వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Omicron:ట్రావెల్ హిస్టరీ లేదు. మరీ ఎలా ఒమిక్రాన్.. బెంగళూరులో మరో పాజిటివ్.. టెన్షన్ టెన్షన్

|
Google Oneindia TeluguNews

ఒమిక్రాన్ అంటేనే భయం.. కానీ కేసులు మాత్రం వస్తున్నాయి. దేశంలో బెంగళూరులో 2 కేసులు అంటున్నారు. రాజస్తాన్‌లో కూడా అని రూమర్లు వస్తున్నాయి. వైరస్ సౌతాఫ్రికాలో వెలుగుచూసిన సంగతి తెలిసిందే. బెంగళూరులో వచ్చిన వారు సౌతాఫ్రికా నుంచి వచ్చిన వారే.. అయితే ఐటీ హబ్‌లో మరొకరికి కూడా పాజిటివ్ వచ్చింది. అయితే అతను ఏ దేశం నుంచి రాలేదు, ప్రయాణించలేదు. సో ఒమిక్రాన్ ఎలా సోకిందనే అనుమానాలు ఉన్నాయి.

అతని వయస్సు 46 సంవత్సరాలు కాగా.. అతనికి ట్రావెల్ హిస్టరీ లేదని ప్రభుత్వ వర్గాలు స్పష్టంచేశాయి. అతనికి నవంబర్ 22వ తేదీన పరీక్ష చేయగా.. పాజిటివ్ వచ్చింది. అంతకుముందు అతనికి జ్వరం, ఒళ్లు నొప్పులు ఉండేవి. దీంతో ఆర్టీ పీసీఆర్ పరీక్ష చేశారు. 22వ తేదీన సాయంత్రం 4 గంటలకు పాజిటివ్ అని వచ్చింది. తర్వాత శాంపిల్ జినొమ్ సిక్వెన్సింగ్ కోసం పంపించారు. 22వ తేదీ నుంచి అతను హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. 24వ తేదీన ఆస్పత్రిలో చేరారు. 25వ తేదీన బెంగళూరు నగర పాలక సంస్థ రికార్డులో ఉన్నారు.

positive with Omicron variant in Karnataka, but he is no travel history

మూడురోజులు చికిత్స తీసుకున్న తర్వాత నవంబర్ 27వ తేదీన ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అతను 13 మంది ప్రైమరీ కాంటాక్ట్స్, 205 సెకండరీ కాంటాక్ట్స్ ఉన్నాయి. వారిలో ముగ్గురు ప్రైమరీ కాంటాక్ట్స్, ఇద్దరు సెకండరీ కాంటాక్ట్స్ టెస్ట్ చేయించుకోగా.. పాజిటివ్ వచ్చింది. వారంతా ఇప్పుడు ఐసోలేషన్‌లో ఉన్నారు.

ఇటు సౌతాఫ్రికా నుంచి వచ్చిన వ్యక్తికి ఒమిక్రాన్ సోకిన సంగతి తెలిసిందే. 66 ఏళ్ల వ్యక్తికి ట్రావెల్ హిస్టరీ ఉంది. అతను నవంబర్ 20వ తేదీన వచ్చారు. అప్పుడు నెగిటివ్ ఉండగా.. బెంగళూరు ఎయిర్ పోర్టులో పరీక్ష చేయగా పాజిటివ్ వచ్చింది. 22వ తేదీన జినొమ్‌కు పంపించగా.. 23వ తేదీన నెగిటివ్ వచ్చింది. అతను 24 మంది ప్రైమరీ, 240 సెకండరీ కాంటాక్ట్‌గా ఉన్నాయి. అతను దుబాయ్ ట్రావెల్ చేశాడు. అన్నీ ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్ వెతికీ మరీ పరీక్షలను చేస్తున్నామని అధికారులు తెలిపారు. ఒమిక్రాన్ వచ్చిన వారికి చిన్నగా లక్షణాలు ఉన్నాయని.. అందరూ రెండు టీకాలు తీసుకున్నారని వివరించారు.

English summary
46-year-old man in Karnataka, who is among the two people found infected with the Omicron variant of coronavirus in India, is a health care worker and has no travel history.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X