండేలనూ..

ఐపీఎల్ బెట్టింగ్, బిట్ కాయిన్ కుంభకోణం తదితర సందర్భాల్లోనూ రాజ్ కుంద్రా పేరు ప్రముఖంగా వినిపించడం తెలిసిందే. ఈ ఏడాది ఫిబ్రవరిలో ముంబై పోలీసులు ఛేదించిన పోర్న్ వీడియోల వ్యవహారంలో కీలక సూత్రధారి కూడా ఆయనే అని అప్పట్లోనే వార్తలు వచ్చినా, రాజ్ కుంద్రా తెలివిగా కోర్టు నుంచి ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. గడిచిన 5నెలల దర్యాప్తులో కుంద్రా పాత్రపై మరిన్ని ఆధారాలు లభించడం చివరికి అరెస్టుకు దారి తీసింది. కాగా, అడల్ట్ చిత్రాల స్టార్లుగా వెలుగొందుతోన్న ఒకప్పటి బాలీవుడ్ నటీమణులు షెర్లిన్ చోప్రా, పూనమ్ పాండేలను పోర్న్ ఊబిలోకి నెట్టింది కూడా రాజ్ కుంద్రానే అని తెలుస్తోంది. తొలుత సాధారణ పాత్రలు చేసిన ఆ ఇద్దరికీ ఎక్కువ డబ్బు ఆశచూపి అడల్ట్ సినిమాలు చేయించింది రాజ్ కుంద్రానే అని, అతని వల్లే తమ జీవితాలు ఇలా అయ్యాయని వాళ్లిద్దరూ వాపోయినట్లుగా జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. మరోవైపు..

వీడియో కాల్‌లో న్యూడ్ ఆడిషన్..

వీడియో కాల్‌లో న్యూడ్ ఆడిషన్..

పోర్న్ వీడియోల కేసులో శిల్పా షెట్టి భర్త రాజ్ కుంద్రా అరెస్టు తర్వాత ఆయనకు సంబంధించిన గత వ్యవహారలు హాట్ టాపిక్ గా మారాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో ముంబైలో పోర్న్ వీడియో చిత్రీకరణ గుట్టు రట్టయిన సందర్భంలో సాగరిక సోన సుమన్ అనే ఔత్సాహిక నటి, మోడల్ విడుదల చేసిన వీడియో ఒకటి ప్రస్తుతం సంచలనంగా మారింది. ‘‘లాక్ డౌన్ సమయంలో రాజ్ కుంద్రా నిర్మిస్తోన్న వెబ్ సిరీస్ లో ఆఫర్ ఉందంటూ ఉమేశ్‌ కామత్‌ అనే వ్యక్తి నుంచి నాకు ఫోన్‌ వచ్చింది. మంచి అవకాశంగా భావించి నేను సరే అన్నాను. కోవిడ్‌ టైం కాబట్టి వీడియో కాల్‌ ద్వారా ఆడిషన్ తీసుకుంటామన్నారు. తీరా వీడియో కాల్‌లో జాయిన్‌ అయ్యాక.. నన్ను నగ్నంగా ఆడిషన్‌లో పాల్గొనమన్నారు. అప్పుడు వీడియో కాల్‌లో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. ముఖం కనిపించకుండా మాస్క్ పెట్టుకున్న వ్యక్తి రాజ్ కుంద్రా అయిఉంటా. ఈ వ్యవహారాన్ని పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేయాలని కోరుతున్నాను'' అని సాగరిక చెప్పుకొచ్చారు. ముంబై పోలీసులు రాజ్ కుంద్రాను తిరిగి జులై 23న కోర్టులో ప్రవేశపెడతారు.

English summary
Businessman and husband of Bollywood actress Shilpa Shetty, Raj Kundra, has been sent to police custody till July 23. Ryan John Tharpe, entrusted with the technical aspects of Kundra's companies also sent to custody. meanwhile, actress Sagarika Shona Suman claimed that Raj Kundra had asked her for a nude audition. Sherlyn Chopra and Poonam Pandey blame Raj Kundra for ending up in adult film industry.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X