వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జైల్లో ధ్వంసం, కాగితాలకు నిప్పు: మళ్లీ వార్తల్లోకి ఇంద్రాణీ

తన కూతురు షీనా బోరాను హత్య చేసిన కేసులో ముంబైలోని బైకుల్లా జైలులో శిక్ష అనుభవిస్తున్న ఇంద్రాణి ముఖర్జియా మరోసారి వార్తల్లోకి ఎక్కింది.

|
Google Oneindia TeluguNews

ముంబై: తన కూతురు షీనా బోరాను హత్య చేసిన కేసులో ముంబైలోని బైకుల్లా జైలులో శిక్ష అనుభవిస్తున్న ఇంద్రాణి ముఖర్జియా మరోసారి వార్తల్లోకి ఎక్కింది.

జైల్లో గుడ్లను దొంగిలించిందనే ఆరోపణలతో ఓ మహిళా ఖైదీని జైలు అధికారులు తీవ్రంగా కొట్టిన ఘటనలో సదరు మహిళ మృతి చెందింది.

దీంతో జైలు అధికారుల అమానుష ప్రవర్తన పట్ల ఇంద్రాణితో పాటు జైల్లో ఉన్న దాదాపు 200 మంది మహిళా ఖైదీలు ఆందోళనకు దిగారు. జైల్లోని వస్తువులను ధ్వంసం చేశారు. కాగితాలకు నిప్పుపెట్టారు.

Post convict's death, Indrani Mukherjea among 200 booked for jail rioting

తమను అడ్డుకున్న అధికారులపై దాడికి దిగారు. ఈ నేపథ్యంలో, ఇంద్రాణితో పాటు మరో 200 మంది ఖైదీలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. కాగా, మహిళా ఖైదీ మృతి ఘటనకు సంబంధించి ఇప్పటికే ఐదుగురు జైలు అధికారులను ఉన్నతాధికారులు సస్పెండ్‌ చేశారు.

తన కుమార్తె షీనా బోరా హత్య కేసులో 2015లో ఇంద్రాణి అరెస్టయిన విషయం తెలిసిందే. మాజీ భర్త సంజీవ్‌ ఖన్నా, డ్రైవర్‌లతో కలిసి షీనా దారుణంగా ఇంద్రాణి హత్య చేసి శిక్ష ఎదుర్కొంటున్నారు. ఇంద్రాణి భర్త, ప్రముఖ వ్యాపార వేత్త పీటర్‌ ముఖర్జియా కూడా ఇదే కేసులో జైలుపాలయ్యారు.

English summary
Nearly 200 Byculla Jail inmates, including Indrani Mukerjea, prime accused in the Sheena Bora murder case, have been booked for rioting and other offences following the death of a woman convict.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X