• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఆన్‌లైన్ క్లాసుల తర్వాత పోర్న్ వీక్షణ -ఉద్రేకంలో అత్యాచారాలు -డీజీపీ సంచలన వ్యాఖ్యలు

|

కరోనా విలయంలో మారిన జీవనశైలి.. మగువకు మరిన్ని ఇబ్బందుల్ని తెచ్చిపెట్టింది. ఆన్ లైన్ అవసరత పెరుగుతున్నకొద్దీ అశ్లీలత కూడా సులువుగా అరచేతుల్లోకి వచ్చేసింది. ప్రధానంగా పిల్లలు స్మార్ట్ ఫోన్లను వాడటం తప్పనిసరి కావడం, దాని ప్రభావం తాలూకు దురాగతాలు కొన్ని ఇటీవల వెలుగులోకి వస్తున్నాయి. పిల్లల ఆన్ లైన్ చదువులు, బాలికలు, మహిళలపై నేరాల పెరుగుదలకు ముడి పెడుతూ రాజస్థాన్ రాజస్థాన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) ఎంఎల్ లాథేర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

జగన్‌కు వాతపెట్టి వెన్నపూస్తోన్న కేంద్రం -15 ఏళ్లలో ఏపీ సూపర్ పవర్ -దివాళ జడిలో అనూహ్య ప్రశంసలుజగన్‌కు వాతపెట్టి వెన్నపూస్తోన్న కేంద్రం -15 ఏళ్లలో ఏపీ సూపర్ పవర్ -దివాళ జడిలో అనూహ్య ప్రశంసలు

క్లాసుల తర్వాత పోర్న్

క్లాసుల తర్వాత పోర్న్

కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో విద్యార్థులు ఆన్‌లైన్ క్లాసుల కోసం స్మార్ట్‌ఫోన్లను వాడుతున్నారని, వీటిని విద్యార్థినీ, విద్యార్థులు దుర్వినియోగం చేసే అవకాశాలు ఉన్నాయని రాజస్థాన్ డీజీపీ లాథేర్ చెప్పారు. క్లాసుల తర్వాత పోర్న్ కంటెంట్ చూడటానికి స్మార్ట్‌ఫోన్లను ఉపయోగించే అవకాశం ఉందని, గత నెలలో ఝున్‌జునులో ఐదేళ్ళ బాలికపై అత్యాచారానికి పాల్పడిన యువకుడు ఇలాగే ఆన్ లైన్ క్లాసుల తర్వాత పోర్న్ చూసేవాడని డీజీపీ చెప్పారు.

 తల్లిదండ్రులకు వార్నింగ్..

తల్లిదండ్రులకు వార్నింగ్..

రాజధాని జైపూర్ లో శుక్రవారం మీడియాతో మాట్లాడిన రాజస్థాన్ డీజీపీ లాథేర్.. రాష్ట్రంలో మహిళలు, చిన్నారులపై నేరాలు పెరుగుతున్నాయనేది వాస్తవమేనని అంగీకరించారు. చట్టాల అమలుకు సంబంధించినంత వరకు పోలీసులు వేగంగానే స్పందిస్తున్నారని, నిందితులను సకాలంలోనే అరెస్టు చేస్తున్నామని ఆయన చెప్పారు. మరైతే ప్రజల ఆలోచనా విధానంలో మార్పు రావాలా? అన్న ప్రశ్నకు గత నెలలో జరిగిన ఉదంతాన్ని గుర్తు చేస్తూ, పిల్లలు చదువుకుంటారనే ఉద్దేశంతో తల్లిదండ్రులు స్మార్ట్‌ఫోన్లను ఇస్తున్నారని, ఆన్‌లైన్ క్లాసులు పూర్తయిన తర్వాత బాలలు ఆ స్మార్ట్‌ఫోన్లలో పోర్న్ కంటెంట్ చూసే అవకాశాలు ఉన్నాయని, తల్లిదండ్రులు తమ పిల్లలను ఓ కంట కనిపెట్టాలని, స్మార్ట్‌ఫోన్లను దేనికి ఉపయోగిస్తున్నారో తెలుసుకోవాలని హెచ్చరించారు.

 ఐదేళ్ల బాలికపై అత్యాచారం..

ఐదేళ్ల బాలికపై అత్యాచారం..

రాజస్థాన్ డీజీపీ ఉదాహరించిన ఆ కేసు ఝున్‌జునులో ఫిబ్రవరి 19న చోటుచేసుకుంది. స్థానికంగా ఉంటోన్న ఓ 20 ఏళ్ళ యువకుడు ఐదేళ్ళ బాలికను అపహరించి, లైంగికంగా దాడి చేసి, తీవ్రంగా గాయపర్చాడు. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదుకాగా, విచారణలో.. తాను పోర్న్ చూసేవాడినని, ఉద్రేకంలోనే బాలికను ఎత్తుకెళ్లానని చెప్పుకొచ్చాడు, చివరికి నేరాన్ని అంగీకరించడంతో కోర్టు అతనికి మరణ శిక్ష విధించింది. కేవలం 26 రోజుల్లోనే నిందితుడికి శిక్ష పడటంతో పోలీసుల పనితీరును కోర్టు ప్రశంసించింది. ఇదిలా ఉంటే..

రెండేళ్ల చిన్నారిపై రేప్..

రెండేళ్ల చిన్నారిపై రేప్..

రాజస్థాన్ లో ఐదేళ్ల బాలిపై అత్యాచార ఉదంతంపై డీజీపీ వ్యాఖ్యలు చేస్తున్న సమయంలోనే ఉత్తరప్రదేశ్ లో మరో దురాగతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మొబైల్ ఫోన్‌లో పోర్న్ వీడియోలు చూసి ఉద్రేకానికి గురైన 13 ఏళ్ల బాలుడు.. రెండేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. యూపీలోని బలియాలోని రేవతి బ్లాకులో ఈ దారుణం జరిగింది. రెండేళ్ల బాలిక ఆడుకోవడానికని పొరుగింటికి వెళ్లింది. అప్పటికే నీలి చిత్రం చూసి ఉద్రేకానికి గురైన బాలుడు ఆ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న బాలిక అమ్మమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి బాలుణ్ని అదుపు లోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు.

బందరులో సంచలనం -చింతా చిన్ని జిల్లా బహిష్కరణ -మోకా భార్య మేయరైన మరునాడే -'జగనన్న' మార్కుబందరులో సంచలనం -చింతా చిన్ని జిల్లా బహిష్కరణ -మోకా భార్య మేయరైన మరునాడే -'జగనన్న' మార్కు

English summary
Rajasthan director general of police (DGP) ML Lather on Friday said that a youth who raped a five-year-old girl in Jhunjhunu last month used to watch porn, adding that it was possible that after online classes, "children indulge in such things" DGP, while lauding the police over prompt action, asked parents to keep a strict watch on their children so that kids do not misuse digital platforms in the name of studies.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X