వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పోర్నోగ్రఫీ కేసు : రాజ్ కుంద్రా బెయిల్ తిరస్కరణ ..14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి శిల్పాశెట్టి భర్త !!

|
Google Oneindia TeluguNews

పోర్నోగ్రఫీ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వ్యాపారవేత్త రాజ్ కుంద్రా బెయిల్ పిటిషన్ విచారణను తిరస్కరించిన కోర్టు రాజ్ కుంద్రాకు 14 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. అశ్లీల చిత్రాల నిర్మాణం, వాటిని యాప్ ల లో అప్లోడ్ చేయడం చేసిన పోర్న్ రాకెట్ కేసులో రాజ్ కుంద్రాను జూలై 20 న ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. అతని పోలీసు కస్టడీ మంగళవారం ముగియనున్న నేపథ్యంలో
దర్యాప్తు ముగిసిందని, అతనికి బెయిల్ మంజూరు చేయాలని రాజ్ కుంద్రా న్యాయవాది బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే, ఈ పిటిషన్‌ను మేజిస్ట్రేట్ కోర్టు తిరస్కరించింది.

రాజ్ కుంద్రాకు సపోర్ట్ గా శిల్పాశెట్టి..ఆయన తీసినవి పోర్న్ వీడియోలు కాదు: పోలీసులకు వాంగ్మూలంరాజ్ కుంద్రాకు సపోర్ట్ గా శిల్పాశెట్టి..ఆయన తీసినవి పోర్న్ వీడియోలు కాదు: పోలీసులకు వాంగ్మూలం

పోర్నోగ్రఫీ కేసులో అశ్లీల చిత్రాలను నిర్మించడం, స్ట్రీమింగ్ సేవ అయిన హాట్‌షాట్స్ యాప్‌లో రాజ్ కుంద్రా ఆర్థిక లబ్ధిదారుడని పోలీసులు పేర్కొన్నారు. అయితే, రాజ్ కుంద్రా ఈ వాదనలను ఖండించారు. ఈ కేసులో రాజ్ కుంద్ర కీలక కుట్రదారుడని దానికి తగిన సాక్ష్యాలు ఉన్నాయని పోలీసులు పేర్కొన్నారు. పోర్న్ వీడియోల రాకెట్‌లో ఇప్పటివరకు 10 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి విచారణ ప్రారంభించిన ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఈ కేసుకు సంబంధించి పలు కీలక అంశాలను నమోదు చేశారు.

 Pornography case: Raj Kundra bail rejected, sent to 14-days jud Pornography case: Raj Kundra bail rejected, sent to 14-days judicial custodyicial custody

రెండు రోజుల క్రితం రాజ్ కుంద్రా భార్య బాలీవుడ్ నటి శిల్పాశెట్టిని కూడా ప్రశ్నించిన పోలీసులు, ఆమె పాత్ర పైన కూడా దర్యాప్తు చేస్తున్నారు. పోర్నోగ్రఫీ కేసులో వియాన్ ఇండస్ట్రీస్ కు చెందిన నలుగురు ఉద్యోగులు పోలీసులకు కీలక సమాచారం అందించినట్లుగా తెలుస్తుంది. ఇదే సమయంలో రాజ్ కుంద్రా శిల్పాశెట్టి దంపతుల బ్యాంకు ఖాతాలను పరిశీలించడానికి క్రైమ్ బ్రాంచ్ ఆప్టికల్స్ స్వతంత్ర ఆడిటర్ ను కూడా నియమించినట్లు సమాచారం. ఇక పోర్న్ రాకెట్ సంబంధించి మొదటి నుంచి వార్తల్లో ఉన్న నటి మోడల్ షెర్లిన్ చోప్రాకు నోటీసులిచ్చిన ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఈ రోజు ఆమెను విచారిస్తున్నారు.

English summary
businessman Raj Kundra was on Tuesday sent to judicial custody for 14 days in the porn videos racket case.Raj Kundra was arrested by the Mumbai Police on July 20 in a case related to the alleged production and distribution of pornographic films through different apps. His police custody was set to expire on Tuesday.Kundra's lawyer filed a bail plea on grounds that the investigation is over and he should be granted bail. However, the magistrate court rejected the plea.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X