వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉద్ధవ్ థాకరే కేబినెట్: పదవుల పంపకాలు: ఎన్సీపీకి లక్కీ ఛాన్స్: సేన వద్దే హోం.. కాంగ్రెస్ కు..!

|
Google Oneindia TeluguNews

ముంబై: మహారాష్ట్రలో కొలువుదీరిన శివసేన-నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ-కాంగ్రెస్ సారథ్యంలోని మహా వికాస్ అఘాడి సంకీర్ణ కూటమి సర్కార్ లో పదవుల పంపకాలు ఎట్టకేలకు పూర్తయ్యాయి. ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే.. ఈ పంపకాల్లో ఎక్కడా, ఎలాంటి లుకలుకలు గానీ, అసంతృప్తి గానీ చోటు చేసకోకుండా ఉండేలా అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు కనిపిస్తోంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సహకరించిన ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలకు సమాన ప్రాధాన్యత గల శాఖలను కేటాయించినట్లు తెలుస్తోంది.

జయంత్ పాటిల్ కు ఆర్థికం..

జయంత్ పాటిల్ కు ఆర్థికం..

ఎన్సీపీ ఎమ్మెల్యే జయంత్ పాటిల్ కు ఆర్థిక శాఖను కేటాయించారు. హోం మంత్రిత్వ శాఖను శివసేన తన వద్దే ఉంచుకుంది. శివసేనలో నంబర్ టూగా పేరున్న ఏక్ నాథ్ షిండేకు హోం మంత్రిత్వ శాఖ బాధ్యతలను అప్పగించారు. ఇక మూడో కీలకమైన రెవెన్యూ శాఖను కాంగ్రెస్ కు ఇచ్చారు. ముందుగా కుదుర్చుకున్న ఒప్పందాల ప్రకారమే పోర్ట్ ఫోలియోల పంపకాలు సాగినట్లు కనిపిస్తోంది.

పార్టీల వారీగా దక్కిన పోర్ట్ ఫోలియోలివే..

పార్టీల వారీగా దక్కిన పోర్ట్ ఫోలియోలివే..

హోం, పట్టణాభివృద్ధి, పరిశ్రమలు, పర్యావరణం, పర్యాటకం, ఉన్నత విద్య, సాంకేతిక విద్యా, క్రీడలు, యువజన వ్యవహారాలు, ఉద్యానవనం, రవాణా, మరాఠీ భాషాభివృద్ధి, సాంస్కృతిక వ్యవహారాలు, ఓడరేవుల మంత్రిత్వ శాఖలను శివసేన తన వద్దే ఉంచుకుంది. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి ఆర్థికం సహా గృహనిర్మాణం, ప్రజా ఆరోగ్యం, సహకారం, పౌర సరఫరాలు, గ్రామీణాభివృద్ధి, జలవనరులు, సామాజిక న్యాయం, ఎక్సైజ్, కార్మిక మంత్రిత్వ శాఖలను ఇచ్చారు. కాంగ్రెస్ కు రెవెన్యూ సహా పాఠశాల విద్య, పశు సంవర్ధకం, ఫిషరీష్, పబ్లిక్ వర్క్స్, గిరిజనాభివృద్ధి, టెక్స్ టైల్స్, మహిళా, శిశు సంక్షేమం, విపత్తు నిర్వహణ, వెనుకబడిన వర్గాలు వ్యవహారాలు, ఇంధన శాఖలను అప్పగించారు.

కూడికలు, తీసివేతల తరువాత..

కూడికలు, తీసివేతల తరువాత..

ముఖ్యమంత్రిగా ఉద్ధవ్ థాకరే ప్రమాణ స్వీకారం చేసిన దాదాపు రెండు వారాల తరువాత మంత్రివర్గ శాఖలను కేటాయించారు. కిందటి నెల 28వ తేదీన ఉద్ధవ్ థాకరే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఆయనతో పాటు ఆరుమంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. కూడికలు, తీసివేతల తరువాత పోర్ట్ ఫోలియోలను నిర్ధారించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం గురువారం సాయంత్రం ఉత్తర్వులను జారీ చేసింది.

English summary
A fortnight after the Uddhav Thackeray-led Maha Vikas Aghadi government took oath of the office, the Shiv Sena-NCP-Congress have finally come to an agreement on the distribution of portfolios. As per the portfolio dirtibution, the Shiv Sena will get the Home and Urban Development portfolios while the Finance and Housing will go to the Sharad Pawar-led NCP and the Congress will get the Revenue portfolio. However, no deputy chief minister has been announced, contrary to the expectations.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X